తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 2nd Episode: బ్రహ్మముడి- కావ్య ప్లాన్ బయటపెట్టిన స్వప్న- రాజ్ వార్నింగ్- అనామికను వదిలేసిన సామంత్?

Brahmamudi November 2nd Episode: బ్రహ్మముడి- కావ్య ప్లాన్ బయటపెట్టిన స్వప్న- రాజ్ వార్నింగ్- అనామికను వదిలేసిన సామంత్?

Sanjiv Kumar HT Telugu

02 November 2024, 7:39 IST

google News
  • Brahmamudi Serial November 2nd Episode: బ్రహ్మముడి నవంబర్ 2 ఎపిసోడ్‌లో సుభాష్‌ను అపర్ణ క్షమించిందన్న విషయాన్ని కావ్యకు కాల్ చేసి చెబుతుంది ఇందిరాదేవి. ఇంత పెద్ద గుడ్ న్యూస్‌ను ఇంత ఆలస్యంగానా చెప్పేది అని కావ్య అంటుంది. కానీ, కావ్య చేసిన దాన్ని రాజ్ మాత్రం తప్పుపడతాడు. వార్నింగ్ ఇస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 2 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 2 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 2 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో భర్త సుభాష్‌ను అపర్ణ క్షమించి, ప్రేమగా మాట్లాడటంతో అంతా సంతోషిస్తారు. కన్నులపండువగా ఉందని ఇందిరాదేవి అంటుంది. ఇదంతా కావ్య వల్లే జరిగిందని పొగుడుతుంది. కానీ, రాజ్ మాత్రం తన మాయజాలం వల్ల జరిగిందా అని తప్పుబడతాడు.

ఐడియా ఎలా వచ్చింది

మరోవైపు రాహుల్, రుద్రాణి తలపట్టుకుని కూర్చుంటారు. అనామికను కావ్య దెబ్బకొట్టి నష్టాలు తీసుకురావడం, అపర్ణ భర్తను క్షమించడం చూసి ఇవన్నీ ఎలా జరిగాయ అని ఆలోచిస్తుంటారు. ఇంతలో స్వప్న వచ్చి పాట పెడుతుంది. దాంతో రుద్రాణి చిరాకు పడుతుంది. వారికి ఆ పరిస్థితి తీసుకురావడానికి కారణం తానే అని చెబుతుంది. అనామికకు వేలంపాటలో పాడాలనే ఐడియా ఇచ్చింది మీరే కదా. మీకు ఆ ఆలోచన ఎలా వచ్చిందని స్వప్న అంటుంది.

ప్లాన్ బయటపెట్టిన స్వప్న

దాంతో కావ్యతో స్వప్న మాట్లాడింది రుద్రాణి విన్నది గుర్తు చేసుకుంటుంది. అంటే ఇదంతా నువ్ కావాలనే ప్లాన్ చేశావా అని ఆశ్చర్యపోతుంది రుద్రాణి. అనామికకు తాను హెల్ప్ చేస్తున్నట్లు కావ్య, స్వప్నకు తెలిసిపోయిందని భయపడిపోతుంది. స్వప్నపై రుద్రాణి కోప్పడితే ఇంట్లో వాళ్లకు తెలిస్తే నిన్ను గెంటేస్తారని పంచ్ ఇస్తుంది స్వప్న. దాంతో ఏం చేయలేక రుద్రాణ, రాహుల్ సైలెంట్‌గా ఉండిపోతారు.

కావ్యకు తెలిసిన నిజం

మరోవైపు కావ్యకు ఇందిరాదేవి కాల్ చేస్తుంది. మీ అత్తయ్య మీ మావయ్యను క్షమించేసింది. వాళ్లిద్దరు ఒక్కటైపోయారు అని ఇందిరాదేవి అంటుంది. అత్తయ్య మావయ్యను క్షమించేసిందా అని కావ్య అంటుంది. అప్పుడే భోజనం చేస్తున్న కనకం కావ్య మాటలు విని ఆనందపడుతుంది. పక్కనే ఉన్న కృష్ణమూర్తి కూడా ఆ మాటలు విని సంబరపడిపోతాడు.

కోప్పడిని రాజ్

అమ్మమ్మగారు ఇంత మంది గుడ్ న్యూస్‌ను ఇంత ఆలస్యంగానా చెప్పేది అని కావ్య సంతోషంగా అంటుంది. తల్లి మారిపోయింది. ఇక కొడుకు మాత్రమే. వాడు కూడా మారిపోతే ఇక అందరూ సంతోషంగా ఉండొచ్చు అని ఇందిరాదేవి అంటుంది. కట్ చేస్తే కావ్యతో రాజ్ ఫోన్ కాల్ మాట్లాడుతాడు. ఈసారి ఏ నాటకం ఆడి వాళ్లను మాయ చేశావ్ అని రాజ్ అంటాడు. దాంతో కావ్య అప్సట్ అవుతుంది.

కావ్యకు రాజ్ వార్నింగ్

మోసం చేయడం, ఎదురు దెబ్బ కొట్టడం, కావాల్సింది సాధించుకోవడం ఇవి తప్ప నీకేం తెలుసు. నువ్ చేసే గారడీలు అన్ని మా అమ్మ నాన్న మీద ప్రయోగించాలని చూస్తే మర్యాదగా ఉండదు అని రాజ్ కోపంగా చెబుతూ వార్నింగ్ ఇస్తాడు. అదంతా ఓపికగా విన్న కావ్యకు ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. అసహనం వచ్చేస్తుంది. దాంతో రాజ్‌కు వరుసగా పంచ్‌లు వేస్తుంది.

మూర్ఖత్వం అడ్డొస్తుందంటూ

తను ఏ నాటకం ఆడాను, ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. తాను చేసింది ఒప్పుకోడానికి ఇగో, మూర్ఖత్వం అడ్డు వస్తున్నాయని రాజ్‌తో కావ్య అంటుంది. అనామికను దెబ్బ కొట్టడం, అపర్ణ మారిపోవడానికి మాయ చేయడం అనేది నాటకం ఆడినవి కాదు అని వాదిస్తుంది కావ్య. మరోవైపు అనామిక చేసినదానికి సామంత్ కోపంగా ఉంటాడు.

అనామికను వదిలించుకునేందుకు

అనామిక తాను చేసింది పక్కన పెట్టి సామంత్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అది వర్కౌట్ కాదు. కావ్య, కనకం చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు సామంత్. వేలం పాటలో 40 కోట్లకు అరవింద్ కంపెనీ కొని 35 కోట్లు నష్టం తెచ్చింది, ఇప్పటికే సగం గుండు కొట్టింది, ఇంకా వదిలించుకోకపోతే రోడ్డు మీద నిలబెడుతుంది అన్న కనకం మాటలను తలుచుకుంటూ ఆలోచిస్తుంటాడు సామంత్.

అనామికను వదిలించుకునేందకు

అనామికను వదిలించుకోవాలా అనేది సామంత్ ఆలోచిస్తాడు. కానీ, అనామిక అలా జరగకండా ఏదైనా మాయ చేస్తుందో చూడాలి. లేకపోతే అనామిక ఒంటరి అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం