Brahmamudi October 8th Episode: తాతయ్యకు ఎదురుతిరిగిన రాజ్- ఆఫీసర్ కనకేశ్వరిగా కనకం- కావ్యను కాపాడేందుకు ప్లాన్- కానీ!
08 October 2024, 7:41 IST
Brahmamudi Serial October 8th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కావ్య అగ్రిమెంట్‌పై సంతకం చేసిందని, అది ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తుందని అనామిక వార్నింగ్ ఇస్తుంది. దాంతో కనకం ప్లాన్ వేస్తుంది. సురేష్ కంపెనీకి లేబర్ ఆఫీసర్ కనకేశ్వరిగా వెళ్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో గుడిలో వేరే అమ్మాయితో రాహుల్ షికార్లు కొట్టాడని స్వప్న దగ్గర బుక్ చేస్తుంది అపర్ణ. ఎవరిని కలిశావ్ అని రాహుల్‌ను అడుగుతుంది స్వప్న. ఇక అపర్ణ అక్కడి నుంచి జారుకుంటుంది. రాహుల్ ఫోన్ వచ్చినట్లు పైకి వెళ్లబోతుంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అవుతాడు.
ఏదో తేల్చుకుంటాను అని అంటుంది కదా అని ఇందిరాదేవి వెళ్తుంది. ఎవరినీ కలిశావ్ చెప్పు. లేకుంటే ముసుగేసి కొడతాను అని స్వప్న అంటుంది. దానికి రుద్రాణి షాక్ అయి అంటే నన్ను కొట్టింది నువ్వేనా అని అడుగుతుంది. నేను కొడితే.. ఇలా మీరు నడవరు. అలాగే, ఇంట్లో గొడవలు పెట్టరు అత్త అని స్వప్న అంటుంది. రాహుల్‌ను బలవంతంగా పైకి తీసుకెళ్తుంది. రాహుల్ వద్దని బతిమిలాడుకుంటాడు. రుద్రాణి వైపు రాహుల్ చూస్తే.. తను మొహమీద తూ అని ఉమ్మేస్తుంది.
ఆఫ్ట్రాల్ అనామిక అవుతావ్
పైకి వెళ్లిన రాహుల్‌ను స్వప్న చితకబాదినట్లు సౌండ్స్‌తో చూపించారు. మరోవైపు కావ్యను కూరగాయలకు పంపిస్తుంది కనకం. అక్కడికి అనామిక వస్తుంది. ది గ్రేట్ ఎక్స్‌పో అవార్డ్ విన్నర్, ఎక్స్‌క్లూజివ్ డిజైనర్, అనామిక కంపెనీలో పని చేసే కావ్య ఇలా ఆఫ్ట్రాల్ కూరగాయలకు వెళ్లడం నాకు నచ్చడం లేదు అని అనామిక అంటుంది. ఆఫ్ట్రాల్ అనుకుని కూరగాయలు తినడం మానేస్తే అప్పుడు ఆఫ్ట్రాల్ అనామికవు అయిపోయాతావ్ అని కనకం పంచ్ వేస్తుంది.
నువ్వు వెళ్లవే. దీని తలలో ఉన్నట్లు పుచ్చులు, దీని జీవితం లాగా వాడిపోయినవి తేకు. కుక్కలకు వేసిన తినవు అని కనకం గట్టిగా ఇస్తుంది. వెళ్తాను అమ్మా. కానీ, ఈ అనామకురాలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసుకుని వెళ్తాను అని కావ్య అంటుంది. ఎలాగు మా కంపెనీలో పని చేసి నీ భర్తకు మోసం చేశావు కదా. నా కారులో పనికి తీసుకెళ్తాదామని వచ్చాను అని అనామిక అంటుంది. నీకు కొట్టి చెప్పిన, తిట్టి చెప్పిన అర్థం కాదా. మోసం చేసిన కంపెనీలో నేనేందుకు జాబ్ చేస్తాను అని కావ్య అంటుంది.
అలా ఎలా వదిలిపెడతాను. ఇన్నాళ్లు రాజ్ కంపెనీలో చేస్తే నీకు ఏం ఒరిగింది. కానీ, నేను గుర్తించాను. ఇలా మా కంపెనీలో చేరగానే ఇలా ఎక్స్ పో అవార్డ్ పెట్టాను. మా కంపెనీలో చేరితే నీకు డబ్బే డబ్బు. డబ్బు విలువ తెలియని అవివేకివి. నీకు డబ్బు విలువ ఎలా తెలుస్తుందిలే. నాలా డబ్బులో పుట్టింటే తెలిసేది అని అనామిక అంటుంది. నువ్ డబ్బులో పుట్టి పెరిగావా. కాదు. అప్పుల్లో పుట్టి పెరిగావ్. నా భర్త రెండు కోట్లు ముష్టిగా పడేస్తే తప్పా మీ నాన్నకు గతిలేదని నీకు తెలియదా అని కావ్య కౌంటర్ ఇస్తుంది.
అగ్రిమెంట్‌పై సైన్ చేసింది
కావ్య.. నువ్ తప్పా నా కంపెనీకి గతిలేదని నేను నీ దగ్గరికి రాలేదు. నీ అంతటా నువ్ రావాలి. నిన్ను అలా ఎలా వదిలేస్తాననుకున్నావ్ అని అనామిక అంటుంది. వదిలేయకపోతే ఏం చేస్తావే. నువ్ ఈ ఇంటి నుంచి ఇదే కన్నుతో, ఇదే కాలుతో వెళ్తావా. నలుగురు మోసుకెళ్లేలా చేయగలను అని కనకం వార్నింగ్ ఇస్తుంది. ఆవేశం పడకండి ఆంటీ.. ఇదే ఆవేశంతో నా కంపెనీ అగ్రిమెంట్‌లో సైన్ చేసింది. అగ్రిమెంట్ చేసిన వాళ్లు దాన్ని కాదంటే కోర్టులో శిక్షపడుతుంది. న్యాయం నా వైపు ఉంది కాబట్టి నీ కూతురు జైలుకు వెళ్తుంది అని అనామిక అంటుంది.
బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకుని కావ్య. అనవసరంగా ప్రాబ్లమ్స్‌లో పడకు. ఒకవిధంగా నువ్ రాకపోయినా నాకు లాభమే. నాకు కోర్టులో శిక్ష పడినట్లు చేసిన నీపై రివేంజ్ తీర్చుకుంటాను అని అనామిక వెళ్లిపోతుంది. దాంతో కంగారుపడిన కనకం ఏంటీ అది ఏదోదో అంటుంది. నిజంగానే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందా అని అంటుంది. అవునమ్మా.. అగ్రిమెంట్ ప్రకారం అయితే నేను వెళ్లాలి. కానీ, దుగ్గిరాల కంపెనీకి వ్యతిరేకంగా పని చేసే కంపెనీలో పని చేయను. వాళ్లకు ద్రోహం చేయను. అది ఏం చేసుకుంటుందో చేసుకోని. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా అని కావ్య అంటుంది.
ఇది ఎంత తెలివిగా ఇరికించిందే. దీనికి ఇంత ధైర్యం వచ్చిందంటే దీని వెనుక ఎవరో ఉన్నారు అని కనకం అడుగుతుంది. సామంత్ అని ఒకడున్నాడు లేడులే. వాడి పంచన చేరింది. అందుకే ఈ ధైర్యం అని కావ్య వెళ్లిపోతుంది. అగ్రిమెంట్ ఉందనే కదా అనామిక రెచ్చిపోతుంది. అసలు ఆ అగ్రిమెంటే లేకపోతే అని ఓ ప్లాన్ అనుకుంటుంది కనకం. మరోవైపు కోచింగ్ సెంటర్‌లో అడ్వాన్స్ అని ఐదు వేలు ఇస్తాడు కల్యాణ్.
నాపై నమ్మకం ఉంచండి
నేను పదివేలు అడిగాను కదా. ముందు అందరు ఇలాగే అని తర్వాత నాకు టార్చర్ పెడతారు అని కోచింగ్ సెంటర్ అతను అంటాడు. ఈలోపు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా. ఎలాగైనా అరెంజ్ చేస్తాను అని కల్యాణ్ అంటాడు. మీరు పదివేలు కట్టడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు. మొత్తం 60 వేలు ఎలా కడతారు అని అతను అడుగుతాడు. నాపై నమ్మకం ఉంచండి. ఎలాగైనా కడతాను అని కల్యాణ్ అంటే.. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మా బాస్ నన్ను తిడతాడు అని అతను అంటాడు.
అయ్యో.. మీకు ఆ పరిస్థితి తీసుకురాను. టైమ్‌కు కట్టేస్తాను అని కల్యాణ్ అంటాడు. మీకు రెండు రోజుల టైమ్ ఇస్తున్నాను. మళ్లీ నాకు మాట తీసుకురండి అని అతను అంటాడు. థ్యాంక్యూ అని కల్యాణ్ అంటాడు. తర్వాత బయటకు వచ్చిన కల్యాణ్‌తో ఇంత కష్టపడి కోచింగ్ సెంటర్‌కు తీసుకురావాలా. రెండురోజుల్లో ఐదు వేలు ఎలా తీసుకొస్తావ్ అని అప్పు అంటుంది. కష్టపడితే డబ్బు వస్తుంది. కానీ, కష్టపడిన ఎస్సై కాలేం అని కల్యాణ్ అంటాడు.
ఇన్నాళ్లు తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థంగా ఉంటుందని అనుకున్నా అని అప్పు అంటే.. నీకు ఈ డైలాగ్స్ సూట్ కావు కానీ అని చెప్పిన కల్యాణ్ ఈ బుక్స్‌తో నువ్ ఎక్సర్‌సైజ్ కూడా చేయొచ్చు అని అంటాడు. దాంతో అప్పు నవ్వుతుంది. మరోవైపు సీతారామయ్యతో రాజ్ మాట్లాడుతాడు. నువ్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా రాజ్. నిన్న ఈ ఇంట్లో కావ్య పేరే ఎత్తడానికి వీళ్లేదని నిర్ణయం తీసుకుని వెళ్లిపోయావ్. కానీ, నువ్ ఏ తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు అని సీతారామయ్య అంటాడు.
కావ్య లాంటి డిజైనర్ లేకపోవడం
కావ్యపై నీకు కోపం అనేది వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం కావచ్చు. కానీ, దాన్ని కంపెనీకి ఎందుకు కలుపుతున్నావ్ అని సీతారామయ్య అంటాడు. మన కంపెనీకి అవార్డ్ రాకపోడానికి కారణం ఆ కావ్య అని రాజ్ అంటాడు. ఇదే నీ సమస్య. నీ కోపం వల్ల బిజినెస్ మ్యాన్‌లా ఆలోచించలేకపోతున్నావ్. మన కంపెనీకి అవార్డ్ రాకపోవాడనికి కారణం కావ్య లాంటి డిజైనర్ లేకపోవడం వల్ల. అందుకే కావ్యను మన కంపెనీ డిజైనర్‌గా అపాయింట్ చేయు అని సీతారామయ్య అంటాడు.
ఆ కావ్య లేకపోతే కంపెనీని నడపలేనా. కావ్య రాకముందే నేను నిడిపించాను. మీరు నన్ను అవమానిస్తున్నారు. కానీ, నేను తొలిసారు ఓడిపోయాను. దానికి మీకు క్షమాపణ చెబుతున్నాను. మళ్లీ ఇలా జరగకుండా కంపెనీని చూసుకుంటాను అని రాజ్ అంటే.. దీన్నే ఇగో అంటారని సీతారామయ్య అంటాడు. నేను ఆత్మవిశ్వాసం అనుకుంటున్నాను. తప్పు జరగకుండా చూసుకుంటాను. అది తొందర్లోనే ఆ కళావతికి మీ అందరికీ అర్థం అవుతుందని రాజ్ వెళ్లిపోతాడు.
మరోవైపు సామంత్ బినామీ కంపెనీ అయిన సురేష్ దగ్గరికి ఒక లేబర్ ఆఫీసర్ కనకేశ్వరిగా వెళ్తుంది కనకం. సురేష్ స్టాఫ్ అందరిని లేవమని ఇద్దరు హడావిడి చేస్తారు. మేము అంత కరెక్ట్‌గానే చేస్తున్నాం కదా మా ఆఫీస్‌కు ఎందుకు సడెన్‌గా వచ్చారు అని సురేష్ అంటాడు. మీ బాస్ సామంత్ ఎక్కడ, తనను పట్టిన అనామిక ఎక్కడ. మీరు ఎంప్లాయిస్‌ని ఇబ్బంది పెడుతున్నారట కదా. రోజుకు 28 గంటలు పనిచేయిస్తున్నాని బలమైన ఫిర్యాదు వచ్చిందని కనకం అంటుంది.
కనకేశ్వరిగా కనకం
సురేష్ ఏదో చెప్బబోతుంటే.. షటప్ అని వారించిన కనకం లేబర్ ఆఫీసర్‌ను మోసం చేయాలను అనుకుంటున్నావా. అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా. అందరివి నేను చూడాలి. ఇక్కడ చాలా ఫ్రాడ్‌లు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఒక్క నిమిషంలో అగ్రిమెంట్ పేపర్స్ నా ముందు ఉండాలి. లేకుంటే కేసు బుక్ చేసి లేబర్ కోర్ట్‌లో హాజరు పర్చాలా అని కనకేశ్వరి అంటుంది. రెండు ఫైల్స్‌ను తనతో వచ్చిన ఇద్దరికీ ఇచ్చి చెక్ చేయమని చెబుతుంది కనకం.
సురేష్‌ను వాటర్ బాటిల్‌ను తీసుకు రమ్మని పంపిస్తుంది. నాకు ఇంగ్లీష్ రాదనే మీకు ఇచ్చానురా. మా కావ్య అగ్రిమెంట్ తొందరగా వెతికి ఇవ్వండిరా తనతో వచ్చినవాళ్లతో అంటుంది కనకం. వాటర్ తీసుకొచ్చిన సురేష్ కంగారుపడుతుంటాడు. మెల్లిగా కనకంతో ఒకతను దొరికిందని చెబుతాడు. బాటిల్ తీసుకెళ్లమని సురేష్‌ను పంపిస్తుంది. కావ్య అగ్రిమెంట్ పేపర్‌ను కనకం తీసుకుని దాస్తుంది. తర్వాత వచ్చిన సురేష్‌తో మీ స్టాఫ్‌ను ఒక్కొక్కరిగా పంపించు. పర్సనల్‌గా ఎంక్వైరీ చేయాలని ఆఫీసర్‌గా వచ్చిన అతను అంటాడు.
వాళ్లు ఏమైనా చెబితే మీకు యావజ్జీవ కారాగారా శిక్ష పడుతుందని అతను అంటాడు. అంతెందుకు పడుతుంది అని సురేష్ డౌట్ పడతాడు. అంత పడదు.. ఓ 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అయినా ఇక్కడ ఏం దొరకలేదు కదా. పదండి అని కనకం అంటుంది. మీరు ఉండండి మేడమ్. అందరినీ ఎంక్వైరీ చేసి శిక్ష పడేలా చేయిద్దాం అని అతను అంటాడు. ఓవరాక్షన్ చేయకు. అవసరం లేదని చెప్పాను కదా అని కనకం అంటుంది.
తిప్పికొట్టిన అనామిక
ఇంతలో పిన్నీ.. అని అనామిక పిలుస్తుంది. దాంతో షాక్ అవుతుంది కనకం. కంగారుపడి పోతుంది కనకం. కంగారుపడకండి పిన్నీ. మిమ్మల్ని ఏం అనను. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వను అంటుంది కనకం. సురేష్ పోలీసులకు ఫోన్ చేయి అని అనామిక అంటే.. వాళ్లెందుకు.. చాలా బిజీగా ఉంటారు అని కనకం అంటుంది. సరే తీసుకెళ్లండి అని అనామిక అంటే.. ఓకే అని కనకం వెళ్లిపోతుంది. సురేష్.. అని అనామిక అనగానే.. కనకం ఆగిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్