తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి- జైలుకు కల్యాణ్, ఎండీగా రాహుల్- వెన్నెల రాకతో భయపడిన రాజ్- నిజం తెలుస్తుందంటూ!

Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి- జైలుకు కల్యాణ్, ఎండీగా రాహుల్- వెన్నెల రాకతో భయపడిన రాజ్- నిజం తెలుస్తుందంటూ!

Sanjiv Kumar HT Telugu

15 April 2024, 7:28 IST

  • Brahmamudi Serial April 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ కొత్త కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. కల్యాణ్ జైలుకు, రాహుల్ ఎండీ సీటులో కూర్చునే స్కెచ్ వేస్తాడు. మరోవైపు పార్టీకి వెన్నెల వస్తుందని, నిజం తెలిసిపోతుందని రాజ్ భయపడిపోతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. అప్పటివరకు కావ్య మాటలు విన్న ఇందిరాదేవి వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటుంది. వస్తాను అమ్మమ్మ అంటే.. వస్తాను అని చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. నాకు అలానే చెప్పాలని ఉంది. కానీ, ఏం జరుగుతుందో తెలియదు అని కావ్య అంటుంది. తప్పు చేశాను. అసలు నిన్ను ఇదంతా చేయించాల్సింది కాదు అని ఇందిరాదేవి అంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

పది కేజీల గోల్డ్

నిజాన్ని పాతిపెట్టాలని చూస్తున్నారు అని కావ్య అంటే.. నువ్ ఇంట్లోనే ఉండిపోవాలని చూస్తున్నాను అని ఇందిరాదేవి అంటుంది. తిరిగి రావాలనే కోటి ఆశలతో వెళ్తున్నాను. కానీ, నా ఆశలకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీస్‌లో కల్యాణ్ వర్క్ చేసుకుంటాడు. కల్యాణ్‌నే చూస్తున్న రాహుల్ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. టోనీ అనే వ్యక్తికి కాల్ చేస్తాడు. అబ్రాడ్ నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన పది కేజీల గోల్డ్‌ను తన కంపెనీ కొనేలా చేస్తానని చెబుతాడు రాహుల్.

ఓకే కానీ, పోలీసులకు తెలిస్తే మాత్రం నేను ఉండను అని టోనీ అంటాడు. నేను కూడా ఉండను. దానికి బలి పశువును సిద్ధం చేశాను అని రాహుల్ అంటే.. సరే అగ్రిమెంట్‌పై సంతకం చేయించు అని టోనీ అంటాడు. నా 20 పర్సంట్ కమిషన్‌లో ఎలాంటి తేడా రాకూడదని రాహుల్ అంటే అతను సరే అంటాడు. తర్వాత ఒరేయ్ కల్యాణ్ ఈ ఫైల్ నీ తలరాతనే మార్చేస్తుంది. దీంతో నువ్ జైలుకు నేను ఎండీ సీటులోకి వెళ్లిపోతాం అని ఆ ఫైల్ కల్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాడు రాహుల్.

స్కూల్ రీ యూనియన్

కల్యాణ్ గోల్డ్ తక్కువకే వస్తుందని నమ్మిస్తాడు రాహుల్. అవునా సరే.. ఓసారి అన్నయ్యను అడిగి చెబుతాను అని కల్యాణ్ అంటాడు. సరే ఈ ఫైల్ చూడు అని రాహుల్ అది ఇచ్చి వెళ్లిపోతాడు. పిచ్చోడా.. ఇవాళ రాజ్ ఆ పార్టీకి వెళ్తున్నాడు. వాడు వచ్చేలోపు నీతో సంతకం చేయించుకుంటాను అని రాహుల్ అంటాడు. కల్యాణ్ ఆ ఫైల్ చదువుతూ ఉంటాడు. మరోవైపు రాజ్ స్కూల్ రీ యూనియన్ ఏర్పాట్లు జరుగుతుంటాయి.

ఇంతలో బిడ్డతో రాజ్, కావ్య వస్తారు. వాళ్లను చూసిన శ్వేత ఇవాళ అన్నింటికి సమాధానాలు దొరుకుతాయ్ అని అనుకుంటుంది. శ్వేత వెళ్లి పలకరిస్తుంది. చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే రీఫ్రెష్ అవుతామని శ్వేత అంటుంది. కొన్ని పరిచయాలు అక్కడితోనే కాకుండా జీవితాంతం తోడుగా ఉంటాయి. ఏ స్నేహం ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలుసు అని కావ్య అంటుంది. తర్వాత అందరికీ రాజ్‌ను కావ్యను ఇంట్రడ్యూస్ చేస్తుంది శ్వేత.

చాలా అదృష్టం

బాబుని ఆయాకు ఇస్తారు. ఇంతలో రాజ్ ఫ్రెండ్ సందీప్ తన భార్యతో వస్తాడు. గతంలో సందీప్‌ను పెళ్లి పీటల మీద నుంచి తీసుకొస్తాడు రాజ్. అది గుర్తు చేసుకున్న రాజ్ మీరిద్దరూ కలిసిపోయారా అని రాజ్ అడుగుతాడు. అప్పుడే కలిసిపోయాం. తను నా డబ్బు చూసి ప్రేమించొచ్చు కానీ తర్వాత ఒకరినొకరం క్షమించుకున్నాం. నేను పెళ్లి పీటల మీద నుంచి రావడాన్ని తను చాలా అర్థం చేసుకుంది. అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా అదృష్టం అని సందీప్ అంటాడు.

భార్యాభర్తలను విడగొట్టడం అప్పటి నుంచే అలవాటా అని కావ్య అంటే రాజ్ కోపంగా కావ్యపైకి వెళ్తాడు. ఒక్కసారి పడిన బ్రహ్మముడిని దేవుడు కూడా విడగొట్టలేడు. అర్థం చేసుకునే భార్య దొరికితే చాలు. అర్థం చేసుకునే భార్య దొరికిన మారకపోతే వాడంతా మూర్ఖుడు ఉండడు అని సందీప్ అంటాడు. దాంతో అబ్బబ్బ ఏం చెప్పావ్ సందీప్. ఇలా అందరూ అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో అని శ్వేత అంటుంది. మిగతా ఫ్రెండ్స్‌తో రాజ్ మాట్లాడుతుంటే.. కావ్య శ్వేత పక్కకు వెళ్లి వెన్నెల గురించి మాట్లాడుకుంటారు.

పరిష్కారం దొరకాల్సిందే

వీళ్లలో వెన్నెల లేదా.. అంటే రాలేదా అని కావ్య అంటుంది. లేదు. కానీ, ఆన్ ద వేలో ఉంది. నేను వెన్నెల నెంబర్ కనుక్కోడానికి చాలా ట్రై చేశాను. రాజ్‌లాగే ముందు రానని అంది. కానీ ఏదోలా చేసి రప్పిస్తున్నాను అని శ్వేత అంటుంది. తర్వాత వెన్నెలకు కాల్ చేసి ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కుంటుంది శ్వేత. ఈరోజు నా సమస్యకు, బాబు సమస్యకు పరిష్కారం దొరకాల్సిందే అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కనకం ఇంటికి గజలక్ష్మీ వస్తుంది.

అప్పు కోసం సంబంధం తీసుకొస్తుంది. నాలుగు టిఫిన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి అబ్బాయి ఫొటో చూపిస్తుంది గజలక్ష్మీ. ఫొటో చూసి అబ్బాయికి వయసు ఎక్కువున్నట్లు ఉంది అని కృష్ణమూర్తి అంటాడు. ఎంత నాలుగు పదులే. కానీ, రెండు చేతులా సంపాదిస్తాడు. కాకపోతే మొదటి భార్య చనిపోయింది. ఓ బాబు ఉన్నాడు అని ఆమె అంటే కనకం ఫైర్ అవుతుంది. మనకు కావాల్సింది డబ్బే కదా అని గజలక్ష్మీ అంటే.. అలా అని నీకు చెప్పానా అని కనకం అంటుంది.

పోయిందట కదా

చూస్తే తెలుస్తుంది కదా. మొదటి కూతురు కడుపు తెచ్చుకుని పెళ్లి చేసుకుంది. రెండో కూతురు ఇష్టం లేకున్న డబ్బు కోసం ఉంటుంది. ఇప్పుడు ఇంకో బాబును కూడా తెచ్చాడట కదా. దాంతో పోలిస్తే నేను తెచ్చిన సంబంధం చాలా మంచిది అని గజలక్ష్మీ అంటుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్తే నీ ఒంటికి మంచిది. నేను ఏదోటి సాధిస్తా అని అప్పు అంటుంది. వెళ్లావ్ కదా పోలీస్ అవుదామని. పోయిందట కదా. వీధంతా అనుకుంటున్నారు అని గజలక్ష్మీ అంటుంది.

పప్పు కోసం వచ్చి పచ్చడి అయిందని అదే వీధంతా మాట్లాడుకుంటారని అప్పు అంటుంది. చూస్తాను ఏం సాధిస్తావో అని గజలక్ష్మీ ఇసురుకుంటూ వెళ్లిపోతుంది. వీధంతా అలా మాట్లాడుకుంటే ఎలా అని కనకం అంటే.. ఏం కాదు. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. నువ్ కంగారుపడకు అని వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు పార్టీలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. తనకు నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి రెండు రాజ్ అని చెబుతుంది శ్వేత.

కావ్య గురించి గొప్పగా

తర్వాత రాజ్ వైపు బాటిల్ వస్తే.. ట్రూత్ అంటాడు. నీ భార్యపై ఎంత ప్రేమ ఉందో చెప్పాలి అని శ్వేత అంటుంది. కావ్య గురించి చెప్పాలంటే ఒక కావ్యమే రాయాలి. ఒకరి భార్య తన భర్త తల్లికి కాల్ చేసి వంటలు బాగా లేవని చెప్పమంది. మరోకరి భార్య మూడేళ్లుగా అణుచుకున్న కోపం చూపించింది. కానీ, నా భార్య మా అమ్మకు ఎదురుచెప్పదు. ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తుంది. నా మీద కోపం వచ్చిన ఒక్కపూట కూడా ఉండదు. నా కళ్లల్లో కష్టాన్ని గమనిస్తుంది అని రాజ్ చెబుతాడు.

తనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే కోల్పోయిన వాటి గురించి ఆలోచించదు. వాటి నుంచి కోలుకోవడం ఎలాగో అది ఆలోచిస్తుంది అని కావ్య గురించి చాలా గొప్పగా చెబుతాడు రాజ్. దాంతో కావ్య ఆశ్చర్యపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

భయపడిపోయిన రాజ్

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో వెన్నెల వస్తుందని రాజ్‌తో చెబుతుంది శ్వేత. దాంతో రాజ్ షాక్ అవుతాడు. వెన్నెల వస్తుందా అని కావ్య అంటే.. నీకు తెలుసా అని శ్వేత అడుగుతుంది. నాకో వెన్నెల తెలుసు. ఆమె ఈమె ఒకరేనా అనేది ఈయనే చెప్పాలి అని కావ్య అంటుంది. వెన్నెల వస్తే ఇప్పుడు నిజం తెలిసిపోతుంది అని రాజ్ భయపడిపోతాడు. ఇంతలో వెన్నెల వస్తుంది. వెన్నెలను చూసి కావ్య షాక్ అవుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం