తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 12th Episode: దుగ్గిరాల ఆస్తిపై కావ్యకే సర్వ హక్కులు- తాతయ్య తిరుగులేని అస్త్రం- ధాన్యం నోట్లో మట్టి

Brahmamudi December 12th Episode: దుగ్గిరాల ఆస్తిపై కావ్యకే సర్వ హక్కులు- తాతయ్య తిరుగులేని అస్త్రం- ధాన్యం నోట్లో మట్టి

Sanjiv Kumar HT Telugu

12 December 2024, 8:15 IST

google News
    • Brahmamudi Serial December 12th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి లాయర్ వచ్చి సీతారామయ్య రాసిన వీలునామాను చదువుతాడు. అందులో దుగ్గిరాల ఆస్తి మొత్తం కావ్యపేరుమీద రాస్తున్నట్లు, సర్వ హక్కులు కావ్యకే ఉన్నట్లు ఉంటుంది. మావయ్య తిరుగులేని అస్త్రాన్ని వదిలారు అని అపర్ణ అంటుంది.
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 12వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 12వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 12వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మావయ్య నిర్ణయాన్ని ఆపమని రాజ్‌తో కావ్య చెబుతుంది. ఒకరకంగా డాడ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. ఆరోజు తాతయ్య తీసుకున్న నిర్ణయం అప్పుడు ఎవరైనా నన్ను అడిగారా అని రాజ్ అంటాడు. మీరు ఈ ఇంటి వారసుడు అండి అని కావ్య అంటుంది.

ప్రకాశం శాపం

అది నువ్వు గుర్తు చేస్తే కానీ నాకు తెలియట్లేదు. ఇంట్లో అందరూ కలిసి నన్ను ప్రేక్షకుడిని చేశారు అని రాజ్ అంటాడు. అలా అన్ని బంధాలన్నీ విడిపోతుంటే చూస్తారా. ఒక్కసారి విడిపోతే కలవడం చాలా కష్టం అని కావ్య అంటుంది. నువ్ చెబితే గానీ తెలియని చిన్న పిల్లాడిని కాదు. పరిస్థితి నా చేయి దాటిపోయింది అని రాజ్ అంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీని శభాష్ అంటూ మెచ్చుకుంటుంది రుద్రాణి. నీ కొడుకు, నా కొడుకు న్యాయం జరుగుతుంది అని రుద్రాణి అంటుంది.

రెండు కోట్ల గురించి అడిగితేనే కదా ఇదంతా జరిగింది అని రుద్రాణి అంటే.. అవును, ఈ విషయంలో నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో వచ్చిన ప్రకాశం వచ్చి థ్యాంక్స్ కాదు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవే. నువ్ రోజు రోజుకు దీని మాయలో పడి మనిషిలా చచ్చిపోతున్నావ్, మృగంలా మారిపోతున్నావు. ఆస్తి విషయంలో ఏదో సాధించావనుకుంటున్నావ్. కానీ, ఏం కోల్పోతున్నావో అర్థం కావడంలేదు అని ప్రకాశం అంటాడు.

తను చేసింది కూడా నీ కొడుకు కోసమే కదా అని రుద్రాణి అంటే.. ఇంకో మాట మాట్లాడితే పళ్లు రాళగొడతాను అని వార్నింగ్ ఇస్తాడు ప్రకాశం. నువ్ దీని మాయలో పడి మారిపోయావ్. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్. ఆస్తులు కన్న బంధాలు ముఖ్యం అనుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్ ఎంత డబ్బు ఇచ్చిన నీవైపు చూడరు అని ప్రకాశం అంటే.. ఏంటీ శపిస్తున్నారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. శాపం కాదే జరగబోయేది చెబుతున్నా. ఏదో ఒక రోజు ఈ రుద్రాణే నిన్ను నిలువునా ముంచుతుంది చూడు అని ప్రకాశం వెళ్లిపోతాడు.

క్లాస్ పీకిన రాజ్

ఈరోజు మనం ఎంత గొప్ప పని చేశామో ఆయనే త్వరలో తెలుసుకుంటాడు అని రుద్రాణితో చెప్పి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కట్ చేస్తే హాల్లో అంతా ఉంటారు. రాజ్ ఆఫీస్‌కు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ ఆపి ఇంకాసేపట్లో లాయర్ వస్తాడు అని చెబుతుంది. వచ్చి ఏం చేస్తాడు. ఆస్తులు ముక్కలు చేస్తాడు. ఆస్తులే కాదు బంధాలు, అనుబంధాలు ముక్కలు అవుతాయి. మనం అనే స్థాయి నుంచి నేను నా భార్య అనే స్థాయికి పడిపోయేందుకు పత్రాలు సిద్ధం చేసి పోతాడు అని రాజ్ అంటాడు.

ఆ శిథిలాలను ఏరుకోడానికి నేను సిద్ధంగా లేను అని రాజ్ అంటే.. ఇందులో నీకు వాటా వస్తుందని రుద్రాణి అంటుంది. ఎందులో వాటా పంచుకోవాలి అత్త. స్వార్థంలోనా, సంకుచితంలోనా. ఒక మహావృక్షాన్ని కూకటివేళ్లతో కూల్చివేసి కొమ్మ ఒకరు, రెమ్మ మరొకరు పంచుకోడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో నేను లేను అని, ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ మహావృక్షం లోపల ఉంటేనే పచ్చగా ఉంటుంది. లేకుంటే మాడు అయిపోతుంది అని రాజ్ అంటాడు.

ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఇకనుంచి ఏ బంధం ఉండదు. మా నాన్న రుద్రాణి, రాహుల్‌ను పెంచి పోషించాడు అనుకున్నాడు. కానీ, ఇంట్లో చిచ్చు పెట్టడానికి రెండు దరిద్రాలను పెంచాడని తెలియదు అని ప్రకాశం అంటే.. ఆస్తి అంటే మట్టి కాదు. అది మన కొడుకును దర్జాగా బతికేలా చేస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను వెళ్తున్నాను అని రాజ్ అంటే.. కావ్య ఆపుతుంది. ఇంతలో లాయర్ వస్తాడు. దాంతో రాజ్ ఆగిపోతాడు.

మీకు హక్కు లేదు

పిల్లల పేరుమీద ఆస్తి పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం ఆస్తి ముక్కలు చేసి అందరికీ సమానంగా పంచాలి అని లాయర్‌తో అంటాడు సుభాష్. పెద్దాయనను కాదని ఈ నిర్ణయం మీరెలా తీసుకుంటారు అని లాయర్ అంటే.. ఈ నిర్ణయం తప్పనిపరిస్థితుల్లో తీసుకున్నాను అని సుభాష్ అంటాడు. సారీ సర్ ఈ హక్కు మీకు లేదు. ఆస్తిని వాటాలు చేసే హక్కు మీకు లేదు. మీకేకాదు ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని లాయర్ అంటాడు.

ఆ మాట చెప్పడానికి మీరెవరు. మేము చెప్పినట్లు చేయండి అని రుద్రాణి అంటుంది. నేనేం ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. మీ నాన్న గారు మీకు ఏం చెప్పలేదా. మీ నాన్న గారు వారం క్రితమే వీలునామా రాశారు. సీతారామయ్య గారు కోలుకుని వచ్చాక రావాలనుకున్నాను. ఈలోపు పిలిపించారంటే మీకు చెప్పారని అనుకున్నాను. సరే ఎప్పటికైనా మీకు తెలియాలి కాబట్టి వీలునామా తీసుకొచ్చాను అని లాయర్ అంటాడు.

ఏం బాంబ్ పేలుస్తాడో ఈ ముసలోడు అని రుద్రాణి అనుకుంటుంది. సీతారామయ్య గారు అనారోగ్యంతో మంచాన పడిన. లేదా జరగరానిది జరిగిన ఈ వీలునామా బయటపెట్టమని అన్నారు అని లాయర్ అంటాడు. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో కోమాలో ఉన్నారు. కాబట్టి మీరు బయటపెట్టొచ్చు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దుగ్గిరాల సీతారామయ్య రాసిన వీలునామాను లాయర్ చదువుతాడు.

సంయమనం పాటించి అందరూ ఈ వీలునామాను గౌరవించాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో కుటుంబం అంటే విడిపోకుండా ఒకరికొకరు అండగా ఉండాలి. దుగ్గిరాల కుటుంబం అంటే ఉమ్మడిగానే ఉంటుందని అందరికి తెలుసు. ఆ పేరు ప్రతిష్టలు ఎప్పటికీ ఉండాలనే సదుద్దేశంతోనే ఈ వీలునామా రాయిస్తున్నాను. అందుకే ఆస్తిని ముక్కలు చేయాదల్చుకోలేదు. ఎవరికీ వాటాలు పంచదల్చుకోలేదు అని సీతారామయ్య చెప్పినట్లుగా చూపించారు.

అది అన్యాయం

ఇది నా స్వార్జితమైన ఉమ్మడి ఆస్తి. ఉమ్మడిగానే ఉండాలి. కాబట్టి, అందుకు పూర్తిగా సమర్థురాలైన ఈ ఇంటి కోడలు నా మనవరాలు అయిన కావ్య పేరుమీద నా యావదాస్తిని రాస్తున్నాను అని సీతారామయ్య వీలునామాలో ఉంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అన్యాయం. ఇంత ఆస్తిని బయట నుంచి వచ్చిన కావ్యమీద రాయడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అరుస్తుంది. ఎందుకు ఆవేశపడతావే నా ముద్దుల పెళ్లామే పూర్తిగా చదవని. లాయర్ మీరు చదవండి అని ప్రకాశం అంటాడు.

ఇందులో ఎవరు ఆక్షేపించడానికి అవకాశం లేదు. ఎవరు ఆమోదించినా ఆమోదించకున్నా సర్వ హక్కులు నా మనవరాలు కావ్యకే ఉన్నాయి. ఈ స్థిర చరాస్థాలు ఎవరు అమ్ముకోడానికి కానీ, వాటాలు పంచుకోడానికి గానీ వీలు లేకుండా పగడ్భందీగా లీగల్‌గా ఆస్తులన్నింటిని కావ్య పేరు మీదకు మార్చటం జరిగింది అని సీతారామయ్య అంటాడు. అది నా బావ అంటే.. ఆయన దూరాలోచనను చూస్తే నాకు గర్వంగా ఉంది. శభాష్ బావ అని ఇందిరాదేవి అంటుంది.

ఏంటీ అత్తయ్య గర్వంగా ఉండేది. మా నోట్లో మట్టి కొడతారా అని అరుస్తుంది ధాన్యలక్ష్మీ. నోట్లో మట్టి అలాగే ఉంచుకుని సైలెంట్‌గా ఉండు. లాయర్ ముందు నీ చిందులు బాగోవు అని ప్రకాశం అంటాడు. థ్యాంక్స్ లాయర్‌గారు. పెద్ద సంక్షోభం నుంచి కాపాడారు అని సుభాష్ అంటే.. ఇక ఎవరు గింజుకు చచ్చినా తిరుగులేని అస్త్రాన్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు అని అపర్ణ అంటుంది. నా డ్యూటీ నేను చేశాను అని వీలునామా ఇచ్చి వెళ్లిపోతాడు లాయర్.

ధాన్యలక్ష్మీ ఆక్రోశం

దాంతో కరివేపాకు అత్తగారు అని స్వప్న పంచ్‌లు వేస్తుంది. ధాన్యలక్ష్మీ అన్యాయం, ఇదెక్కడి వీలునామా అంటూ ఆక్రోశం వెల్లగక్కుతుంది. ఆ మాటకొస్తే నేను, నువ్వు ఎలా వచ్చామో కావ్య వచ్చింది అని అపర్ణ అంటుంది. నీ కోడలి పేరుమీద రాసేసరికి పొంగిపోతున్నావేమో. నా పేరు మీద కాకుండా బావగారి పేరు మీద రాసిచ్చిన బాగుండేది. ఆఖరికి రాజ్ పేరు మీద రాయకుండా కావ్య పేరు మీద రాయడంలో మావయ్య ఉద్దేశం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మావయ్య చాలా దూరం ఆలోచించి ఇలా చేశారు. ఆస్తి ముక్కలు కావడం ఆయనకు ఇష్టం లేదు. కుటుంబం అంతా కలిసి ఉండేందుకే అలా రాశారు అని అపర్ణ అంటుంది. తర్వాత ఇందిరాదేవిని ధాన్యలక్ష్మీని నిలదీస్తే పళ్లు రాలగొడతాను. నువ్ మహారాణివి, అది పట్టపు రాణివి అనుకుంటున్నావా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న గొప్ప నిర్ణయ తీసుకుంటారు. అది నీలాంటి మట్టి బుర్రలకు అర్థం కాదు. నేను ఆయన భార్యగా ఆ నిర్ణయం ఒప్పుకున్నాకా ఎవరు ఏం చేయరు అని ఇందిరాదేవి అంటుంది.

అంతే అంటారా అని ధాన్యలక్ష్మీ అంటే.. నీ దిక్కున్నచోట చెప్పుకోమన్నారుగా అని ప్రకాశం అంటాడు. నాకున్న ఒకే ఒక్కదిక్కు కోర్టు. ఆ కోర్టుకే వెళ్లి తేల్చుకుంటాను. న్యాయంగా తాతగారి ఆస్తి మనవలకే చెందుతుంది. మనవరాళ్లకు కాదు. ఈ ఒక్క పాయింట్ చాలు నేను గెలవడానికి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ప్రకాశం అరుస్తాడు. ఇక మీరు అరిచిన నేను పట్టించుకోను. మీ నాన్నగారికి మతిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మీకెందుకు కోపం రావడం లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

కోర్టుకెక్కుతాను

రాదు. ఆయన ఉద్దేశం మంచిది. అన్ని ఆలోచించే ఇలా చేశాడు మా నాన్న అని ప్రకాశం అంటాడు. ఇకనుంచి ఈ కావ్య మోచేతి నీళ్లు తాగి బతకాలా అని రుద్రాణి అంటే.. ఇన్నాళ్లు చేసింది అదే కదా అని స్వప్న అంటుంది. తర్వాత నేనేంటో మీ అందరికీ అర్థం అయ్యేలా చేస్తాను. కోర్టుకెక్కి నా కొడుకు వాటా ఎలా రాదో చూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ముసలోడు మనకు అన్యాయం చేశాడురా అని రుద్రాణి అనుకుంటుంది.

ఎందుకైన మంచిది రాహుల్ మీ అమ్మ పక్కనే ఉండు. ఈ రాత్రి హార్ట్ ఎటాక్ రావొచ్చు అని స్వప్న అంటుంది. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్లి జరిగింది ఏంటీ అని మొరపెట్టుకుంటుంది. నేను సౌభాగ్యం అడిగితే ఐశ్వర్యం మొత్తం రాయించి నా చేతుల్లో పెడతావా. ఇదేం లీలా స్వామి అని కావ్య అంటుంది. ఇంటి బాధ్యతలు చూసుకునే అర్హత నాకన్న మీకే ఉందని రాజ్‌తో కావ్య అంటే.. లేదు బాధ్యతలు చూసుకోవడానికి నువ్వే కరెక్ట్ అని రాజ్ అంటాడు.

ఆ తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతావనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. దాంతో కావ్య ఆశ్చర్యపోయి సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం