Brahmamudi October 7th Episode: బ్రహ్మముడి - కావ్యను కోర్టుకు లాగుతానంటూ అనామిక వార్నింగ్ - కోడలితో అపర్ణ ఛాలెంజ్
Brahmamudi October 7th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 7 ఎపిసోడ్‌లో కావ్యను కలవడానికి అపర్ణ గుడికి వెళ్లిన సంగతి రాజ్‌కు చెబుతుంది రుద్రాణి. ఇంకోసారి కావ్యను కలవడానికి వీలులేదని తల్లికి వార్నింగ్ ఇస్తాడు రాజ్.
Brahmamudi October 7th Episode: కావ్యపై కోపంతో రగిలిపోతూ బెడ్‌రూమ్‌లో కూర్చుంటాడు రాజ్. అతడి అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది. కావ్య జ్ఞాపకాలు ఇంట్లో ఉండకూడదని, తగలెట్టాస్తానని బయటపడేశావుగా...వర్షం తగ్గింది కాల్చేద్ధాం పదా అని రాజ్ కోపాన్ని మరింత పెంచుతుంది అంతరాత్మ. కావ్యపై ఇష్టం లేనట్లుగా అందరి ముందు అరుస్తావు.
కానీ మనసులో మాత్రం భార్యపై ప్రేమ పొంగిపోతూ ఉంటుందని కావ్యతో అంటుంది అంతరాత్మ. కావ్యపై ప్రేమ ఉండబట్టే ఆమెతో మాట్లాడటానికి ఎక్స్‌పోలో గొడవ పడ్డట్లు నటించావని రాజ్‌తో అంతరాత్మ అంటుంది.
నీ భార్య ఏం చేసినా అది నీకోసమే చేయాలి. నీ భార్య నీకు మాత్రమే సొంతమని నీ మనసులో ఉంది కదా అని అంతరాత్మ అనగానే రాజ్ కోపం పట్టలేకపోతాడు. ఫ్లవర్ వాజ్‌ను అంతరాత్మపై విసురుతాడు. కావ్యను తాను ప్రేమించడం లేదని అంటాడు. కావ్య చేసిన ద్రోహానికి జీవితంలో ఎప్పటికీ క్షమించనని అంటాడు.
అపర్ణను కలిసిన కావ్య...
అనామిక తనకు చేసిన మోసాన్ని అపర్ణతో చెప్పుకోవాలని కావ్య అనుకుంటుంది. గుడిలో అపర్ణను కలుస్తుంది. అపర్ణను చూడగానే కావ్య అత్తయ్య అని పిలుస్తుంది. ఎవరు నవ్వు...నీకు నాకు ఏ సంబంధం ఉందని నన్ను గుడికి రమ్మన్నావని కావ్యకు బదులిస్తుంది అపర్ణ. అత్త మాటకు కావ్య షాకవుతుంది. నాకు తెలిసిన కావ్య నువ్వు కాదని అపర్ణ అంటుంది.
భర్త మనసులో స్థానం లేదు...
మీ ఇంట్లో నాకు చోటు లేదని, మీ అబ్బాయి మనసులో స్థానం లేదని తెలిసి తాను పుట్టింటికి వెళ్లిపోయానని అపర్ణతో అంటుంది కావ్య. నా ఇళ్లు నీ ఇళ్లు కదా..నా కొడుకు నీ భర్త కాదా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. రాజ్‌కు నీపై ఇష్టం లేకపోతే ఏడాది నీతో కాపురం ఎలా చేశాడని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. మీ బలవంతంతోనే నాతో కాపురం చేశానని రాజ్ అన్నాడని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను అపర్ణ ఓదార్చుతుంది.
కావ్యపై అపర్ణ కోపం...
అపర్ణ యోగక్షేమాలు కనుక్కుంటుంది అపర్ణ. ఇప్పుడా అడిగేది అంటూ కావ్యపై అపర్ణ కోపాన్ని ప్రదర్శిస్తుంది. కనీసం నన్ను చూడటానికి హాస్పిటల్‌కు రాలేదు. ఇంటికొచ్చాకా పలకించడానికి రాలేదు. కనీసం నాకు ఫోన్ కూడా ఎందుకు చేయలేదని కావ్యను అడుగుతుంది అపర్ణ. మీ పక్కనే ఉండాలని నేను అనుకున్నా. కానీ నీ మొహమే మాకు చూపించొద్దు అంటూ రాజ్ తనను ఇంట్లో నుంచి హాస్పిటల్ నుంచి వెళ్లగొట్టాడని కావ్య ఎమోషనల్ అవుతుంది.
ఎక్స్‌పో అవార్డ్ విషయంలో అనామిక తనకు చేసిన మోసాన్ని అపర్ణకు వివరిస్తుంది కావ్య. ఆ విషయంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నువ్వు తప్పు చేశావని రాజ్ అంటేనే తాను నమ్మలేదని కావ్యతో చెబుతుంది అపర్ణ. రుద్రాణి మాటల్ని నేను ఎలా నమ్ముతానని అంటుంది. ఇదంతా అనామికే చేసిందని, ఇందులో నా తప్పేం లేదని ఎంత చెప్పిన రాజ్ నమ్మడం లేదని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కావ్యకు అత్త సలహా...
రాజ్‌కు ఏం చెప్పాల్సిన పనిలేదని, ఇంటికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకోమని, సమస్యలు మొత్తం వాటంతట అవే సమసిపోతాయని కావ్యకు సలహా ఇస్తుంది అపర్ణ. కానీ కావ్య తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టడానికి కావ్య అంగీకరించదు. నువ్వు ఇంటికి రానప్పుడు నీ తప్పు లేదని రాజ్ ముందు నిరూపించాల్సిన అవసరం ఏముంది?
రాజ్‌ను నమ్మించాల్సిన అవసరం నీకు ఏముందని కావ్యను అడుగుతుంది అపర్ణ. అసలు నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వాలని వచ్చావా...నా ద్వారా ఏం జరిగిందో రాజ్‌కు తెలియజేయాలని వచ్చావా అంటూ కావ్యను నిలదీస్తుంది అపర్ణ.
భర్త తప్పుల్ని క్షమించు...
నేను నిన్ను ఇంటికి తీసుకెళతానని, రాజ్ ఏమన్నా నేను చూసుకుంటానని కావ్యకు హాపీ ఇస్తుంది అపర్ణ ఎంత చెప్పిన అత్తింటికి రావడానికి కావ్య ఒప్పుకోదు. రాజ్‌కు నా మనసులో ప్రేమ లేదని చెప్పిన తర్వాత అక్కడికి రావడంలో అర్థం లేదని అంటుంది. మాయ విషయంలో రాజ్ తప్పు చేశాడని మీరు అన్న నేను నమ్మలేదు. రాజ్ వ్యక్తిత్వం అలాంటిది కాదని మిమ్మల్నే ఎదురించాను. అలాంటిది నేను తప్పు చేయనని తెలిసిన నన్ను రాజ్ నిందించాడని, అవమానించాడని కావ్య ఎమోషనల్ అవుతుంది.
అపర్ణ ఛాలెంజ్...
ఆస్తి అంతస్తులు అన్ని ఉన్నా ప్రేమ లేని చోట ఏ భార్య ఉండలేదని, మీ ఇంటికొచ్చి ఓ వస్తువులా నేను ఉండలేనని అపర్ణకు బదులిస్తుంది కావ్య. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. నేను చేయాల్సింది చేస్తానని అపర్ణ అంటుంది. నువ్వు ఎన్నాళ్లు పుట్టింట్లో ఉంటావో నేను చూస్తానని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది.
ఈగో వల్లే మీ కాపురం చెడిపోతుందని, ఎందుకు నీకు ఇంత పట్టుదల అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ. ఇంటికి రమ్మని అడిగితే నఖరాలు చేస్తున్నానని, నరాలు తీస్తానని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. అందరూ నన్నే దోషిలా చూస్తున్నారని, నాపై నిందలు వేసిన మీ అబ్బాయి బానే ఉన్నాడని కావ్య బదులిస్తుంది.
డేట్ రాసిపెట్టుకో...
కోడలివి నీకే అంత ఈగో ఉంటే అత్తను నాకు ఎంత ఉండాలని, మీ ఇద్దరి పొగరు మొత్తం దించేసి మిమ్మల్ని ఒక్కటి చేయకపోతే నాపేరు అపర్ణ కాదు. డేట్ రాసిపెట్టుకోమని ఛాలెంజ్ చేస్తుంది. రా పోదామని అంటుంది. ఎక్కడికి అంటూ కావ్య షాకవుతుంది. నువ్వు మీ ఇంటికి...నేను మా ఇంటికి అని అపర్ణ బదులిస్తుంది.
కావ్య, అపర్ణలను చూసిన రాహుల్...
కావ్య, అపర్ణ గుడిలో మాట్లాడుకోవడం రాహుల్ చూస్తాడు. వెంటనే ఆ నిజం రుద్రాణికి చేరవేస్తాడు. కావ్య తిరిగి ఇంటికొస్తే మనం అడుక్కోవాల్సివస్తుందని రాహుల్ అంటాడు. అపర్ణ ఇంట్లో కనిపించకపోవడంతో తల్లి గురించి రాజ్ వెతుకుతుంటాడు. కావ్యను కలవడానికి మీ అమ్మ గుడికి వెళ్లిందని అసలు నిజం బయటపెట్టి రాజ్‌కు షాకిస్తుంది అపర్ణ.
తల్లీకొడుకుల మధ్య చిచ్చు...
భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టి కావ్య, రాజ్‌లను విడదీశావు..ఇప్పుడు తల్లీకొడుకులను విడదీయాలని చూస్తున్నావా అని రుద్రాణిపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అప్పుడే అపర్ణ ఇంట్లోఅడుగుపెడుతుంది.నువ్వు గుడిలో అమ్మవారిని చూడటానికి వెళ్లావా? నీ కోడలిని కలవడానికి వెళ్లావా అని తల్లిని అడుగుతాడు రాజ్.
ఇంటికి పట్టిన దరిద్రం...
కావ్యను కలవడానికి వెళ్లిన సంగతి రుద్రాణి బయటపెట్టిందని అపర్ణ అర్థం చేసుకుంటుంది. మన ఇంటికి పట్టిన దరిద్రం, అరిష్టం ఎప్పుడు వదులుతుందో పూజారిని అడగటానికి వెళ్లానని, మన ఇంట్లో ఉన్న దోషాన్ని బయటకు పంపించిన రోజు ఇంటికి మంచి జరుగుతుందని అన్నాడని రుద్రాణిపై సెటైర్ వేస్తుంది అపర్ణ. గుడిలో నువ్వు కావ్యను కలవడం రాహుల్ చూశాడని రుద్రాణి అంటుంది.
రుద్రాణి సెటైర్లు...
రాజ్ మాత్రం కావ్యను నువ్వు కలిశావా లేదా చెప్పాల్సిందేనని తల్లిని నిలదీస్తాడు. అవునని అపర్ణ సమాధానమిస్తుంది. నీ ప్రాణాల మీదకు తెచ్చినా నీకు అవసరం లేదు...నీ కొడుకుకు కావ్య ప్రత్యర్థిలా పనిచేసినా నీకు బాధలేదు. మన కంపెనీ దివాళా తీయడానికి కారణమైనా నీకు బాధలేదు కానీ కావ్య పిలిస్తే మాత్రం కలవడానికి గుడికి వెళ్లావు అని రుద్రాణి గొడవ పెద్దది చేస్తుంది.
కలవడానికి వీలులేదు...
ఇంకోసారి కావ్యను నువ్వు కలవడానికి వీలులేదని, అదే నాకు అవమానం అని తల్లికి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళతాడు రాజ్. ఈ ఇంటికి అన్యాయం చేసిన వాళ్లను మీరు క్షమించిన నేను క్షమించను. రాజ్‌కు అన్యాయం చేసిన వాళ్ల పేరు జీవితంలో ఎత్తనని రుద్రాణి బిల్డప్‌లు ఇస్తుంది.
రాహుల్ బండారం బట్టబయలు...
కావ్యను తాను గుడిలో కలిసిన సంగతి బయటపెట్టిన రాహుల్‌ను స్వప్న ముందు ఇరికించేస్తుంది అపర్ణ.ఇంట్లో అందమైన భార్యను పెట్టుకొని బయట మరో అమ్మాయితో షికార్లు చేస్తున్నాడని అంటుంది.
కావ్యను వెతుక్కుంటూ కనకం ఇంటికొస్తుంది అనామిక. బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి మా కంపెనీలో ఉద్యోగంలో చేరావని, నువ్వు ఇప్పుడు జాబ్ చేయనంటే కోర్టుకు వెళతానని కావ్యను బెదిరిస్తుంది అనామిక. మరోవైపు మన కంపెనీ ఓడిపోవడానికి కావ్య కారణం కాదని, కావ్య లాంటి మనిషి మనవైపు లేకపోవడం అని రాజ్‌కు సీతారామయ్య క్లాస్ ఇస్తాడు.