Nagarjuna Breaks into tears: ఒకే ఒక జీవితం చూసి కంటతడి పెట్టిన నాగార్జున-nagarjuna breaks into tears after watching oke oka jeevitham movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna Breaks Into Tears: ఒకే ఒక జీవితం చూసి కంటతడి పెట్టిన నాగార్జున

Nagarjuna Breaks into tears: ఒకే ఒక జీవితం చూసి కంటతడి పెట్టిన నాగార్జున

HT Telugu Desk HT Telugu
Sep 07, 2022 08:59 PM IST

Nagarjuna Breaks into Tears: ఒకే ఒక జీవితం సినిమా చూసి కంటతడి పెట్టాడు అక్కినేని నాగార్జున. ఈ మూవీలో నటించిన తన భార్య అమలను గట్టిగా హత్తుకొని అభినందించాడు.

<p>శర్వానంద్, నాగార్జున, అమల</p>
శర్వానంద్, నాగార్జున, అమల

Nagarjuna Breaks into Tears: టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాడు. ఎక్కడ కనిపించినా నవ్వుతూనే మాట్లాడతాడు. అలాంటి నాగార్జున కూడా కంటతడి పెట్టాడు. శర్వానంద్‌, అమల నటించిన ఒకే ఒక జీవితం మూవీ చూసిన అతడు బాగా ఎమోషనల్‌ అయ్యాడు. సినిమా చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది అంటూ నాగ్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

మూవీ చూసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో నాగార్జున కళ్లు చెమర్చాయి. సినిమా తీసిన వాళ్లకు హ్యాట్సాఫ్‌ అని అన్నాడు. ఒకే ఒక జీవితం ప్రివ్యూ షో మంగళవారం (సెప్టెంబర్‌ 6) హైదరాబాద్‌లో వేశారు. ఈ సినిమాను అమల, శర్వానంద్‌, ఇతర మూవీ టీమ్‌తో కలిసి నాగార్జున చూశాడు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన అతడు.. చాలా బాగా, ఎమోషనల్‌గా ఉందని అన్నాడు.

"సినిమా ఎంతో ఎమోషనల్‌గా ఉంది. అమ్మ ప్రేమ కోరుకునే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. నేను కూడా కంటతడి పెట్టాను. మా అమ్మ గుర్తొచ్చింది" అని నాగార్జున అనడం విశేషం. ఆ సమయంలో నాగార్జున కళ్లు చెమర్చాయి. సినిమా చూసిన తర్వాత అమలను కూడా అతడు హగ్‌ చేసుకొని అభినందించాడు. అటు అమల కూడా సినిమా చూసిన తర్వాత మాట్లాడింది.

ఈ ప్రివ్యూని అమల తన తల్లితో కలిసి చూసింది. దీంతో ఇది తనకు మరింత స్పెషల్‌ అని ఆమె చెప్పింది. ఒకే ఒక జీవితం ట్రైలర్‌ ఈ మధ్యే రిలీజైన విషయం తెలిసిందే. టైమ్‌ ట్రావెల్‌ స్టోరీ అయిన ఈ సినిమాలో హీరో గతంలోకి వెళ్లి తన గతాన్ని ఎలా సరి చేసుకుంటాడన్నది ముఖ్యమైన కథాంశం. శర్వానంద్‌, రీతూ వర్మ, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి నటించారు.

Whats_app_banner