తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Appreciated The Team Of Sitaramam And Bimbisara

Chiranjeevi: కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు -బింబిసార‌, సీతారామం సక్సెస్ లపై చిరంజీవి ట్వీట్‌

HT Telugu Desk HT Telugu

06 August 2022, 10:04 IST

  • బింబిసార‌ (Bimbisara), సీతారామం (Sita Ramam) విజ‌యాలు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఊర‌ట‌ను, ఉత్సాహాన్నిచ్చాయ‌ని అన్నారు అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi). ఆయా సినిమా టీమ్‌ల‌ను అభినందిస్తూ శ‌నివారం చిరంజీవి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

చిరంజీవి
చిరంజీవి (twitter)

చిరంజీవి

గ‌త రెండు నెల‌లుగా టాలీవుడ్‌లో బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. జూన్‌,జూలై నెల‌ల్లో విడుద‌లైన సినిమాలు ఏవీ స‌క్సెస్‌గా నిల‌వ‌లేక‌పోయాయి. ఈ వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిన టాలీవుడ్‌కు శుక్ర‌వారం రిలీజ్ అయిన సీతారామం,బింబిసార సినిమాలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సినిమాల మౌత్ టాక్ తో పాటు వ‌సూళ్లు బాగుండ‌టంతో టాలీవుడ్ వ‌ర్గాలు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ సినిమా విజ‌యాల్ని పుర‌స్క‌రించుకొని చిత్ర యూనిట్‌పై ప‌లువురు స్టార్స్‌,ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తాజాగా బింబిసార‌,సీతారామం టీమ్‌ల‌ను అగ్ర‌హీరో చిరంజీవి అభినందించారు. ఈ మేర‌కు శ‌నివారం చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ‘ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్న ఇండ‌స్ట్రీకి ఎంతో ఊర‌ట‌ను, మ‌రింత ఉత్సాహాన్నిస్తూ కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులెప్పుడూ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపిస్తూ నిన్న విడుద‌లైన చిత్రాలు రెండూ విజ‌యం సాధించ‌డం ఎంతో సంతోషక‌రం. ఈ సంద‌ర్భంగా సీతారామం,బింబిసార చిత్రాల న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులంద‌రికీ నా మ‌నఃపూర్వ‌క శుభ‌కాంక్ష‌లు’ అంటూ చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బింబిసార చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించారు. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీతారామం సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌,మృణాళ్ ఠాకూర్‌,ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.