Brahmamudi November 18th Episode: కావ్యకు రాజ్ కాంప్లిమెంట్ - ధాన్యలక్ష్మి సొంత కుంపటి - రుద్రాణి కుట్రలకు చెక్
18 November 2024, 7:47 IST
Brahmamudi November 18th Episode: బ్రహ్మముడి నవంబర్ 18 ఎపిసోడ్‌లో కావ్య డిజైన్స్ వేస్తోన్న సమయంలో పదే పదే రాజ్ గుర్తొచ్చి డిస్ట్రబ్ అవుతుంది. మరోవైపు రాజ్ కూడా కావ్యనే తలచుకుంటూ డిజైన్స్‌వేయలేకపోతాడు. పందెం విషయంలో రాజ్ టీమ్‌తో పాటుఅంతరాత్మ కూడా అతడికి వ్యతిరేకంగా మారుతుంది.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్
Brahmamudi November 18th Episode: కావ్య డిజైన్స్ వేస్తుంటుంది. కానీ పదే పదే రాజ్ ఆఫీస్‌లో తన నడుముపై చేయివేసిన సీన్ గుర్తొస్తుంటుంది. రాజ్ తనను చాలా డిస్ట్రబ్ చేశాడని భర్తను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది. ఏం జరిగిన డిస్ట్రబ్ కాకూడదని, డిజైన్స్ తప్ప వేరే ధ్యాస ఉండకూడదని నిశ్చయించుకుంటుంది.
భర్తకు వార్నింగ్...
కృష్ణమూర్తి టేప్ రికార్డ్ రిపేర్ చేస్తూ చిన్న చప్పుడు చేస్తాడు. కావ్య కోట్ల రూపాయల డిజైన్స్ వేస్తుందని, ఆమెను డిస్ట్రబ్ చేస్తే బాగుండదని భర్తపై ఫైర్ అవుతుంది. డిజైన్స్ వేయడం అంటే మట్టి కుండల మీద రంగులు వేయడం కాదని ఎగతాళిగా మాట్లాడుతుంది కనకం.
కావ్య పందెంలో గెలిచే వరకు ఇంట్లో గుండుసూది సౌండ్ కూడా వినపడకూడదని కృష్ణమూర్తికి వార్నింగ్ ఇస్తుంది. ఊపిరి అయినా తీసుకోవచ్చా అని కనకాన్ని కృష్ణమూర్తి అడుగుతాడు. అది నీ సౌకర్యం అని పంచ్‌లు వేస్తుంది.
కనకం యాక్టింగ్...
కావ్య కోసం ఆమె రూమ్‌లోకి భోజనం తీసుకొస్తుంది కనకం. నేను కూడా మీతోనే భోజనం చేసేదానిని కదా అని కావ్య అంటుంది. మాతో భోజనం చేస్తే ముచ్చట్లు ఎక్కువైపోతాయని , ఇప్పుడు నీకు పని మీద ధ్యాస తప్ప వేరే ఆలోచన రాకూడదని కనకం అంటుంది. నన్ను వీలైనంత త్వరగా అత్తారింటికి గెంటేయాలని చూస్తున్నట్లుగా ఉందని కనకంతో అంటుంది కావ్య.
కూతురి మాటలతో హార్ట్ అయినట్లుగా నాటకం మొదలుపెడుతుంది కనకం. తల్లిని అర్థం చేసుకుంది ఇంతేనా అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టబోతుంది. అమ్మ మహాతల్లి నీ ఓవరాక్టింగ్ ఆపేయ్ అని కావ్య అంటుంది. నేను నటించడం మొదటుపెట్టగానే కావ్య గుర్తుపట్టేస్తుంది...యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని కనకం అనుకుంటుంది.
అంతరాత్మ ఎటాక్...
తన టీమ్ వేసిన డిజైన్స్ చూసి రాజ్ కోపం అణచుకోలేకపోతాడు. అన్ని మెహందీ డిజైన్స్‌లా ఉన్నాయని అనుకుంటాడు. డిజైన్స్ వేయాలని ఆలోచిస్తుంటే కావ్య పదే పదే గుర్తొస్తుంది. దాంతో రాజ్ డిస్ట్రబ్ అవుతాడు. అంతరాత్మ ఎంట్రీ ఇచ్చి రాజ్‌ను ఫ్లవర్ వాజ్‌తో కొట్టబోతుంది. కనీసం కావ్యను ఇమాజినేషన్‌లోకి రానివ్వవా అంటూ రాజ్‌పై అంతరాత్మ చిర్రుబుర్రులాడుతుంది.
