Brahmamudi December 6th Episode: తాతయ్య ఆఖరి కోరిక- అబద్ధమాడిన కావ్య- అనాథశరణాలయానికే ఆస్తి- పోలీస్ పెళ్లాం పాటల మొగుడు
Brahmamudi Serial December 6th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 6 ఎపిసోడ్లో సీతారామయ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంటుంది. కావ్యను పిలిచి తన ఆఖరి కోరిక అని మాట తీసుకుంటాడు. మరోవైపు అప్పు ఎస్సై ట్రెనింగ్‌కు సెలెక్ట్ అయినట్లు లెటర్ వస్తుంది. ఆ సంతోషంతో పోలీస్ పెళ్లాం, పాటల మొగుడు అని అంటుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సీతారామయ్యకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ధాన్యలక్ష్మీని ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని తిడుతుంది ఇందిరాదేవి. మధ్యలో రుద్రాణి కలుగుజేసుకుని తన తప్పు ఏముంది, వాటా రాసిస్తే అయిపోయేదిగా అని అంటుంది.
కోపంగా లేచిన రుద్రాణి
దాంతో నువ్ ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను. నువ్వు నోరెత్తకు. నీకేం సంబంధం లేదు. మీ అయ్య సంపాదించింది ఇక్కడ ఏం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆడపడుచు అన్న హోదా కూడా ఉండకుండా మెడపట్టుకుని గెంటేస్తాను అని కోపంగా అంటుంది అపర్ణ. నాకు చెప్పండి నేనే గెంటేస్తాను అని స్వప్న అంటే రుద్రాణి కోపంగా లేస్తుంది. హే.. నువ్ చెప్పినట్లు వినడానికి ఆ ధాన్యలక్ష్మీలా బుద్ధి జ్ఞానం లేదనుకుంటున్నావా. అసలు ఆడవాళ్లేనా మీరు అని స్వప్న అంటుంది.
ఒకరి ఇంట్లో ఒక ముద్ద అన్నం తింటేనే ఎంతో విశ్వాసంగా ఉండే సంస్కృతి మనది. అలాంటిది నిన్ను పెంచి పోషించి, చదివించి, పెళ్లి చేసి, నీ పెళ్లి పెటాకులు చేసుకుని, అయిదోతనం ఉందో లేదో అన్న స్థితిలో ఉంటే మళ్లీ నీకు ఆశ్రయం ఇచ్చి ఈ దున్నపోతును (రాహుల్) మేపి ఇంత చేస్తే ఆ పెద్ద మనిషి భిక్షతో బతికిన నువ్వు ఈ సమయంలో ఈ బుద్ధిలేని దానికి సపోర్ట్ చేసి మాట్లాడతావా. కన్నతల్లిగా ఎక్కువగా చూసుకున్న మీ అమ్మ పక్కన కూర్చుని ఓదార్చడం మానేసి వత్తాసు పలుకుతావా. సిగ్గుందా. అసలు నీదు జన్మేనా. ఛీ అని అపర్ణ తిడుతుంది.
అమ్మ ధాన్యలక్ష్మీ నీకో నమస్కారం. నీతో మాట్లాడితే నీకు ఏదో నూరిపోస్తున్నా అనుకుంటున్నారు. నీ ఏడుపు ఏదో నువ్వు ఏడు. మా నాన్నకు అలా ఉంటే నా గుండె ముక్కులైపోతుంది. అది ఎవరికి తెలుసు అని రుద్రాణి నటిస్తుంది. దాంతో నటించకు రుద్రాణి, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ప్రకాశం అంటాడు. అంతా రుద్రాణిపై ఎందుకు పడతారు. నాకు మాత్రం మావయ్య ఇలా ఉంటే బాధగా ఉండదా. నట్టింట్లో ఉరేసుకుని నేను చనిపోవాలనుకున్నప్పుడు ఒక్కరైనా పట్టించుకున్నారా. అంతా నన్నే అంటున్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఆస్తి మొత్తం అనాథశరణాలయానికి
నువ్ ఎందుకు చావాలనుకున్నావ్. తిండి లేదా నీడ లేదా. నేను చిత్రహింసలు పెట్టానా. చస్తా అని ఎవరిని బెదిరిస్తున్నావ్. ఎవరికి తెలియవే నీ నంగనాచి నాటకాలు. ఇప్పుడు కూడా ఆస్తి మాట ఎత్తితే పక్కబెడ్‌లో చావు బతుకుల్లో పడి ఉంటావ్ అని ప్రకాశం వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఆయనకు ఏమైనా జరగాలి. ఆయన తదనంతరం ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిపారేస్తాను జాగ్రత్త అని ఇందిరాదేవి ట్విస్ట్ ఇస్తుంది.
