Brahmamudi October 12th Episode: కావ్య ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ.. క్యాన్సర్ రిపోర్ట్స్ అడిగిన రాజ్.. బయటపడిన కనకం నాటకం-brahmamudi serial october 12th episode raj family at kavya home kanakam cancer drama reveal brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 12th Episode: కావ్య ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ.. క్యాన్సర్ రిపోర్ట్స్ అడిగిన రాజ్.. బయటపడిన కనకం నాటకం

Brahmamudi October 12th Episode: కావ్య ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ.. క్యాన్సర్ రిపోర్ట్స్ అడిగిన రాజ్.. బయటపడిన కనకం నాటకం

Sanjiv Kumar HT Telugu
Oct 12, 2024 07:46 AM IST

Brahmamudi Serial October 12th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌లో అత్త మామల 25వ పెళ్లి రోజు గ్రాండ్‌గా జరిపిస్తానని రాజ్ అంటాడు. దాంతో రుద్రాణి స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత ఆపేందుకు రెచ్చగొడుతుంది. కానీ, అది కుదరదు. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ టుడే ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అంతా మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి క్షమించడంలో మానవత్వం ఉంటుంది అని రాజ్ అంటాడు. మానవత్వం ఉన్న వాళ్లే క్షమించగలుగుతారు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు నేను స్పందించకపోతే.. నేను ఏ సహాయం అందించకపోతే అని రాజ్ అంటాడు. అప్పుడై పైనుంచి రుద్రాణి, రాహుల్ వస్తారు.

అర్థం కావట్లేదు

చాలు నాన్నా.. నువ్ ఎంత ఎత్తుకు ఎదిగావ్ అన్నది అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా అని అపర్ణ అంటుంది. అవును మమ్మీ మర్చిపోయాను అని రాజ్ అంటాడు. మీ ముగ్గురు ఏం మాట్లాడతున్నార్రా అని ప్రకాశం అంటాడు. మనసు విస్తీర్ణం పెంచుకోడానికి మనిషి మహర్షిగా మారక్కర్లేదు బాబాయ్ అని రాజ్ అంటాడు. వామ్మో నువ్ మరింత కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేశావ్ కదరా అని ప్రకాశం అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటాడు.

నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు మా అత్తగారు శ్రీమతి కనకం, మా మామగారు శ్రీమాన్ కృష్ణమూర్తిల 25వ పెళ్లి రోజు. నా చేతుల మీదుగా గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నాను అని రాజ్ చెప్పగానే రుద్రాణి స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో సోఫాలో రాహుల్ కూర్చోబెట్టి నీళ్లు చల్లుతాడు. ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేసిందే రాజ్ నువ్ చెప్పు అని స్వప్న అంటుంది. మీ మేనత్త పడిపోతే పట్టించుకోలేదు కానీ.. మీ అత్తయ్యకు మ్యారేజ్ డే చేస్తావా రాజ్ అని రాహుల్ అడుగుతాడు.

మధ్యలో నీకు ఏం నొప్పి అని స్వప్న అంటుంది. నేను సమాచారం ఇస్తున్నాను. ఎవరి అభిప్రాయం అడగట్లేదు కాబట్టి అని రాజ్ చెబుతుంటే.. మూసుకోమ్మని అర్థం రాహుల్ అని స్వప్న అంటుంది. కావ్య ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును అని రాజ్ అంటే.. ఇప్పుడే కదా ఎవరి అభిప్రాయం అడగట్లేదని చెప్పాడు అని ప్రకాశం అంటాడు. అసలు రాజ్ ఏం మాట్లాడుతున్నాడు అని రుద్రాణి షాక్ అవుతుంది.

రెచ్చగొట్టేలా రుద్రాణి

మట్టి పిసుక్కునే వాళ్ల అత్త మామలకు పెళ్లి రోజు జరిపిస్తాడా రాజ్ అని రాహుల్ చెబుతాడు. వాళ్లకు ఆ పని అయినా వచ్చు. నీకు అది కూడా లేదు కదా అని స్వప్న కౌంటర్ ఇస్తుంది. నో.. నేను ఒప్పుకోను అని రుద్రాణి అంటే.. అందుకే నీ బోడీ పర్మిషన్ అడగలేదు ఇక్కడ అని స్వప్న అంటుంది. కావ్య ఎక్స్‌పో అవార్డ్‌లో చేసింది చెప్పి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది రుద్రాణి. మీ కూతురే చెడగొట్టేలా ఉందని అపర్ణ మెల్లిగా అంటుంది.

దాని గూబ నేను వాయగొడతాను అని ఇందిరాదేవి అంటుంది. పదేళ్ల నుంచి మనకు వస్తున్న అవార్డ్‌ను రాకుండా చేసిన కావ్య ద్రోహాన్ని మర్చిపోయి వాళ్ల అమ్మనాన్న మ్యారేజ్ చేస్తా అని ఎలా అంటున్నావ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. అది రాజ్ నిర్ణయం నీకు వచ్చిన బాధ ఏంటీ రుద్రాణి అనిసుభాష్ అంటాడు. ఇప్పుడు వాళ్లకు పెళ్లిరోజు చేయకుంటే కనకం లోకం విడిచి వెళ్లిపోతుందా ఏంటీ అని అపర్ణ అంటుంది. మనుషుల విలువ వాళ్లు బతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి అని రాజ్ అంటాడు.

వాళ్ల మీద నీకు అంత కన్సర్న్ ఎందుకు వచ్చింది అని రుద్రాణి, రాహుల్ అంటారు. మా అమ్మ పక్కన మా నాన్న ఉన్నాడు కాబట్టి. మీ అమ్మ పక్కన భర్త లేడు కాబట్టి చేసే ఛాన్స్ లేదు కాబట్టి అని స్వప్న అంటుంది. మమ్మీ మానవత్వం మంటగలిసిపోతుంది. ఇలాంటి రాతి మనుషుల మధ్య నేను ఎలా ఉండాలి అని రాజ్ అంటాడు. వాళ్లను ఏరిపారేయడానికి నేను ఉన్నాను కదా. నీ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు అని ఇందిరాదేవి అంటుంది.

ధాన్యలక్ష్మీ అసహనం

నువ్ ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని ప్రకాశం అంటే.. అపర్ణ, రాజ్ అర్థమైందని అంటారు. అయితే, మెదడు లేని వాళ్లకే అర్థం కాదు. మెదడు లేని వాళ్లు చేతులు ఎత్తండి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఎవరు ఎత్తరు. నేను ఒక్కన్నే కాదు మన కుటుంబం అంతా వెళ్లి పెళ్లి చేయాలని రాజ్ అంటాడు. ధాన్యలక్ష్మీ మేమెందుకు. నువ్వే కావ్యను పంపిస్తావ్. నువ్వే తీసుకొస్తావ్ ఏంటిది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

చూడండి ఇది మంచి పని. వాళ్లది 25వ రోజు పెళ్లి రోజు. వాళ్ల దగ్గర డబ్బు లేదు. అందుకే చేయిస్తున్నాను అని రాజ్ అంటాడు. అంటే గతిలేని వాళ్లందరికి చేస్తావా అని రుద్రాణి అంటుంది. స్వప్న కౌంటర్ ఇస్తుంది. నేను చేయకపోతే వాళ్ల స్థాయికి వాళ్లు చేసుకుంటారు. అంతేకానీ గతిలేని వాళ్లు అని తీసిపారేయకండి అని రాజ్ అంటాడు. అలాంటివాళ్లని ఏరిపారేస్తే అని అపర్ణ అంటుంది. అలాంటి గడ్డి పోచలు మనకెందుకు పీకి పారేస్తా అని ఇందిరాదేవి అంటుంది.

సరే నేను మీ నానమ్మ, తాతయ్య అని వస్తున్నాం అని అపర్ణ అంటుంది. నేను, నా భార్య వస్తాను అని ప్రకాశం అంటే.. ధాన్యలక్ష్మీ రానని అంటుంది. నువ్ మా కుటుంబంలో ఓ సభ్యురాలివి కాదని చెప్పు. నిన్ను వదిలేసి వెళ్తాం అని ఇందిరాదేవి అంటుంది. వామ్మో వీళ్లు ముగ్గురు గుడిలో కలిసి ప్లాన్ వేసినట్లున్నారు. నేను వెళ్లి అది తెలుసుకుని రాజ్ కావ్య కలవకుండా చేయాలి అని రుద్రాణి అంటుంది. నేను కూడా వస్తాను అని రుద్రాణి అంటుంది.

నువ్ ఎందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు. అందరు కలిసి ఉంటే నీకు సహించదు కదా. చెడగొడదామని వస్తున్నావ్ అని స్వప్న అంటుంది. రాని స్వప్న. మీ అమ్మ ముగ్గురు కూతుళ్లు అల్లుళ్లతో మ్యారేజ్ డే చేసుకుంటే సంతోషిస్తుంది కదా. కల్యాణ్, అప్పులను కూడా పిలుస్తాను అని రాజ్ అంటాడు. నా కొడుకు నన్ను చూడటానికి రాడు కానీ, వాళ్ల అమ్మ కోసం అప్పు తీసుకెళ్తుందా అని ధాన్యం అంటుంది. రావాలనుకున్న వాళ్లు ఇప్పుడే చేతులెత్తండి. లేకుంటే తర్వాత నేను చేతులెత్తేస్తాను అని రాజ్ అంటాడు.

కనకం పంచ్

అందరం కలిసే వెళ్తున్నాం అని సుభాష్ అంటాడు. అందరం కలిసి ఒక పండుగల జరిపిద్దాం అని రాజ్ అంటాడు. మరోవైపు మరుసటి రోజు కృష్ణమూర్తిని పిలుస్తుంది కనకం. హెయిర్‌కు కలర్ వేస్తాడు కృష్ణమూర్తి. అది చూసి ఆశ్చర్యపోయిన కనకం ఏంటయ్యా పెళ్లి కొడుకులా తయరయ్యావ్ అని కనకం అంటుంది. మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా కలర్ వేసుకున్నాను అని కృష్ణమూర్తి అంటాడు. ఒకరికొకరు మ్యారేజ్ యానివర్సరీ చెప్పుకుంటారు.

కావ్య వచ్చి కూడా చెబుతుంది. ఇన్నేళ్లలో ఎన్ని గొడవలు అయిన నేను మా పుట్టింటికి వెళ్లిపోలేదు అని కనకం అంటుంది. దాంతో కావ్య ఫైర్ అవుతుంది. అలా చూడకు. ఇవాళ మీ అత్తవాళ్లందరూ వస్తారు. వాళ్లను ఏం అనకు. రుద్రాణి అన్న ఏం అనకు అని కనకం అంటుంది. ఇంతలో దుగ్గిరాల కుటుంబం మొత్తం దిగుతుంది. చలి పెడుతుందని శాలువ కప్పుకుని బయటకు వస్తుంది కనకం. రాజ్ వచ్చి డెకరేషన్ గురించి ఏర్పాట్లు చెబుతాడు.

కావ్యను పక్కకు తప్పుకోమ్మని మరి డెకరేషన్ అబ్బాయికి రాజ్ చెబుతాడు. డెకరేషన్ అంతా నువ్వే చూసుకోవాలి అని రాహుల్‌కు చెబుతాడు రాజ్. అత్త మామలను పలకరించు అని రాజ్ అంటాడు. బాగున్నరా అని మావయ్య అని కనకంను, అత్తయ్య అని కృష్ణమూర్తిని అంటాడు రాహుల్. దాంతో రెయ్ అని రాజ్ కోప్పడతాడు. పర్లేదు బాబు మేము మార్చుకుంటాం అని కనకం అంటుంది. పెళ్లయిన తర్వాత అత్తింటికి వచ్చిన మొహమేనా అది అని రాజ్ అంటాడు.

మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణమూర్తి అంటాడు. ఇక తరచుగా వస్తాను. ఎలా ఉన్నావ్ కావ్య అని రాహుల్ అంటే.. ఇంట్లోకి రా రాహుల్ అని కావ్య అంటుంది. కాఫీ, టీ కావాలా అని కనకం అడిగితే.. మీరు కేవలం రెస్ట్ తీసుకోండి. వంట మనిషి కూడా వచ్చి అన్ని చూసుకుంటాడు. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి అని రాజ్ అంటాడు. వంట సంగతి చూసుకో రాహుల్ అని రాజ్ అంటాడు.

స్థోమతకు తగ్గట్లుగా

అదంతా చూసిన కావ్య అవాక్కైపోతుంది. వంట మాస్టర్‌కు కాల్ చేయడానికి రాజ్ వెళ్తాడు. కావ్య వెళ్లి ఏంటిదంతా అని అడుగుతుంది. ఉన్నప్పుడు లేనివాళ్ల విలువ తెలియదు. ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. నీకు అర్థం కాలేదు కదా. నీ కోడి మెదడుకు అర్థం కాకూడదనే ఇలా చెప్పాను. మా అత్తగారి మ్యారేజ్ డే చేయాలని చేస్తున్నాను సింపుల్ అని రాజ్ అంటాడు. మా స్థోమతకు తగ్గట్లుగా చేసుకునేవాళ్లం కదా. మీ జోక్యం ఎందుకని కావ్య అంటుంది.

నీకెందుకు అని రాజ్ అంటాడు. అలా అనే బూత్ బంగ్లాకు తీసుకెళ్లారు అని కావ్య అంటుంది. దాంతో షాక్ అయిన రాజ్ నువ్ అర్జంట్‌గా అది డిలీట్ చేసేయ్ అని అంటాడు. అప్పుడే ఇదిరాదేవి వాళ్లంతా వస్తారు. అది చూసి కావ్య మరింత షాక్ అవుతుంది. ఏర్పాట్లన్ని బాగా చేస్తున్నావా అని సుభాష్ అడుగుతాడు. ఇప్పుడే మొదలుపెట్టాను అని రాజ్ అంటాడు. కావ్య నువ్ రమ్మంటే రాలేదని మేమే వచ్చాం. మాకు తప్పుతుందా అని ఇందిరాదేవి అంటుంది.

చివరికీ మమ్మల్నే రప్పించుకున్నావ్ కదా అని అపర్ణ అంటుంది. ఎంతైనా నాకన్న నువ్ తెలివైనదానివే అని స్వప్న అంటుంది. కల్యాణ్ గురించి ధాన్యం అడుగుతుంది. ఇంకో అరగంటలో వస్తాడు. అప్పును కూడా తీసుకొస్తాడు అని రాజ్ అంటాడు. అత్త వెళ్లి వంటవాళ్లకు హెల్ప్ చేయమని రుద్రాణిని రాజ్ అంటాడు. కనకం, కృష్ణమూర్తి వచ్చి పలకరిస్తారు. అత్తయ్య గారు మీరెందుకు బయటకొచ్చారు. లోపల రెస్ట్ తీసుకోమ్మని చెప్పాను కదా అని రాజ్ హడావిడి చేస్తాడు.

బిత్తరపోయిన కావ్య

అందరిని లోపలికెళ్లమని అంటాడు. అంతా ఇంట్లోకి వెళ్తారు. అదంతా చూసిన కావ్య బిత్తరపోతుంది. ఏంటీ ఇదంతా. అందరికందరు మారిపోయి పండంటి సంసారం, ఉమ్మడి కుటుంబం సినిమా చూపిస్తున్నారేంటీ అని కావ్య అంటుంది. ఇదేముంది ముందుంది అసలు పండుగ అని రాజ్ వెళ్లిపోతాడు. ఏం అర్థం కానట్లు అయోమయంగా కావ్య చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో నిన్న మీతో మాట్లాడిన తర్వాత డాక్టర్స్‌లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను. అందులో ఒకతను క్యాన్సర్ స్పెషలిస్ట్. ఒకసారి మీ రిపోర్ట్స్ పంపించమని అడిగాడు. ఆ రిపోర్ట్స్ కొంచెం ఇస్తారా అని కనకంను రాజ్ అడుగుతాడు. దాంతో షాక్ అయిపోతుంది.

లేని రిపోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కనకం భయపడిపోతుంది. లేవంటే అల్లుడి గారికి అనుమానం వస్తుంది. ఏం చేయాలి అని కనకం కంగారుపడిపోతుంది. కట్ చేస్తే కనకం వచ్చేది కావ్య చూస్తుంది. కనకం నాటకం కావ్యకు తెలిసిపోయినట్లుగా చూపించారు.

Whats_app_banner