Brahmamudi July 12th Episode: బ్రహ్మముడి- కుర్చీ మడతపెట్టి పాటకు డ్యాన్స్ చేసిన రుద్రాణి ప్రకాశం- కుప్పకూలిపోయిన కల్యాణ్
12 July 2024, 7:33 IST
Brahmamudi Serial July 12th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 12వ తేది ఎపిసోడ్లో దుగ్గిరాల ఇంట్లో సుభాష్ అపర్ణ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ గేమ్స్ జరుగుతుంటాయి. కుర్చీ మడతపెట్టి పాటకు రుద్రాణి, ప్రకాశం అదిరిపోయేలా డ్యాన్స్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
బ్రహ్మముడి సీరియల్ జూలై 12వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో సుభాష్, అపర్ణ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సుభాష్-అపర్ణ ఇద్దరూ గేమ్స్ బాగా అడుతూ అన్నీ కరెక్ట్‌గా చేస్తారు. తర్వాత ధాన్యలక్ష్మీ ప్రకాశం ఆడుతారు. ఇద్దరి కళ్లకు గంతలు కడతారు. మొదటిసారి కలిసినప్పుడు బాబాయ్ ఏం చెప్పాడో అది రాయాలని ధాన్యలక్షికి రాజ్ చెబుతాడు. ఏదో చెప్పాలని వచ్చి మర్చిపోయారు అని ధాన్యలక్ష్మీ రాస్తుంది.
నా గొంతు కోసారు
ఇది చాలా కామెడీగా ఉంటుంది. ప్రకాశంను అడిగితే మర్చిపోయాను అని చెబుతాడు. తర్వాత శోభనం గదిలో పిన్ని నీతో మాట్లాడిన మొదటి మాట ఏంటో రాయమని ప్రకాశంకు చెబుతాడు రాజ్. దాంతో సిగ్గుపడిపోతాడు ప్రకాశం. తర్వాత బోర్డ్‌పై ఇంత మతిమరుపు మొగుడిని అంటగట్టి నా గొంతు కోసారు అని ప్రకాశం రాస్తాడు. అది చదివి అంతా నవ్వుతారు. కల్యాణ్ మాత్రం ఏది చూడకుండా దిగాలుగా ఉంటాడు. పిన్ని బాబాయ్ రాసిందని నిజమేనా అని రాజ్ అంటాడు.
అంటే అప్పుడు నేను అన్నది ఇంకా మర్చిపోలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏం అన్నావ్ పిన్ని అని రాజ్ అంటాడు. ప్రకాశం రాసిందే ధాన్యలక్ష్మీ చెబుతుంది. దాంతో అంతా నవ్వేస్తారు. సూపర్ పిన్ని కరెక్ట్‌గా చెప్పావ్ అని రాజ్ అంటాడు. తర్వాత ఇద్దరి కళ్లకు గంతలు తీస్తారు. ఇది మాత్రం ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నారా అని ధాన్యలక్ష్మీ అంటే.. ఆ రాత్రంతా సణుగుతూనే ఉన్నావ్ కదా అని ప్రకాశం అంటాడు.
కారుతో గుద్దినప్పుడు
తర్వాత రాజ్ కావ్యకు గంతలు కడతారు. మొదటిసారి మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు అని రాజ్‌ను ప్రకాశం అడుగుతాడు. వినాయకుడి విగ్రహానికి రంగులు వేసినప్పుడు అని రాజ్ రాస్తాడు. కావ్యను చెప్పమని అడుగుతారు. నా సైకిల్‌ను కారుతో గుద్దినప్పుడు నేను కారు అద్దం పగులగొడుతుంటే కారులో నుంచి దిగారు అని కావ్య చెబుతుంది. హో.. అప్పుడు కలిసామా మనం ఫస్ట్ టైమ్ అని రాజ్ అంటాడు. అవును అప్పుడేగా కలిసిందని కావ్య అంటే.. అంటే నేను ఓడిపోయాను అన్నమాట అని రాజ్ గొణుక్కుంటాడు.
రాజ్‌కు నువ్ పెట్టిన నిక్ నేమ్ ఏంటని కావ్యను అడుగుతాడు ప్రకాశం. ఎవరికైనా కోపం వస్తుందేమో అని కావ్య అంటే.. గేమ్‌లో గెలవడమే ముఖ్యమని ప్రకాశం అంటాడు. దాంతో మిస్టర్ డిఫెక్ట్ అని బోర్డ్‌పై కావ్య రాస్తుంది. రాజ్‌ను చెప్పమంటాడు ప్రకాశం. మిస్టర్ డిఫెక్ట్ అని రాజ్ చెబుతాడు. హో.. సూపర్. కరెక్ట్‌గా చెప్పావ్ అని అంతా చప్పట్లు కొడతారు. తర్వాత కల్యాణ్‌ను చూసిన కావ్య మీ తమ్ముడిని చూడండి. ఆయన సంతోషంగా ఉండాలంటే ఇందులో ఇన్వాల్వ్ చేయాలని కావ్య చెబుతుంది.
అందాల ఆడబొమ్మ పాటకు
దాంతో ఇప్పుడు డ్యాన్స్ రౌండ్, అందరూ డ్యాన్స్ చేయాలి. ఎవరూ తప్పించుకోడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు వస్తారంటే.. కల్యాణ్ అని రాజ్ లాక్కొస్తాడు. లాస్ట్‌లో నేను వస్తాను. ముందు అమ్మ నాన్న వేస్తారు. తర్వాత నేను వేస్తాను అని కల్యాణ్ అంటాడు. దాంతో సరే అని ప్రకాశం, ధాన్యలక్ష్మీని పిలుస్తారు. వాళ్లిద్దరూ అందాల ఆడబొమ్మ పాటకు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. తర్వాత స్వప్న రాహుల్ పేర్లు చెబుతాడు రాజ్. క్యూట్ కపుల్ కోసం క్యూట్ సాంగ్ అని రాజ్ అంటాడు.
పుష్ప 2 మూవీలోని సూసెకి పాటకు స్వప్న రాహుల్ చేసిన డ్యాన్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అంతా చాలా బాగా చేశారని పొగుడుతుంటారు. ఏంట్రా రాహుల్ డ్యాన్స్ బాగా చేశావ్ అని రుద్రాణి అంటే.. నీకు అలా అనిపించిందా అని రాహుల్ అంటాడు. ఏంటత్తా.. మేమిద్దరం సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా అని స్వప్న అంటుంది. తర్వాత కల్యాణ్ వచ్చి నాకోసం వస్తావనే ఎమోషనల్ ఫీల్ గుడ్ పాటపై డ్యాన్స్ చేస్తాడు.
కుప్పకూలిపోయిన కల్యాణ్
పాటకు ఫీల్ అవుతూ డ్యాన్స్ చేసి బాధతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కల్యాణ్. దాంతో అంతా షాక్ అవుతారు. కల్యాణ్‌ను లేపి ఏమైందని కంగారుగా అడుగుతారు. వాళ్ల కంగారు చూసి ఏం కాలేదని, పర్ఫామెన్స్ చేశాను అంతే, నేను ఏడుస్తున్నాని అనుకున్నారా.. సాంగ్ అలాంటిది, నాకోసం చప్పట్లు కొట్టరా అని కల్యాణ్ అంటాడు. చాలా బాగా చేశారని కావ్యతోపాటు అంతా చప్పట్లు కొడతారు. సరే నేను హోస్ట్ చేస్తానని చెప్పి రుద్రాణిని పిలుస్తాడు కల్యాణ్.
చూడు డ్యాన్స్ అంటే అలా ఉంటదని రాహుల్ అంటాడు. కుర్చీ మడతపెట్టి పాటకు అదిరిపోయేలా రుద్రాణి డ్యాన్స్ చేస్తుంది. తర్వాత ప్రకాశం కూడా జాయిన్ అవుతాడు. రుద్రాణి, ప్రకాశం కుర్చీ మడతపెట్టి పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేస్తారు. రాహుల్ ఏమాటకు ఆ మాట చెప్పాలి మీ అమ్మ డ్యాన్స్ అదరగొట్టిందని స్వప్న అంటుంది. ఇక చివరిగా మిగిలింది అన్నయ్య వదినా అని రాజ్ కావ్యను పిలుస్తాడు కల్యాణ్. అప్పుడు రాజ్‌ను పిలిచిన ఇందిరాదేవి.. నీ ప్రేమ చెప్పడానికి ఇదే మంచి అవకాశం అని అంటుంది.
మోసం చేస్తే మర్చిపోలేరు
నిజమేనే చెబుతున్నా.. నిన్నే నే ప్రేమిస్తున్నా అనే పాటకు రాజ్ కావ్య డ్యాన్స్ చేస్తారు. అలా తన మనసులోని ప్రేమను బయటపెడతాడు రాజ్. తర్వాత కావ్యను ఎత్తుకుంటాడు. దాంతో అంతా చప్పట్లు కొడతారు. ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న కేక్ కటింగ్ అని కల్యాణ్ చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్లో కావ్యతో అపర్ణ సమస్య నువ్ అనుకున్నంత చిన్నది కాదు. అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసింది. కడుపున పుట్టిన కొడుకైన కూతురైన తప్పు చేస్తే క్షమించని ఆడవాళ్లు తాళి కట్టిన భర్త మోసం చేస్తే మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. మనకు తెలియకుండా ఇంకొకరితో కలిసి మోసం చేస్తే ఎవ్వరూ క్షమించరు అని అంటుంది.
మీరు శిక్ష మావయ్యేకాదు. మీక్కూడా వేసుకుంటున్నారు. ఈ బాధ మోసినంత కాలం మీరు ప్రశాంతంగా ఉండలేరని చెప్పి వెళ్లిపోతుంది కావ్య.
టాపిక్