కావ్య ఓదారుస్తుంది. ఇంతలో రాజ్ వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. హార్ట్ ఎటాక్ వచ్చిందని అపర్ణ చెబుతుంది. ఇంతలో సీతారామయ్య కావ్య కావ్య అంటూ కలవరిస్తాడు. దాంతో డాక్టర్ వచ్చి అదే విషయం చెబుతాడు. కండిషన్ సీరియస్‌గానే ఉంది. ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితి తర్వాత ఉంటుందో లేదో. వెళ్లండి అని డాక్టర్ అంటాడు. నేను వస్తే తట్టుకోలేననే నిన్ను రమ్మంటున్నారు అమ్మ. నువ్ చెప్పే ధైర్యమే ఆయనకు జీవం పోస్తుంది అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య ఐసీయూలోకి వెళ్తుంది. రాజ్‌ను పక్కకు పిలిచి డాక్టర్ మాట్లాడుతాడు. కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ఆయన బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేం. మీ ఫ్యామిలీకి అర్థమయ్యేలా మీరే చెప్పండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. కావ్యను చూసిన సీతారామయ్య కూర్చోమంటాడు. నీతో తర్వాత మాట్లాడుతానో లేదో. ఇప్పుడే నీకు చెప్పాలి అని సీతారామయ్య అంటాడు. మీకు ఏమైనా మీ చిట్టి ఏమైపోవాలి. ఇప్పటికే గుండెపగిలేలా ఏడుస్తున్నారు అని కావ్య అంటుంది.
చీకటి అవుతుంది
తెలుసుమ్మా. వాడు మాట్లాడకపోయినా మాకోసం అన్నం తీసుకొచ్చావ్. నేను లేకపోతే చిట్టిని నువ్ చూసుకోలేవా. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. రాజ్‌కు ఇష్టం లేకుండా నిన్ను తీసుకొచ్చాం. అది నీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇకనుంచి నీకు ప్రతిరోజు పరీక్షలా ఉంటుంది. రాజ్ నీపై దురుసుగా మాట్లాడొచ్చు. నువ్ మా ఇంటి మహాలక్ష్మివి. నువ్ వెళ్లిపోతే చీకటి అవుతుంది. ఇంట్లో ఆస్తి పంపకాల ముసలం పుట్టింది. అది జరగకుండా అందరూ కలిసేలా, ఇల్లు ముక్కలు అవ్వకుండా చూస్తానని నువ్వు నాకు మాట ఇవ్వాలి అని సీతారామయ్య అంటాడు.
ఇంతపెద్ద బాధ్యతను నేను ఎలా మోయగలను అని కావ్య అంటుంది. రాహుల్, రుద్రాణి మాటలు వింటారు. ఈ తాతయ్య కోరేది ఒక్కటేనమ్మా. ఎన్ని సమస్యలు ఎదురైనా నువ్ మాత్రం ఇల్లు వదిలి వెళ్లపోవద్దు. ఇల్లు కాపాడాలి. నీ ఓర్పుతో ఇల్లు చక్కబెడతానని, అలిగి వెళ్లిపోనని నాకు మాట ఇవ్వమ్మా అని సీతారామయ్య అంటాడు. ఆ ముసలోడు రహస్యం చెబుతున్నాడు ఏంట్రా అని రుద్రాణి అంటే.. లేదు మమ్మీ ఏదో విషయంలో మాట తీసుకుంటున్నాడు. కానీ, అర్థం కావట్లేదు అని రాహుల్ అంటాడు.
ఈ ముసలోడు మనల్నీ నిలువెల్లా ముంచేసే ప్రయత్నం చేయట్లేదు కదా అని రుద్రాణి అంటుంది. ఇదే నా ఆఖరి కోరిక అనుకోమ్మా అని సీతారామయ్య అంటాడు. మీరు అలా మాట్లాడితే తట్టుకోలేను. నిండు నూరేళ్లు జీవించాలి. మీ మునిమనవళ్లను ఎత్తుకోవాలి. అయినా మీ తృప్తి కోసం మాటిస్తున్నాను. అగ్ని పరీక్షలు ఎదురైనా స్థిరంగా మీకిచ్చిన మాట మీద నిలబడతాను తాతయ్య అని కావ్య ప్రామిస్ చేస్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని సీతారామయ్య అంటాడు.
అందరికీ న్యాయం చేస్తారు
ముసలోడు వాళ్లకు అనుకూళంగా, మనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడు. పదా బయటకెళ్లి తెలుసుకుందాం అని రుద్రాణ అంటుంది. ఇంతలో సీతారామయ్యకు సీరియస్ అవుతుంది. దాంతో నర్స్‌ను పిలుస్తుంది కావ్య. డిస్టర్బ్ చేయకండి అని కావ్యను వెళ్లమంటుంది నర్స్. కావ్య బయటకు వస్తుంది. తాతయ్యకు ఎలా ఉందని ఇందిరాదేవి అడుగుతుంది. చెప్పమ్మా. నిన్ను రమ్మన్నారుగా. నువ్వు చెప్పేదే ముఖ్యం అని రుద్రాణి అంటుంది.
దాంతో అంతా తిడతారు. నన్ను అంటే నాన్నగారు ఆరోగ్యంగా లేచి తిరుగుతారా అని రుద్రాణి అంటుంది. తాతయ్యకు అలాగే ఉంది. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు అని కావ్య అంటే.. సగం సగం చెబుతావ్ ఏంటీ. పూర్తిగా చెప్పు అని రాజ్ అంటాడు. లోపల ఏవో మంథనాలు జరిగాయి. ఏవో డీల్స్ కుదిరాయ్ అని రుద్రాణి అంటుంది. దాంతో అపర్ణ వారిస్తుంది. తాతయ్య గారు ఆరోగ్యంగా కోలుకుని వచ్చేవరకు ఇంట్లో గొడవలు పడకూడదని, వచ్చాక అందరికి న్యాయం చేస్తారని చెప్పారు అని కావ్య అబద్ధం చెబుతుంది.
తర్వాత మెల్లిగా ధాన్యలక్ష్మీని ఉసిగొలుపుతుంది రుద్రాణి. అవకాశం దొరికింది కదా అని వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ వెళ్లి సైలెంట్‌గా వెళ్లి కూర్చుంటుంది. ఈ ముసలోడికి ఏం కాకముందే మన ఆస్తి మనకొచ్చేలా చేసుకోవాలి అని రుద్రాణి, రాహుల్ అనుకుంటారు. మరోవైపు అప్పుకు కొరియర్ వస్తే కల్యాణ్ తీసుకుంటాడు. అది చూసి తెగ సంబరపడిపోతాడు కల్యాణ్.
ఎస్సై ట్రైనింగ్‌కు అప్పు
అప్పును పిలిచి లెటర్ చూడమంటాడు. నేను రిటన్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యాను, పోలీస్ ట్రైనింగ్‌కు వెళ్లాలి అని అప్పు అంటుంది. నా పొట్టి పోలీస్ అయింది అని కల్యాణ్ అంటే.. అవునురా భయ్.. నేను పోలీస్ పెళ్లాన్ని.. నువ్ పాటల మొగుడివి అని సంతోషంగా హగ్ చేసుకుంటుంది అప్పు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. మనం ఎదుర్కొన్న అవమానాలు ఒక్కసారిగా పటాపంచలు అయినట్లు అయిందని అప్పు అంటుంది.
ఈ విషయం ముందు తాతయ్యకు చెప్పాలి. ఆయన చాలా సంతోషిస్తారు అని కల్యాణ్ అంటాడు. అసలు ట్రైనింగ్ ఎప్పుడుంది అని అప్పు అంటే లెటర్లో కల్యాణ్ చూస్తాడు. ఇది రెండు రోజులు లేట్ వచ్చింది. ట్రైనింగ్‌కి ఇవాళే వెళ్లాలి. నా ఫ్రెండ్‌ను టికెట్‌ను బుక్ చేయమని, త్వరగా రెడీ అవ్వమని కల్యాణ్ చెబుతాడు. ఫ్రెండ్‌కు కాల్ చేసి టికెట్ బుక్ చేస్తాడు. ఇంతలో కావ్య కాల్ చేసి సీతారామయ్య హార్ట్ ఎటాక్, ధాన్యలక్ష్మీ సూసైడ్ గురించి చెబుతుంది.
ఇప్పుడే వస్తున్నాను అని కల్యాణ్ అంటే.. బ్యాగ్ సర్దుకున్న అప్పు రెడీ అని వస్తుంది. ఒక బ్యాడ్ న్యూస్ అప్పు, నిన్ను డ్రాప్ చేయడానికి స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అర్జంట్‌గా వేరే పని ఉంది. ఏమనుకోకు అని కల్యాణ్ అంటాడు. లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్లాలా. దానికెందుకు అంతలా మొహమాట పడుతున్నావ్ అని అప్పు అంటుంది. సారీ పొట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తాతయ్య గురించి చెప్పలేను అని మనసులో అనుకుంటాడు కల్యాణ్.
రగిల్చిన రుద్రాణి
ఆ అనామిక వచ్చి నీ కాళ్లమీద పడేలా చేయాలి అని కల్యాణ్‌తో అప్పు అంటుంది. మరోవైపు ఇంట్లో భోజనం చేస్తుంటారు అంతా. ధాన్యలక్ష్మీ సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంది. ఇప్పుడు నాన్నకు ఏదైనా అయితే ఎటు కాకుండా పోతుంది. ఏదైనా ఇప్పుడే చేయాలి అని రుద్రాణి అంటుంది. షటప్ రుద్రాణి అని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా అంటుంది. రుద్రాణిని ముందుకు ఎగదోసి ఆస్తి కావాలనుకోవడం ఏంటీ ధాన్యలక్ష్మీ గారు అని కావ్య వారిస్తుంది. నీకేం సంబంధం అని ధాన్యం అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్