తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 5th Episode: రాజ్ ఉగ్రరూపం, అడ్డుకున్న వర్షం- రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న- కావ్యకు అత్త పిలుపు

Brahmamudi October 5th Episode: రాజ్ ఉగ్రరూపం, అడ్డుకున్న వర్షం- రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న- కావ్యకు అత్త పిలుపు

Sanjiv Kumar HT Telugu

05 October 2024, 8:16 IST

google News
  • Brahmamudi Serial October 5th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఉగ్రరూపంతో రెచ్చిపోతాడు. కావ్య చీరలు, పెళ్లి ఫొటోలు తగలబెట్టేందుకు చూస్తాడు. కానీ, రాజ్ ఆవేశాన్ని ఆపి అడ్డుకుంటాడు వరుణుడు. రుద్రాణిని ముసుగేసి కొడుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్య చేసింది దుగ్గిరాల ఇంట్లో నమ్మలేకపోతున్నామని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. కానీ, కావ్యనే నమ్మండి అని రుద్రాణి ఎక్కిస్తుంది. పది సంవత్సారల గెలుపునంతా బూడిదలో పోసిన పన్నీరులా చేసింది. ఇంకా కావ్య అలా చేయలేదని దీర్ఘాలు తీస్తున్నారు అని రుద్రాణి అంటుంది.

నువ్వెందుకు రుద్రాణి అంతలా ఆవేశపడుతున్నావ్. నీకు ఒక అవకాశం దొరికిందనా. కల్యాణ్ కాపురం ముక్కలు చేసేదాకా నిద్రపోలేదు. ఇప్పుడు నా కొడుకు మీద దృష్టి పెట్టావా. కనీసం ఆలోచించనివ్వకుండా అందరి మనసులు విరిచేయాలని ఇలా మాట్లాడుతున్నావా అని అపర్ణ అంటుంది. ముందు నువ్ ఇక్కడ నుంచి వెళ్లు రుద్రాణి. ఇది తెలియకుండా జరిగిన పొరపాటు. నా మనవరాలు ఏంటీ.. మనకు ద్రోహం చేయడమేంటీ అని ఇందిరాదేవి అంటుంది.

ప్రతికారం తీర్చుకుంది

మీరే టీవీలో కళ్లారా చూశారు కదా అత్తయ్య. ఇంకా నమ్ముతున్నారేంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ రుద్రాణి కళ్లతో చూస్తున్నావ్. నా అనుభవం వేరు. నా దృష్టి కోణం వేరు అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మా.. నన్ను కూడా నమ్మావా. నేను కూడా అమాయకుడునే లేదు. వ్యక్తిగత కోపంతో వృత్తిపై పగ తీర్చుకుంది. ఇంట్లోంచి వెళ్లగొట్టినందుకు పగ తీర్చుకుంది. తనకు వచ్చిన విద్యతో ప్రత్యర్థులతో చేతులతో కలిపి చివరికీ ప్రతికారం తీర్చుకుంది అని రాజ్ అంటాడు.

మీ అభిప్రాయం లెక్కలోకి తీసుకోవట్లేదు. మీ అందరి లెక్క తప్పింది. కళావతి కుటుంబానికి తీరని నమ్మక ద్రోహం చేసేసింది. దట్సాల్ అని పైకి వెళ్తాడు రాజ్. గదిలో కావ్య ఫొటో తీసి బెడ్‌పై విసిరేస్తాడు. బీరువాలో ఉన్న కావ్య చీరలన్నీ బెడ్‌పై పడేస్తాడు. అన్ని మూటగట్టి కిందకు తీసుకువచ్చి బయటపడేస్తాడు రాజ్. ఏం చేస్తున్నాడు వీడు అని ఇందిరాదేవి అంటే.. ఇంకా అర్థం కావట్లేదా. కావ్య జ్ఞాపకాలు ఏవి ఉండకూడదని తగలబెట్టేస్తున్నాడు అని రుద్రాణి అంటుంది.

బయట వాకిట్లో కావ్య చీరలు, పెళ్లి ఫొటోలు పడేసి పెట్రోల్ పోస్తాడు. అంతా ఆపుతుంటారు. రుద్రాణి, రాహుల్ మాత్రం సంతోషిస్తారు. మమ్మీ ఏమన్నా ప్లాన్ వేశావా. ఇక కావ్యను రాజ్ అస్సలు క్షమించడు. ఎవరు ఆపిన రాజ్ ఆగడు. తర్వాత రుద్రాణి, రాహుల్‌ను తోసేసి మరి అగ్గిపుల్ల వెలిగించి కావ్య బట్టలు, పెళ్లి ఫొటోలను తగలబెట్టాలని చూస్తాడు. ప్రకాశం అడ్డుకున్న పక్కకు తోసేస్తాడు. కావ్య ఫొటోలపై అగ్గి పుల్ల పడిపోగానే వర్షం వచ్చి ఆరిపోతుంది.

ఆవేశాన్ని చల్లార్చేందుకు

దాంతో రాజ్ షాక్ అవుతాడు. స్త్రీ అంటే ప్రకృతితో సమానంరా. ఆ స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతే కాదురా. పంచభూతాలు కూడా సహించవు. ఈ వస్తువులు దూరం చేసుకున్నంత మాత్రాన జ్ఞాపకాలు చెరిపేయలేవురా. నువ్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. కావ్య నిర్దోషి అని ప్రకృతే చెబుతుంది. రా లోపలికి. నీ ఆవేశాన్ని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ వర్షంరా.. రా అని రాజ్‌ను లోపలికి తీసుకెళ్లిపోతుంది అపర్ణ.

దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఏంట్రా కావ్యకు పంచభూతాలు సహకరిస్తున్నాయా అని రుద్రాణి అంటుంది. హైదరాబాద్‌లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో ఎవరికీ తెలియదు. దానికి పంచభూతాలు సహకరించడం ఏంటీ అని రాహుల్ అంటే.. ఒక్కసారిగా గట్టిగా ఉరుము వస్తుంది. ప్రకృతి మనమీద పిడుగు పడేస్తుందేమోరా. లోపలికి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. మరోవైపు ఇంటికెళ్లిన కావ్య వాకిట్లో కూర్చుని ఉంటుంది.

అది చూసిన కనకం వచ్చి పలకరిస్తుంది. కావ్య ఏడుస్తుంది. అమ్మా ఎన్నోసార్లు నేను చేయను తప్పుకు మాటలు పడ్డాను. అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ, ఇప్పుడు నేరమే జరిగిందమ్మా. నేను కావాలని చేయలేదు. అయినా నా మెడకు చుట్టుకుంది. ఎప్పుడు ధైర్యంగా ఉండే నేను ఇవాళ తల ఎత్తుకోలేకపోతున్నాను అని కావ్య అంటుంది. ఏమైందే అని కనకం అడుగుతుంది. నా వల్ల ఆయనకు అవమానం జరిగిందమ్మా అని జరిగింది చెబుతుంది కావ్య.

ఎవరు నమ్ముతారో

ఆ అవార్డ్‌ను నేను అందుకోవాల్సి వచ్చింది అని కావ్య అంటుంది. నేను గెలవడానికి కావాలనే అనామికతో చేతులు కలిపినట్లు ఆయన అనుకున్నారు. నా విషయంలో ఏది నమ్నని మావయ్య గారు కూడా అది నమ్మారు. నేనెందుకు శత్రువులతో చేతులు కలుపుతానమ్మా అని కావ్య ఏడుస్తుంది. దురదృష్టం నీపై మళ్లీ పగ పట్టింది. మీరు కలిసి ఉంటారుకుంటే ఇలా జరిగింది అని కనకం అంటుంది. ఆ ఇంట్లో ఎవరు నమ్ముతారో. నమ్మరో. ఎవరు ఎగదోస్తారో. నావల్లే ఆయనకు నిజం తెలియాలి. ఎవరు చెప్పినా వినరు అని కావ్య అంటుంది.

కానీ, ఆ ఇంట్లో ఒక్కరికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. మా అత్తగారికి. ఆవిడ నమ్మితే చాలు. నా భారమంతా దిగిపోతుంది అని కావ్య అంటుంది. మరోవైపు లాస్ట్ వరకు వచ్చి ఎందుకిలా చేశావ్. మనం వెనుకున్నమాన్న విషయం కావ్యకు చెప్పడం వల్ల లాభమేంటీ. ఇప్పుడు కావ్య డిజైన్స్ వేయనను అని చెప్పింది అని అనామికతో సామంత్ అంటాడు. ఇప్పుడు కొంపలు మునిగినట్లు ఎందుకు టెన్షన్ పడతావ్ అని చెప్పిన అనామిక మందు బాటిల్ తీసి పక్కన పెడుతుంది. పెగ్ కలిపి ఇస్తుంది.

నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే తాగమంటావేంటీ. నేను రాజ్‌ను ఎదురించి ఎంత పెద్ద రిస్క్‌ తీసుకున్నానో తెలుసా. కావ్య వల్ల గెలిచాను. లేకుంటే పదేళ్లుగా అవమానపడుతూనే ఉన్నాను. కావ్య విలువ రాజ్‌కు తెలియకపోవచ్చు. కానీ, మనకు తెలుసు కదా అని సామంత్ అంటాడు. ఇప్పుడు నీ గొడవ ఏంటీ. కావ్య మళ్లీ మనకు పని చేస్తే సరిపోతుంది. తనను తిరిగి ఎలా తీసుకురావాలో నాకు వదిలేయ్ అని అనామిక అంటుంది.

జ్ఞాపకాలు బయట ఉండట

ఇప్పుడు విజయాన్ని ఎంజాయ్ చేయు. ఆ ఇంట్లో రాజ్ అవమానంతో కృంగిపోతుంటాడు. అది తల్చుకుని నన్ను ఆనందపడనీ అని అనామిక అంటుంది. మరోవైపు స్వప్నను పిలుస్తుంది ఇందిరాదేవి. అఇతే, స్వప్న పాత్రలో నటిస్తున్న హమిదా ఖటూన్ మారిపోయారు. ఆమె స్థానంలో కొత్త నటి వచ్చారు. కావ్య జ్ఞాపకాలు అలా బయటపడి ఉండటం నాకు చాలా బాధగా ఉంది. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు. ఇక్కడ జరిగిన విషయాలేవి కావ్యకు చెప్పకు అని ఇందిరాదేవి అంటుంది.

రాజ్‌ను కావ్య అర్థం చేసుకున్నట్లు రాజ్ అర్థం చేసుకోలేదు. ఇప్పటికే రాజ్ అన్న మాటలకు బాధపడుతుంది. ఇంకా ఇవెందుకు చెబుతాను అని స్వప్న వెళ్లిపోతుంది. మరోవైపు సంతోషంగా మందు తాగుతుంటుంది రుద్రాణి. ఇంతలో అనామిక కాల్ చేస్తుంది. ఇన్ని రోజులుగా నేను చేయని పని ఈరోజు నువ్ చేశావ్. కావ్యపై రాజ్‌కు పూర్తిగా ద్వేషం కలిగేలా చేశావ్. చెప్పాలంటే వాళ్లు బద్ద శత్రువులయ్యారు. ఒడ్డున పడ్డ చేపల గిలగిల కొట్టుకుంటున్నాడు అని రుద్రాణి చెబుతుంది.

ఇంట్లో వాళ్ల పరిస్థితి చూస్తుంటే నా కడుపు నిండిపోయింది అని రుద్రాణి అంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంటుంది. ఇది చాలదు ఆంటీ. ఆ కుటుంబం నాకు చేసిన అవమానానికి వాళ్లను రోడ్డుమీదకు తీసుకువచ్చేవరకు ఊరుకోను. అది కూడా ఆ కావ్య చేతే చేయిస్తాను చూడండి అని అనామిక అంటుంది. నువ్ ఏమైనా చేసుకో. ఈరోజు ఎక్స్‌పోలో జరిగింది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ముందు ముందు ఇలాంటివి నువ్ ఇంకెన్నో సాధించాలని, రాజ్ కావ్య దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అని రుద్రాణి అంటుంది.

రుద్రాణికి ముసుగు వేసి

నా చెల్లి రాజ్ దూరంగా ఉంటే నీకు అంత సంతోషాన్నిస్తుందా. చెబుతా నీ సంగతి అని బెడ్ షీట్‌ను రుద్రాణిపై కప్పి పిచ్చి కొట్టుడు కొడుతుంది స్వప్న. రుద్రాణి చూసేసరికి స్వప్న వెళ్లిపోతుంది. ఎవరు నన్ను కొట్టింది. ఎవరు ముసుగు వేసింది అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఏమైందని అడుగుతాడు. నన్నెవరో ముసుగు వేసి కొట్టారు అని రుద్రాణి అంటే.. ఏంటీ అంత ధైర్యం ఇంట్లో ఎవరికీ ఉందని స్వప్న అంటుంది.

నువ్వే కదా కొట్టావని రుద్రాణి అంటుంది. నేను ఇప్పుడే కదా గదిలోకి వచ్చాను. నాకంటే ముందు మీ అబ్బాయే వచ్చాడు అని రాహుల్‌ను ఇరికిస్తుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అవుతాడు. అది చెప్పిందని నన్ను చూస్తావేంటీ. నేను నిన్ను కొట్టలేదని రాహుల్ అంటాడు. చాలా గట్టిగా కొట్టార్రా. ఆ పద్దతి చూస్తుంటే కోపంతో కొట్టినట్లు లేదు. సమయం కోసం చూసి కొట్టినట్టుందని రుద్రాణి అంటుంది. ఎంతోమంది కొంపలు కూల్చారు కదా. కడుపు మండి కొట్టి ఉంటారు. ఈసారి కొడతారో కత్తి తీసుకుని పొడుస్తారో. జాగ్ర్తత అని వెళ్లిపోతుంది స్వప్న.

దెబ్బలకు విలవిల్లాడిపోతుంది రుద్రాణి. బాగా కొట్టారా అని రాహుల్ అంటే.. చితక్కొట్టార్రా. తాగింది అంతా దిగిపోయింది అని రుద్రాణి అంటుంది. అది చూసిన స్వప్న ఇందాక తెగ సంతోషపడ్డావ్ కదా. ఇప్పుడు ఆ నొప్పులతో బాధపడు అని వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత అమ్మ ఎక్కడ అని రాజ్ అడిగితే.. కావ్యను కలవడానికి గుడికి వెళ్లిందని రుద్రాణి చెబుతుంది. మరోవైపు రాజ్‌ను నమ్మించడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో అని కావ్యకు అపర్ణ సలహా ఇస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం