తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather Trp Rating: గాడ్‌ఫాద‌ర్ టీఆర్‌పీ రేటింగ్ - సైరా త‌ర్వాత చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇదే హ‌య్యెస్ట్‌

Godfather Trp Rating: గాడ్‌ఫాద‌ర్ టీఆర్‌పీ రేటింగ్ - సైరా త‌ర్వాత చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇదే హ‌య్యెస్ట్‌

27 January 2023, 16:30 IST

  • Godfather Trp Rating: గాడ్‌ఫాద‌ర్ సినిమా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న‌మూవీగా నిలిచింది. ఇటీవ‌లే టీవీలో ప్రీమియ‌ర్ అయిన ఈ సినిమాకు వ‌చ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే...

 చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Godfather Trp Rating: చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాద‌ర్ (Godfather) మూవీ ఇటీవ‌లే టీవీలో టెలికాస్ట్ అయ్యింది. థియేట‌ర్ల‌లో యావ‌రేజ్ రిజ‌ల్ట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెర‌పై మాత్రం ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న ఈ సినిమా జెమినీ టీవీలో ప్ర‌సార‌మైంది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ఫ‌స్ట్ ప్రీమియ‌ర్‌లో గాడ్‌ఫాద‌ర్ మూవీ 7.69 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సినిమాగా గాడ్‌ఫాద‌ర్ నిలిచింది.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సైరా న‌ర‌సింహారెడ్డి 11.8 టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న‌ది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) హీరోలుగా న‌టించిన ఆచార్య 7.1, ఖైదీ నంబ‌ర్ 150 మూవీ 6.93 టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్నాయి. ఆచార్య‌, ఖైదీ నంబ‌ర్ 150తో పోలిస్తే గాడ్‌ఫాద‌ర్ సినిమాకు ఎక్కువ‌ టీఆర్‌పీ రేటింగ్‌ రావ‌డం గ‌మ‌నార్హం.

మ‌ల‌యాళ సినిమా లూసిఫ‌ర్ ఆధారంగా పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన గాడ్‌ఫాద‌ర్ సినిమాకు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో చిరంజీవి సోద‌రిగా న‌య‌న‌తార (Nayanthara) న‌టించ‌గా విల‌న్‌గా స‌త్య‌దేవ్ క‌నిపించాడు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌లో క‌నిపించారు.

ముఖ్య‌మంత్రి చ‌నిపోవ‌డంతో మాఫియా అండ‌తో రాష్ట్రాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని అనుకొన్న ఓ క్రిమిన‌ల్‌ను బ్ర‌హ్మ అనే వ్య‌క్తి ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు యాక్ష‌న్ అంశాల‌కు ప్రాధాన్య‌మిస్తూ తెర‌కెక్కిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో యావ‌రేజ్‌గా నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.