తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 11th Episode: కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తానన్న ధాన్యలక్ష్మీ- సీతారామయ్య వీలునామాతో పెద్ద ట్విస్ట్

Brahmamudi December 11th Episode: కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తానన్న ధాన్యలక్ష్మీ- సీతారామయ్య వీలునామాతో పెద్ద ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu

11 December 2024, 7:31 IST

google News
    • Brahmamudi Serial December 11th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో రుద్రాణి రెచ్చగొట్టడంతో రెండు కోట్లు కావాలని రాజ్‌ను ధాన్యలక్ష్మీ అడుగుతుంది. సుభాష్, ప్రకాశం, రాజ్ అంతా రాహుల్‌కు ఇవ్వడం కుదరదని చెబుతారు. దాంతో పంచాయితీ, మీడియా, కోర్టుకు ఈడ్చైన ఆస్తి దక్కించుకుంటానని ధాన్యలక్ష్మీ అంటుంది.
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 11వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 11వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 11వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్‌కు రెండు కోట్లు ఇచ్చేలా చేయడానికి రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతారు రుద్రాణి, రాహుల్. దాంతో ఇప్పుడు రాజ్‌తో చెక్‌మీద సంతకం చేయిస్తే మీకు నమ్మకం కుదురుతుందా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

రుద్రాణి ప్లాన్ సక్సెస్

కలగడం ఏంటీ ఈ ఇంట్లో నాకంటే నీకే ఎక్కువ విలువ ఉందని ఒప్పుకుంటాను. ఆస్తి ముక్కలు చేసి నీ కొడుకుకు రావాల్సిన వాటా రప్పించగలవని నమ్ముతాను. మాటలు చెబుతుంది కానీ, వెళ్లి మాట్లాడటానికి ధైర్యం చాలట్లేదు అని రుద్రాణి అంటుంది. దాంతో చెక్ తీసుకుని ఈసారితో నేను అంటే మీతోపాటు ఇంట్లోవాళ్లకు నేనేంటో తెలుస్తుందని వెళ్లిపోతుంది. దాంతో నవ్వుకున్న రుద్రాణి ఇప్పుడు అసలైన ఆస్తి గొడవలు స్టార్ట్ అవుతుందని అంటుంది.

రాజ్ దగ్గరికి వెళ్లిన ధాన్యలక్ష్మీ చెక్ ముందట పెడుతుంది. రాహుల్‌ బిజినెస్ చేసుకుంటాడట అని సంతకం పెట్టమని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ప్రకాశం పంచ్‌లు వేస్తే.. అసమర్థులను పెంచి పోషించడం మాతో కాదు. లక్ష రెండు లక్షలు కాదు రెండు కోట్లు అడుగుతున్నాడు. వాటిని తల్లి లెక్కపెట్టేలోపే రాహుల్ మాయం చేస్తాడని, నీ పెంపకం మీద నమ్మకం లేదని, ఇదివరకే చాలా అవకాశాలు పొగొట్టుకున్నాడు అని సుభాష్ అంటాడు.

అది విషయం ధాన్యలక్ష్మీ నేను చెప్పిందే జరుగుతుంది. నా మాటకే కాదు నీ మాటకు విలువ లేదు. నువ్ ఉరేసుకున్న పట్టించుకోరు ఈ డబ్బు మనుషులు అని రెచ్చగొడుతుంది. దాంతో అపర్ణ, స్వప్న ఫైర్ అవుతారు. తనతో కావాట్లేదని ధాన్యలక్ష్మీ రెచ్చగొట్టి తీసుకొచ్చిందని స్వప్న అంటుంది. అనామికకు రెండు కోట్లు ఇచ్చావ్‌గా అలాగే ఇవ్వమని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆ రెండు కోట్లు నా తమ్ముడి పెళ్లి ఆగకుండా ఉండేందుకు ఇచ్చాను. ఇది నీకోసమో, కల్యాణ్ కోసమో అడిగితే ఇచ్చేవాడిని. కానీ, నువ్ అడిగితే అపాత్రదానం. వాడు డబ్బు నిలబెట్టుకోలేదు అని రాజ్ అంటాడు.

పంతానికే అడుగుతున్నా

అర్థమైందిగా. నీ మాట నిలబెట్టుకునేందుకు రుద్రాణి ఎగదోసింది అని అపర్ణ అంటుంది. అవును, ఇప్పుడు నేను పంతానికే అడుగుతున్నాను. నా హక్కుతో అడుగుతున్నాను. నా వాటా నాకు పంచండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అదే గొడవ ఎందుకు తీసుకొస్తావ్. దానివల్లే మా నాన్న హాస్పిటల్ పాలు అయ్యారుగా. ఆయన తిరిగిరాగానే ఏం చేస్తారో చూద్దాం అని సుభాష్ అంటాడు. మీ అందరికి మంచి సాకు దొరికింది. ఒకవేళ నాన్న తిరిగిరాకపోతే అని రుద్రాణి అంటుంది.

