Brahmamudi October 18th Episode: బ్రహ్మముడి.. రాజ్ కంపెనీకి సీఈవోగా కావ్య.. రుద్రాణికి కంటే చీప్‌గా అపర్ణ, ఇందిరాదేవి
19 October 2024, 7:50 IST
Brahmamudi Serial October 18th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో కావ్య, రాజ్‌ను కలపడానికి మరో కొత్త ప్లాన్ వేస్తారు అపర్ణ, ఇందిరాదేవి, కనకం. అందుకోసం కావ్యతో మాట్లాడతారు. అప్పుడు రుద్రాణికి సపోర్ట్ చేస్తుంది కావ్య. దాంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. రుద్రాణికి స్వప్న వార్నింగ్ ఇస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 18 ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవిపై ఫైర్ అవుతాడు రాజ్. ఎవరు చెప్పిన వినను, నమ్మను, ఇక ఇది వదిలేయండి. నేను ఒంటరిగానే బతకాలని అనుకుంటున్నాను. మరోసారి మోసపోవాలని అనుకోవట్లేదు. మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.
వంద మంచి పనులు మర్చిపోతారు
ఇప్పుడు వాడు కోపంలో ఉన్నాడు అని ఇందిరాదేవి అంటుంది. చిట్టీ మీరు వాళ్లిద్దరిని కాపాడాలనుకున్నారు. అది మంచిదే. కానీ, దానికి నాటకం ఆడాలనుకోవడం ఏంటీ. కలపాలనుకుంటే వాళ్లను నిజాయితీగా కలపండి. వాడి మనసులో కావ్య పట్ల ప్రేమ ఉంది. ఆ ప్రేమ తట్టిలేపడానికి ఏదైనా చేయండి.. అని చెప్పి వెళ్లిపోతాడు సీతారామయ్య. మరోవైపు బాధపడుతుంటారు కనకం, కృష్ణమూర్తి, కావ్య.
ఎందుకుమ్మ ఇదంతా చేశావ్. మీ అల్లుడి గురించి మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు అమ్మా. వంద మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే.. ఆ వంద మంచి పనులు మర్చిపోతారు. ఇంతపెద్ద నాటకంతో మా ఇద్దరిని ఎలా కలపాలని అనుకున్నారు. అప్పటికీ నిన్ను అడుగుతూనే ఉన్నాను కదా. నాకు అప్పుడే చెప్పుంటే ఇలా జరగనిచ్చేదాన్ని కాదు కదా అని కావ్య అంటుంది. మీ అమ్మను ఏం అనొద్దు. తను సరైనా పనే చేసింది అని కృష్ణమూర్తి అంటాడు.
మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటీ నాన్న అని కావ్య అంటుంది. అవునమ్మా.. మీ ఇద్దరు విడిపోయి దూరంగా ఉంటే మేమందరం చూస్తూ ఉంటే కలపడానికి ఏ ప్రయత్నం చేయలేదు. ఈరోజు మీ అమ్మ పనిచేసింది. ఇన్నాళ్లు అబద్ధాలు ఆడుతుంది, నాటకాలు ఆడుతుంది, మనల్ని సమస్యల్లో పడేస్తుంది అనుకున్నాను. కానీ, మీ అమ్మే కరెక్ట్. మీ ఇద్దరిని కలపడానికి ఈరోజు దోషిగా నిలబడింది. తల్లిగా తాను గెలిచింది. వెళ్లిన దారి తప్పు కావచ్చు కానీ, ప్రయత్నం తప్పు కాదు అని కృష్ణమూర్తి అంటాడు.
కలుస్తామన్న నమ్మకం లేదు
కానీ, ఓడిపోయింది కదా నాన్న. అందరిముందు అవమానపడింది కదా. అమ్మ ఇలా ఎందుకు చేసిందా అని ఒక్కసారి కూడా ఆయన ఆలోచించలేదు. మనమీద ఆయనకు పూర్తిగా నమ్మకం పోయింది. ఇక మమ్మల్ని కలపడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. మేము కలుస్తామన్న నమ్మకం నాకు లేదు. ఆయన గురించి తెలిసే చెబుతున్నాను. ఇక దీన్ని వదిలేయండి అని కావ్య వెళ్లిపోతుంది. వాళ్లను కలపడానికే చేశాను కానీ, ఇలా శాశ్వతంగా విడిపోతారని అనుకోలేదు అని కనకం బాధపడుతుంది.
నేను చస్తేనే కలుస్తారని తెలిస్తే.. నిజంగానే ఆ క్యాన్సర్ వచ్చుంటే బాగుండేది కదయ్యా. అలా నేను చచ్చి వీళ్లను కలిపేదాన్ని అని కనకం కృష్ణమూర్తి గుండెలపై వాలుతుంది. మరోవైపు అమ్మబాబోయ్ ఆ కనకంది మాములు తెలివితేటలు కాదురా అని రుద్రాణి అంటుంది. నువ్ లేకుంటే ఆ కావ్యను తీసుకొచ్చి హారతి పట్టేవాళ్లు అని రాహుల్ అంటాడు. నేను ఉండగా అలా జరగనిస్తానా అని రుద్రాణి అంటే.. కానీ, అమ్మమ్మ నిన్ను లాగి పెట్టి కొట్టింది కదా. అదొక్కటే చిన్న ఇబ్బందిగా ఉంది. బాగా తగిలిందా మమ్మీ అని రాహుల్ అంటాడు.
రేయ్ ధనం పెరిగాక కూడా దరిద్రాన్ని తలుచుకున్నట్లు ఈ హ్యాపీ మూమెంట్‌లో అది అవసరమా. ఎంజాయ్ దిస్ మూమెంట్ అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న క్లాప్స్ కొడుతూ వస్తుంది. అద్భుతం, అమోఘం, మీ తెలివితేటలకు సలాం అత్తయ్య. ఒక్కమాటతో స్టోరీ మొత్తం మార్చేశావ్. నేను మీకు సరెండర్ అయిపోయాను అని స్వప్న అంటుంది. అంటే నువ్ మాతో చేరిపోయావా అని రాహుల్ సంతోషంగా అడుగుతాడు.
నీడ కూడా పడనివ్వను
అవును, మీరు కొత్తరకమైన జాతి. ఎలా చెప్పాలి. ఆ.. గుంటనక్కలు ఉంటాయి కదా. శవాలని పీక్కుతుంటాయి కదా. కానీ, మీరు బతికి ఉండగానే పీక్కుతుంటారు. పీక్కు తినడంలో పిశాచీలనే మించిపోయారు. మేము నాటకాలు ఆడతాం. దానివల్ల ఎవరికీ ఏ నష్టాలు ఉండవు. మీ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. రేపు నాకు పుట్టబోయే బిడ్డను కూడా మా అమ్మ దగ్గరే పెంచుతాను. నీలాంటి వాళ్ల నీడ కూడా పడనివ్వను అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది.
అది అలా అనేసి వెళ్తుంటే ఏమనవేంటీ అని రాహుల్ అంటాడు. దాని ముందు అనే ధైర్యం లేదు గానీ, వెళ్లాక నామీద అరుస్తావేంటీ.. దమ్ముంటే దాన్ని అను అని రుద్రాణి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇందిరాదేవి, కనకం, అపర్ణ ముగ్గురు కలుస్తారు. జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. వాళ్లు శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారు. వాడి మనసులో ఒక్కసారి ముద్ర పడితే పోవడం కష్టం. దాన్ని ఎలా చెరిపేయాలి అని అపర్ణ అంటుంది.
వాడు ఈసారి తప్పుబట్టడంలో తప్పు లేదు. కనకంకు క్యాన్సర్ అంటే నిజంగానే నమ్మాడు. చివరి కోరిక నెరవేర్చడానికి అన్నీ చేశాడు. కానీ, రుద్రాణి వచ్చి అంతా మార్చేసింది అని అపర్ణ అంటుంది. మీరు ఏమనుకోనంటే.. నాకు ఒకటి చేయాలని ఉంది. ఆ రుద్రాణిని మర్డర్ చేయాలని ఉంది అని కనకం అంటుంది. ఇలాంటి కొంపలు ముంచే పనులు చేయకు అని ఇందిరాదేవి అంటుంది. మరి ఏదో గొప్ప రహస్యం బయటపెట్టినట్లు చేసింది. ఇలాంటి వాళ్లు మట్టికొట్టుకు పోతారు అని కనకం శాపిస్తుంది.
అజ్ఞానం ఆవహించింది
వాడికి మంచేగా చేయాలనుకున్నాం. అదెందుకు గుర్తించడు వాడు అని రాజ్ గురించి ఇందిరాదేవి అంటుంది. అజ్ఞానం అని కనకం అంటుంది. ఏయ్ ఏమన్నావ్ అని అపర్ణ అంటుంది. మైండ్‌లో ఉంది అలా బయటకు వచ్చేసింది అని కనకం చెబుతుంది. తర్వాత అంగట్లో అన్ని అల్లుడు అని కనకం అంటే.. ఏయ్ ఇంకోసారి అంటే అని అపర్ణ అంటుంది. ఇందాక కనకం అంది మాత్రం నిజమే. అజ్ఞానం. రాజ్‌ను అజ్ఞానం ఆవహించింది. అది దూరం చేయాలంటే కావ్య వాడికి దగ్గరిగా ఉండాలి. ఇద్దరిని ఒక్కచోట చేర్చాలి అని ఇందిరాదేవి అంటుంది.
చేర్చుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది.. ఇది చాలా పకడ్బందీగా చేయాలి. నిజాయితీగా ప్రయత్నించాలి. ఆఫీస్ దగ్గర కలిసే ప్రయత్నం చేయాలి. కావ్య రోజు రాజ్‌ను కలిసేలా చేద్దాం అని అపర్ణ అంటుంది. దానికి వాళ్లిద్దరు ఒప్పుకుంటారా అని కనకం అంటుంది. ముగ్గురం ఉన్నాం. వెళ్లి కావ్యతో మాట్లాడదాం అని అంటుంది అపర్ణ. మరోవైపు రాజ్ ఆఫీస్‌కు వెళ్తే అంతా వచ్చి గుడ్ మార్నింగ్ అని విషెస్ చెబుతారు. ఇలాంటి భజన కార్యక్రమాలు కాకుండా టైమ్‌కు పని చేయండి అని చివాట్లు పెడతాడు రాజ్.
సార్ మూడ్ ఏంటీ ఇలా ఉంది అని శ్రుతి అనుకుంటుంది. ఇంతలో రాజ్ చూసి బాస్ వస్తే విషెస్ చేయాలని తెలియదా అని అంటాడు. ఇందాకే కదా వాళ్లను తిట్టాడు. ఇప్పుడు విష్ చేయలేదని నన్ను తిడతాడా. అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నాడు అని శ్రుతి అనుకుంటుంది. సార్ మీరే ఇందాక అని శ్రుతి అంటే.. ఇందాకటి విషయాలు పక్కనపెట్టి వేసినంతరవరకు డిజైన్స్ తీసుకురా అని రాజ్ చెబుతాడు. ఇప్పుడు డిజైన్స్ వేయలేదంటే ఏమంటారో అని భయంగా వెళ్లి తీసుకొస్తుంది శ్రుతి.
కనిపించకుండా వేయడం
వావ్ డిజైన్స్ చాలా బాగున్నాయి. కనిపించకుండా డిజైన్స్ వేయడం చాలా బాగుంది. నిజాలు చెప్పడం మానేసారా. గంటలో డిజైన్స్ కావాలి అని రాజ్ అంటాడు. ఈయనకి ఎవరో అబద్ధం చెప్పి గట్టిగా హర్ట్ చేశారు. అది మాపై చూపిస్తున్నారు. రాక్షసుడు అని శ్రుతి తిట్టుకుంటుంది. మరోవైపు కావ్య దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి, కనకం వస్తారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు దేవతలు వచ్చారు. మళ్లీ ఏదైనా జగన్నాథ నాటకం మొదలు పెట్టారా జగన్నాథల్లారా అని కావ్య అంటుంది.
ఏంటీ ఒళ్లు ఎలా ఉంది అని అపర్ణ అడుగుతుంది. మా అమ్మ నాటక సంస్థల్లో నాటకాలు వేసి వేసి అలసిపోయాను అని కావ్య అంటుంది. వాడికి సరైన గుణపాఠం చెప్పడానికే ముగ్గురం కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం అని ఇందిరాదేవి అంటుంది. అయితే అది నా మెడకే చుట్టుకుంటుంది. మీ నిర్ణయాలన్ని మీరే మీ హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లిపోండి అని కావ్య అంటుంది. అసలేంటీ నీ ఉద్దేశం. అత్తగారన్న గౌరవం లేదు, అత్తగారికి అత్తగారు వచ్చారు. ఆవిడన్న భయం లేదా అని అపర్ణ అడుగుతుంది.
రుద్రాణికి సపోర్ట్
కన్నతల్లి మాట అంటే విలువ లేదా అని కనకం అంటుంది. అమ్మా క్యాన్సర్ కనకం ఇదంతా నువ్వు చేసిందే. ఇంకా విలువ లేదంటున్నావా. మా ఆయనే కాదు నేను కూడా నిన్ను జీవితంలో నమ్మను అని కావ్య అంటుంది. నువ్వేం మాట్లాడకు కనకం అని అపర్ణ అంటుంది. మీరేమైనా తక్కువా. అంతా నాటకం ఆడి బయటపెట్టారు అని కావ్య అంటే.. బయటపెట్టింది రుద్రాణి అని ఇందిరాదేవి అంటుంది. ఈసారి రుద్రాణి గారి తప్పు లేదు. మీరు ఆడిన నాటకాన్ని బయటపెట్టింది అంతే అని కావ్య సపోర్ట్‌గా అంటుంది.
ఓర్నీ.. చూశారా అత్తయ్య. ఏదో భార్యాభర్తలను కలపాలని ట్రై చేస్తే ఇప్పుడు రుద్రాణి కంటే చీప్ అయిపోయాం అని అపర్ణ అంటుంది. ఇంతమాట పడ్డాకా ఈ ఇంటి ఛాయలకు కూడా మనం రావొద్దు. ఇంకా ఇక్కడెందుకు మనం, పదా పోదాం అని ఇందిరాదేవి అంటుంది. థ్యాంక్స్ ఇక మేము వెళ్తాం అని అపర్ణ అంటే.. అలాగే అత్తయ్యగారు. వెళ్లిరండి అమ్మమ్మ గారు అని తన పని తాను చేసుకుంటుంది కావ్య. దాంతో ముగ్గురు షాక్ అవుతారు. ఇలా మాటలతో అడుగడుగునా షాక్ ఇస్తుంది కావ్య.
నువ్ మళ్లీ కంపెనీలో జాయిన్ కావాలని అపర్ణ అంటే.. నేను జాయిన్ అయినా ఎందులో ఏ తప్పు వెతుకుతారో తెలియదు. నన్ను ఎక్కడ గెంటేస్తారో కూడా తెలియదు అని కావ్య అంటుంది. నువ్ వాడి కింద ఎంప్లాయ్‌గా జాబ్ చేస్తేనే కదా సమస్య. అది కంపెనీకి నువ్వు సీఈఓ అయితే అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. మరోవైపు ఇదేమైనా బస్టాప్‌లో వేసే చెయినా.. అంటించేయడానికి. కూర్చోవాలంటే వాళ్లకో అర్హత ఉండాలి అని రాజ్ అనుకుంటాడు. ఇక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్