తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Bhola Shankar Release Date Postponed To May Bhola Shankar Postponed

Bhola Shankar Postponed: భోళా శంక‌ర్ పోస్ట్‌పోన్ కానుందా - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

20 January 2023, 13:50 IST

  • Bhola Shankar Postponed: చిరంజీవి భోళా శంక‌ర్ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్‌ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న భోళాశంక‌ర్‌కు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Bhola Shankar Postponed: వాల్తేర్ వీర‌య్య త‌ర్వాత చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సినిమా భోళా శంక‌ర్‌. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గురువారం నుంచి ఈసినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొద‌లుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Ramayanam: రామాయణం నుంచి లీకైన సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఫొటోలు.. మీరు చూశారా?

Adah Sharma Horror Movie: హార‌ర్ మూవీతో భ‌య‌పెట్ట‌బోతున్న‌ అదాశ‌ర్మ - సీడీ ట్రైల‌ర్ రిలీజ్‌

OTT Best Movies: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. 4 డిఫరెంట్ జోనర్.. ఎక్కడ చూడాలంటే?

Manjummel Boys OTT: అఫీషియ‌ల్ - మంజుమ్మ‌ల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - రెండు రోజులు ఆల‌స్యంగా స్ట్రీమింగ్‌

కొల్‌క‌తాను త‌ల‌పిస్తూ హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. భోళా శంక‌ర్ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు గ‌తంలో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ మార‌నున్న‌ట్లు స‌మాచారం.

వాల్తేర్ వీర‌య్య షెడ్యూల్ తారుమారు కావ‌డం, ప్ర‌మోష‌న్స్ ప్ర‌భావం భోళా శంక‌ర్ ప‌డిన‌ట్లు చెబుతున్నారు. షూటింగ్ ఆల‌స్య‌మ‌వ‌డంతో భోళాశంక‌ర్‌ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏప్రిల్ 14న నుంచి నెల రోజులు వెన‌క్కి వెళ్ల‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మే 12న భోళా శంక‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. భోళా శంక‌ర్ డిజిట‌ల్ రైట్స్‌ను షూటింగ్ ద‌శ‌లోనే నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది.

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా కీర్తిసురేష్ న‌టిస్తోంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంక‌ర్ రూపొందుతోంది. వేదాళం సినిమాలో అజిత్, శృతిహాస‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.