రుద్రాణి.. ఏం కూసావే అని వచ్చి రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది ఇందిరాదేవి. దాంతో అంతా షాక్ అయి లేస్తారు. నువ్ అసలు మనిషివేనా. ఉప్పు తిన్న ఇంటి యజమాని గురించి ఇలా మాట్లాడుతావా. నిన్ను ఉదారంగా పోషించినందుకు తిరిగి రాడనంటావా. నేను తల్చుకుంటే కట్టుబట్టలతో బయటకు పంపిస్తాను అని ఇందిరాదేవి అంటుంది. ఆస్తి కోసం తండ్రి చనిపోవాలని అనుకుంటున్నావా అని సుభాష్ అంటాడు. నీకు ఇంటికి సంబంధం లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి అని ప్రకాశం అంటాడు.

చాలు ఆపండి. ఎక్కడ చెప్పుకోను. ఇదే ఇంట్లో మీ అందరిని ఎదురించి నిలబడగలను. సొంత కూతురుని కాదని పదే పదే ఎందుకు అంటున్నారో నాకు తెలుసు. నాకు ఆస్తిలో వాటా లేదని చెప్పడానికేగా. కానీ, నాన్న కూతురుకి ఆస్తిలో వాటా ఉందన్నాడు. నేను కూడా అడుగుతున్నాను. ఆస్తిలో వాట పంచాల్సిందే. నాకు, నా కొడుకుకు, వాడికి పుట్టబోయే బిడ్డకు వాటా రాసి ఇవ్వాల్సిందే అని రుద్రాణి అంటుంది. మీకు ఇవ్వడానికి నాకు ఏ సమస్య లేదు. కానీ, తండ్రి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని సుభాష్ అంటాడు.

కోర్టుకు ఈడుస్తాను

దాంతో రుద్రాణి మరింత రెచ్చిపోతుంది. ఇంతలో కలుగజేసుకున్న ధాన్యలక్ష్మీ ఇంట్లోవాళ్లందరిని తప్పుబడుతుంది. నాకు, నా కొడుకు అన్యాయం చేద్దామని చూస్తున్నారని అర్థమైంది. నేను పదిమంది ముందు పంచాయితీ పెట్టిస్తాను. మీడియాకు ఎక్కి సంజాయిషీ ఇప్పిస్తాను. అవసరం అయితే కోర్టుకు ఈడ్చి మరి నా హక్కులను సాధిస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. శభాష్. అది ధైర్యం అంటే. వీళ్లకు బుద్ధి చెప్పే తగిన సమయం వచ్చింది. నీ వెనుక నేను ఉన్నాను అని రుద్రాణి అంటుంది.

అలా చేస్తే మీకు అడుక్కునే చిప్ప తప్ప ఏం మిగలదు. నన్ను దాటి నా పెళ్లాం ఇవన్నీ చేయాలనుకుంటే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన నిన్ను, ఉమ్మడి కుటుంబాన్ని బజారుకు ఈడ్చాలనుకునేదీన్ని జైలుకు పంపిస్తాను అని ప్రకాశం అంటాడు. ఏంటీ బెదిరిస్తున్నారా. వీళ్లు ఆడిస్తుంటే ఆడుతున్నారు. భార్య, కొడుకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించని మీరు నన్ను జైలుకేం పంపిస్తారు. అంతవరకు వస్తే అది చూసుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఏం చూసుకుంటావే అని ప్రకాశం గొడవ పడతాడు. ధాన్యలక్ష్మీ, రుద్రాణితో ప్రకాశం గొడవ పడతాడు. ఇంతలో సుభాష్ ఆపండి అని అరుస్తాడు. ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు. ఇంకమీతో కలిసి ఉండాలని కోరుకోవడం ఎంతో మూర్ఖత్వమో అర్థమైంది. మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్‌ను పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పంచిస్తాను అని సుభాష్ అంటాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ సంతోషిస్తారు.

పూలకుండీని తన్నిన సుభాష్

తాతయ్య అలా ఉంటే ఎలా చేస్తారు అని రాజ్ అంటాడు. దీపావళి నుంచి ఉదయం లేస్తే ఆస్తి ఆస్తి అని నరకం చేస్తున్నారు. కలిసి ఉండాలని లేనప్పుడు ఏం చేస్తాం. అప్పటివరకు నోరు ఎత్తకుండా చూసుకో అని ప్రకాశంకు చెప్పి వెళ్లిపోతాడు సుభాష్. అంతా వెళ్లిపోతారు. నీ సపోర్ట్‌తోనే ఇదంతా జరిగింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దెబ్బకు దిగొచ్చారు అని రుద్రాణి అంటుంది. మరోవైపు పూలకుండీని కోపంగా తన్ని కాలికి దెబ్బ తగిలించుకుంటాడు సుభాష్.

కావ్య వచ్చి ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైనది కాదని మీకే బాగా తెలుసు అని, తాతయ్య వయసు, ఆయన పరిస్థితి గురించి, ఇంట్లో అందరు కలిసి ఉండాలని కోరుకున్నారని, ఆయన కోలుకుని వస్తే ఇది తెలిసి తట్టుకోగలరా అని మాట్లాడుతుంది కావ్య.

ఎందుకో మీ నిర్ణయం సరైంది కాదని చెప్పి మీతో చెప్పాని వచ్చాను. మీరు తలుచుకుంటే వాళ్లందరి నోళ్లు మూయించగలరు. మీరే మౌనంగా ఉండటం నిజంగా నాకు నచ్చలేదు. అక్కడే ఇది చెప్పాలనుకున్నాను. నలుగురిలో మీ మాటకు ఎదురుచెప్పి మిమ్మల్ని తక్కువ చేయలేను. అందుకే కోడలిని అయినా కూతురిలా చనువు తీసుకుని ఇలా వచ్చి చెబుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని కావ్య అంటుంది.

నిర్ణయంలో మార్పు లేదు

ఆలోచించాను, ఒకటికి వందసార్లు ఆలోచించాను. ప్రతిసారి ఆస్తి అంటూ ఉంటే ఏం చేయను. రుద్రాణి మాటలు విన్నావుకదా. చెదలు మొదలు అయినప్పుడే ముక్కలు తీసి పడేయాలి. ఇంకెవరి మాట వినే స్థితిలో నేను లేను. ఆస్తి కోసం వీళ్లు మా నాన్న చనిపోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నాన్న ఉంటే ఆయనే ఆస్తి పంచేవారు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని సుభాష్ వెళ్లిపోతాడు. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అని మావయ్యకు అర్థం కావట్లేదు. ఎలా అయినా దీన్ని ఆపాలి అని కావ్య అనుకుంటుంది.

తర్వాత గదిలో రాజ్‌ను చూస్తుంటుంది కావ్య. రాజ్ తన పని తాను చేసుకుంటే కావ్య కోప్పడుతుంది. ఇంట్లో దాని గురించి కావ్య అడిగితే తినడం, పడుకోవడం గురించి రాజ్ అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. ఈ ఇల్లు ముక్కలు అవడం మీకు ఇష్టమా. ఆస్తులు పంచడం ఇష్టమా. ఎందుకు పట్టించుకోవడం లేదు. మీకు ఇష్టం కావచ్చు తాతయ్యకు ఇష్టం లేదు. ఆస్తి పంపకాలు జరిగితే తాతయ్య ప్రాణాలు అటు నుంచి అటే వెళ్లిపోతాయి. తాతయ్య జ్ఞాపకాలతో ఉన్న అమ్మమ్మ ప్రాణాలు కూడా నిలవవు అని కావ్య అంటుంది.

మావయ్యతో మాట్లాడిన ఆయన వినట్లేదు. మీరైనా వెళ్లి మాట్లాడండి అని కావ్య అంటుంది. ఇంట్లోవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావ్ కదా. ఒకరకంగా డాడ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. కలిసి ఉందామని ఒక్కరు చెబుతున్నారా. తాతయ్య నిన్ను సీఈఓ చేసినప్పుడు ఒక్కరైనా నన్ను అడిగారా. ఈరోజు అంతా ఆస్తులు కావాలంటున్నారు. నన్ను ఒక్కరైనా అడిగారా అని రాజ్ అంటాడు.

కావ్య పేరు మీద ఆస్తి

మరుసటి రోజు లాయర్ వచ్చి సీతారామయ్య ఒక వీలునామా రాశారని అది చదువుతాడు. ఇది నా ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి. కాబట్టి నా మనవరాలు అయిన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను అని వీలునామాను లాయర్ చదువుతాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీకి దిమ్మతిరుగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం