Brahmastra OTT Release: బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యేది ఆ ఓటీటీలోనే.. ఎప్పుడో తెలుసా?
09 September 2022, 14:40 IST
- Brahmastra OTT Release: బ్రహ్మాస్త్ర మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 9) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే థియట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది.
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్, ఆలియా
Brahmastra OTT Release: బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ : శివ ఎన్నో ఏళ్లు ఊరించి మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాయ్‌కాట్ పిలుపుల మధ్య శుక్రవారం (సెప్టెంబర్ 9) ఈ సినిమా రిలీజ్ కాగా.. పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలోని వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మార్వెల్ యూనివర్స్‌కు ఈ అస్త్రావర్స్ ఏమాత్రం తక్కువ కాదని కూడా కొందరు చెప్పడం విశేషం.
అయితే బ్రహ్మాస్త్ర రిలీజ్ రోజే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి కూడా ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అంటే హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా రానుంది. రూ.410 కోట్లతో బాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ బ్రహ్మాస్త్ర డిజిటల్ హక్కుల కోసం డిస్నీ+హాట్‌స్టార్ భారీ మొత్తమే మేకర్స్‌కు చెల్లించింది.
అయితే ఈ సినిమా ఓటీటీలో ఇప్పుడప్పుడే రావడం లేదు. భారీ బడ్జెట్, పైగా పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో చాలా రోజులే బ్రహ్మాస్త్ర కనిపించనుంది. ఆ తర్వాతే హాట్‌స్టార్‌లో ఈ మూవీ చూసే అవకాశం ఉంటుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల్లోనూ ఈ సినిమా రిలీజైంది. దీంతో ఈ ఐదు భాషల బ్రహ్మాస్త్ర వెర్షన్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.
బ్రహ్మాస్త్ర మూవీ గురించి..
అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రణ్‌బీర్, ఆలియా, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్‌లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాలో షారుక్‌ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఉంది. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా రానుండగా.. ఇప్పుడు బ్రహాస్త్ర పార్ట్ 1: శివ రిలీజైంది. ఈ రిలీజ్ రోజే బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫాక్స్ స్టార్ స్టూడియో, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
అప్పుడెప్పుడో 9 ఏళ్ల కిందట రణ్‌బీర్‌తోనే యే జవానీ హై దివానీలాంటి మ్యూజికల్ రొమాన్స్ తీసిన అయాన్ ముఖర్జీ ఇప్పుడు మన దేశ పురాణ ఇతిహాసాలు, అందులోని అస్త్రాల గురించి మూవీ తీయడం నిజంగా విశేషమే. ఈ బ్రహ్మాస్త్ర కోసమే ప్రత్యేకంగా అస్త్రావెర్స్ అనే కొత్త యూనివర్స్‌ను సృష్టించినట్లు కూడా అయాన్ చెప్పాడు.
బ్రహ్మాస్త్ర ఎలా ఉంది?
అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకోవాలని కొన్ని అతీంద్రియ శక్తులు ప్రయత్నిస్తుంటాయి. ఆ అదృశ్య శక్తులను ఎదురించి పురాతన శక్తులను కాపాడుతున్న కొన్ని అస్త్రాలతో కలిసి శివ సాగించిన పోరాటం నేపథ్యంలో బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. మైథలాజికల్ పాయింట్ ను భారీ గ్రాఫిక్స్ హంగులతో తెరపై ఆవిష్కరించారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుంది. ఈ సినిమాలో అదే చూపించారు.
శివ పాత్రలో రణ్ భీర్ కపూర్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. సూపర్ హీరో తరహా పాత్రలో చక్కటి నటను కనబరిచాడు. రణ్ భీర్, అలియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు బలంగా నిలిచింది. అమిత్ శెట్టిగా నాగార్జున పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు.