Brahmamudi October 16th Episode: బ్రహ్మముడి- కొడుకు చావు గురించి చెప్పిన కనకం- దాంపత్య వ్రతం చేయనన్న కావ్య- రాజ్‌కు షాక్
16 October 2024, 7:39 IST
Brahmamudi Serial October 16th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో కనకం కృష్ణమూర్తి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుంటాయి. పెళ్లి అంటే తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను ఒక్కొక్కరు చెబుతుంటారు. అప్పుడే తన కొడుకు చావు గురించి కనకం చెబుతుంది. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్‌లో కనకం, కృష్ణమూర్తి 25వ పెళ్లి రోజు వేడుకలు జరుగుతుంటాయి. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు కనకం కృష్ణమూర్తి. తర్వాత రాజ్, కావ్య ఒకేసారి కేక్ తినిపించాలని అనుకుంటారు. దాంతో ఒకరినొకరు చూసుకుని మీరు ముందు తినిపించండి అని వాదించుకుంటారు.
కేక్ తినిపించి
అల్లుడు గారు మీరు తినిపించండి అని కృష్ణమూర్తి అనేసరికి రాజ్ కేక్ తినిపించి విషెస్ చెబుతాడు. తర్వాత ధాన్యలక్ష్మీ, అపర్ణ, ఇందిరాదేవి అంతా కేక్ తినిపిస్తారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని ఇందిరాదేవి దీవిస్తుంటే.. నానమ్మ.. కాస్తా చూసి అని రాజ్ అంటాడు. దాంతో సంతోషంగా జీవించు అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత రుద్రాణి వచ్చి కేక్ తినిపిస్తుంది.
తర్వాత అంతా కూర్చుంటారు. మీకు పెళ్లి అయి పాతికేళ్లు అవుతుంది, మాకు 50 ఏళ్లు అవుతుంది, సుభాష్‌కు పెళ్లి అయి 30 ఏళ్లు అవుతుంది అని ఎక్కడకెక్కడో పుట్టిన ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఒక్క ఇంట్లో ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చిన కోడలు అత్తింట్లో ఉండాలన్న అర్థంతో ఇందిరాదేవి చెబుతుంది. మహాలక్ష్మీ వైకుంఠం వదిలి వెళ్లిపోతే విష్ణుమూర్తి కూడా ఒంటరి అయ్యాడు అని ఇందిరాదేవి అంటుంది.
ఒక మూడో వ్యక్తి కారణంగా మహాలక్ష్మీ వైకుంఠం వదిలి వెళ్లిపోయింది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరితే గొడవలకు బీజం పడుతుందని అక్కడే తెలిసిపోతుంది. మధ్యలో ఎవరు దూరిన చెదరకుండా వారి కాపురాన్ని చూసుకోవాలి. భార్యపై భర్తకు నమ్మకం ఉండాలి, భర్తపై భార్యకు గౌరవం ఉండాలి. భార్య కోసం ఒక మెట్టు దిగడంలో తప్పులేదు. మేమంతా కలిసి ఉన్న అది ఆ బంధానికి మేము ఇచ్చే విలువ అని ఇందిరాదేవి చెబుతుంది.
కాపురం కూడా అంతే
తమ అనుభవాలను నేటి తరానికి ఉపయోగపడతాయని చెబుతున్నాం. అపర్ణ నువ్వు చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. క్షమించరాని తప్పులు జరిగినా నేను అత్తింటి గడప దాటలేదు. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి మచ్చ తెచ్చే పని చేయలేదు. గాయం అయిన శరీరం మనది. పోయిననాడు తప్ప మన శరీరాన్ని వదిలి వెళ్లలేం కదా. మన కాపురం కూడా అంతే అని అపర్ణ అంటుంది. ఇప్పుడు కనకం చెబుతుంది అని ఇందిరాదేవి అంటుంది.
కనకం లేస్తే.. అత్తయ్య గారు మీరు కూర్చోండి. ఎవరు ఏమనుకోరు కూర్చోని చెప్పండి అని రాజ్ అంటాడు. మాకు ముగ్గురు పిల్లలు. వారికి పెళ్లి అయి వెళ్లిపోయారు. అంటే పిల్లలు కూడా మనతో ఉండరు. ఆయనకు నేను ఆయనకు నేను మాత్రమే. బంధాలే శాశ్వతమే కదా అని తమకు పుట్టిన కొడుకు చనిపోవడాన్ని గుర్తు చేసుకుంటుంది కనకం. మాకు ఒక బాబు ఉండేవాడు. వాడికి జబ్బు చేస్తే ఖరీదైన వైద్యం చేయించాల్సి వచ్చింది. కానీ, మా ఆయనకు ఆ స్థోమత లేదు. దాంతో నా బిడ్డ నా చేతుల్లోనే విలవిల్లాడుతూనే మరణించాడు అని కనకం అంటుంది.
ఆ పరిస్థితికి కారణం పేదరికం. నా కూతుళ్లు కూడా అదే పేదరికంలో బతకకూడదని అనుకున్నాను. ఆస్తిపరుల ఇంటికి కోడళ్లుగా పంపించాలని ఆశపడ్డాను. అబద్ధాలు చెప్పాను, మోసాలు చేశాను, దొరికిపోయాను. నా వ్యక్తిత్వం మీద ఇప్పటికీ మచ్చ ఉంది. అయినా, ఇంత జరిగినా మా ఆయన నన్ను ఇంటినుంచి పంపించలేదు. ఇల్లు అమ్మి రోడ్డు మీదకు పడే పరిస్థతికి కూడా తీసుకొచ్చాను. నేను అంత పెద్ద తప్పు చేసినా ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టలేదు. అది ఆయన గొప్పతనమా.. నా అదృష్టమా చెప్పలేను. భార్య భర్తల బంధంలోనే ఆ గమ్మత్తు ఉంది అని కనకం అంటుంది.
రాహుల్ గురించి
చివరిదాకా భార్యాభర్తలు కలిసి జీవించాలంటే వాళ్ల మధ్య ప్రేమ, అనురాగం ఉండాలి. ఇదే నేను నేర్చుకున్నాను అని కనకం అంటుంది. దాంతో అంతా చప్పట్లు కొడతారు. తనకు మతిపరుపు ఉన్న తన భార్య తనతోనే ఉందని ప్రకాశం చెబుతాడు. స్వప్నను చెప్పమంటే.. తనకంటే పెద్దది మా అత్త ఉందని స్వప్న అంటుంది. వద్దులే.. తను చెబితే అన్ని విడిపోయిన స్టోరీలే ఉంటాయి అని స్వప్న పంచ్ వేస్తుంది.
రాహుల్ నన్ను మోసం చేశాడు. కానీ, పెళ్లి జరిగితే అతనితోనే జరిగేలని అనుకున్నా. ఇద్దరం గొడవ పడతాం. కానీ, రాహుల్ నన్ను ఎప్పుడు బయటకు పొమ్మనలేదు. నేను కూడా రాహుల్‌ను విడిచి ఉండను. చచ్చేదాక నాతోనే ఉండాల్సిందే అని స్వప్న అంటుంది. ఎక్కడ వాడి పరువు తీస్తావో అనుకున్నా అని రుద్రాణి అంటుంది. ఇవాళ అంతా చెప్పినదాన్ని బట్టి నిజంగానే భార్యాభర్తల బంధంలో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఏం చేద్దాం చచ్చేదాక స్వప్నను భరించాల్సిందే అని రాహుల్ అంటాడు.
నేను ఆడపిల్లలా ఉండను. మగరాయుడులానే ఉంటాను. కానీ, కల్యాణ్‌ను పెళ్లి చేసుకోగానే నా పద్ధతే మారిపోయింది. అన్నీ నేర్చుకున్నా. కవి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో తెలుసుకున్నా. వాడికోసం నన్ను నేను మార్చుకుంటున్నా. బస్ గింతే అని అప్పు చెప్పింది. అన్ని ఉన్నప్పుడు ఏం లేదని నా జీవితం నుంచి వెళ్లిపోయింది అనామిక. ఏమి లేనప్పుడు అన్ని ఉన్నాయంటూ నా జీవితంలోకి వచ్చింది అప్పు. మా దగ్గర డబ్బు లేదు. అలాగే పేదరికం కూడా లేదు. నా దృష్టిలో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికం అని కల్యాణ్ అంటాడు.
మనసులను దూరం చేయవు
భార్యాభర్తలు ఎలా ఉండకూడదో చెప్పమని రాజ్‌ను అపర్ణ అంటుంది. మీరంతా మాట్లాడక నాకు అర్థమైంది. భార్యాభర్తలు అంటే ఇలా సర్దుకుపోవాలా. కోపం, ఆవేశం మనుషులను దూరం చేస్తాయే తప్పా మనసులను దూరం చేయవు. ఆ మనసుల మధ్య ఒక్కసారి ఒక బంధం ఏర్పడితే ఎంత కోపం ఉంటే ఏంటీ, ఎంత ఇగో ఉంటే ఏంటీ.. ఇక్కడిదాకా లాక్కొచ్చి పడేస్తుందని అర్థమైంది. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను అని రాజ్ అంటాడు.
నాకు అనుభవం నేర్పిన పాఠం ఒక్కటే. నా ఇల్లు నా భర్త నా కాపురం ఇవన్నీ ఒక భ్రమ. ఒక మాయ. భార్యాభర్తల మధ్య సంబంధం చివరిదాకా కొనసాగాలంటే ఉండాల్సింది నమ్మకం. అది నాపై నా భర్తకు లేదు. కట్టిపడేయాల్సింది ప్రేమ. అది నా భర్తకు నా మీద లేదు. బలవంతంగా పెళ్లి చేసుకున్నారు, బలవంతంగా కాపురం చేశారు. అసలు ఆయన మనసులో నేను లేను. అందుకే ఆయన జీవితంలో ఈరోజు నేను లేను. నేనే లేనప్పుడు సంసారం గురించి కాపురం గురించి నేనేం చెప్పగలను. చెప్పే అర్హత నాకు లేదు అని కావ్య అంటుంది.
మనసు విరిగిపోయిన చోట మాంగళ్యం ఒక అలంకారమే అవుతుంది. మనసే లేనిచోట భార్య కూడా ఒక వస్తువు లాగే కనిపిస్తుంది అని కావ్య చెబుతుంది. కావ్య ఏంటే నువ్వు మాట్లాడేది అని కనకం ఫైర్ అవుతుంది. నిజం అమ్మా. అది అనుభవానికనన్న బలమైంది. ఆ నిజం వల్లే నేను అబద్ధపు కాపురం చేయలేక పుట్టింట్లో ఉండాల్సి వచ్చిందని కావ్య అంటుంది. కళావతి నీవల్ల ఎన్ని తప్పులు జరిగినా నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అని రాజ్ అంటాడు.
దాంపత్యమే సరిగ్గా లేదు
చూశారా నేను తప్పులు చేశాను అంటున్నారు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదు. నేను అసలు తప్పే చేయను అని ఎప్పటికీ నమ్మరు. ఆ నమ్మకమే లేని మనిషితో నేను ఎలా కాపురం చేస్తాను అని కావ్య బాధపడుతుంది. ఇంతలో పంతులు ఎంట్రీ ఇస్తాడు. అమ్మా దాంపత్య వ్రతానికి ఇంకా ఏర్పాట్లు చేయలేదా. త్వరగా మొదలుపెట్టాలి. ఎవరు కూర్చుంటారో చెప్పండి అని పంతులు అంటాడు. కావ్య, అప్పు, స్వప్న ముగ్గురు అల్లుళ్లతో కూర్చుంటారు అని కనకం అంటుంది.
దాంపత్య వ్రతమా.. ఇక్కడ దాంపత్యమే సరిగ్గా లేదు. నాకు సంబంధం లేదు. ఈరోజు మీ పెళ్లిరోజు కాబట్టి మీరిద్దరు మాత్రమే కూర్చోని జరిపించండి అని లోపలికి వెళ్లిపోతుంది కావ్య. తర్వాత కనకం కావాలనే దగ్గుతుంది. అది చూసి రాజ్ కంగారుపడుతాడు. బ్లడ్ రావడం చూసి హాస్పిటల్‌కు వెళ్దామని అంటాడు. నా గురించి వద్దులేండి బాబు. మీ కుటుంబం గురించి ఆలోచించండి. రుద్రాణి భర్తను వదిలేసింది. అనామిక వెళ్లిపోయింది. మీరు వదిలేశారో, పట్టుకున్నారో తెలియట్లేదు అని కనకం అంటుంది.
కనీసం ఈ దాంపత్య వ్రతమైన చేస్తే మీ కుటుంబంలో ఎవరు విడాకుల జోలికి వెళ్లరని పంతులు గారు చెప్పారు అని కనకం అంటుంది. చూడండి. నాకు మీపై గౌరవం ఉంది. దానికంటే ఎక్కువగా నా మీద నాకు గౌరవం ఉంది. మీ ఆఖరి కోరిక కాబట్టి ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు వ్రతమంటే మీ కూతురు కొండెక్కి కూర్చుంటుంది. ఆ కొండమీద నుంచి కోతిని దిపండం నా వల్ల కాదు అని రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్