ఈగో అడ్డు...
కావ్యపై ప్రేమ ఉన్నా పైకి చెప్పుకోవడానికి ఈగో అడ్డుస్తుందని అంతరాత్మ అంటుంది. అంతలేదు రాజ్ బదులిస్తాడు. తాను అబద్దాలు ఆడనని, కావ్య విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదని అంటాడు.
పంతం వీడి మారమని రాజ్‌తో అంటుంది అంతరాత్మ. మారనని ఖరాఖండిగా రాజ్ చెబుతాడు. మారే వరకు నిన్ను ప్రేతాత్మలా వెంటాడుతానని రాజ్‌ను హెచ్చరిస్తుంది అంతరాత్మ. నిన్ను ఓడించే వరకు నిద్రపోనని వార్నింగ్ అంటుంది. నేను ఓడితే కళావతి గెలుస్తుందని రాజ్ కంగారుగా అంటాడు. అప్పుడు నువ్వే చచ్చినట్లు కళావతిని ఇంటికి తీసుకొస్తావని, అప్పుడు భూత్‌బంగ్లాకు వెళ్లాల్సిన పనిలేదని అంతరాత్మ రాజ్‌తో అంటుంది. అవన్నీ ఎప్పటికి జరగవని చెప్పి అంతరాత్మను బలవంతంగా పంపించేస్తాడు రాజ్.
అపర్ణ ఓదార్పు...
ధాన్యలక్ష్మి కన్నీళ్ల పెట్టుకోవడం చూసి ఆమెను అపర్ణ ఓదార్చుతుంది. తోడపుట్టకపోయినా నువ్వు నా చెల్లెలివేనని, భోజనం చేయకుండా ఉంటే బాధగా ఉందని ధాన్యలక్ష్మితో అంటుంది అపర్ణ. నీ బాధతో నా కష్టం తీరదని ధాన్యలక్ష్మి అంటుంది. కొన్నాళ్లు ఆగితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అపర్ణ ఎంత చెప్పిన ధాన్యలక్ష్మి వినదు.
రాజ్, కావ్య ఒక్కటైతే తప్పకుండా కళ్యాణ్‌ను ఇంటికితీసుకొస్తారని సర్ధి చెబుతుంది. కళ్యాణ్ కష్టపడుతుంటే మేము చూడలేకపోతున్నామని తప్పకుండా అతడికి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని అంటుంది.
రుద్రాణి ఫిట్టింగ్...
అపర్ణ మాటలను రుద్రాణి వింటుంది. ధాన్యలక్ష్మి మనసు మార్చేస్తే తన ప్లాన్ ఫలించదని అనుకుంటుంది. అపర్ణ వెళ్లిపోగానే ధాన్యలక్ష్మి దగ్గరకు వస్తుంది రుద్రాణి.
రాజ్, కావ్య సంతోషంగా ఉన్నారని, కానీ కళ్యాణ్ కష్టాలు పడుతుంటే అతడిని గాలికి వదిలేశారని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. అవసరం లేకపోయినా రాజ్, కావ్యలకు సేవలు చేస్తున్నారని అంటుంది. కళ్యాణ్ గురించి నువ్వు కూడా ఆలోచించడం మానేస్తే అతడు జీవితాంతం ఆటో నడుపుకోవాల్సిందేనని చెబుతుంది.
రాజ్ టార్చర్...
డిజైన్స్ వేయమని ఎంప్లాయ్‌ని పిలిచి కళ్లు మూసుకొని ఆలోచిస్తుంటాడు. రెండు గంటల నుంచి నన్ను బోర్డ్ ముందు నిలబెట్టి మీరు పడుకున్నారా సార్ అని రాజ్‌ను భయంభయంగా అడుగుతాడు మూర్తి. ఎందుకు భయపడుతున్నావు...నాతో క్లోజ్‌గా ఉండమని మూర్తితో రాజ్ అంటాడు. మీతో క్లోజ్‌గా ఉంటే పులితో పులిహోర తిన్నట్లే ఉంటుందని మూర్తి సెటైర్‌వేస్తాడు. ఆ తర్వాత తనకు వచ్చిన డిజైన్ ఐడియాను మూర్తికి చకచకా చెబుతాడు. రాజ్ స్పీడును అందుకోలేక మూర్తి ఇబ్బంది పడతాడు. రాజ్ ఏం చెబుతున్నాడో అర్థం కాక మూర్తి తలపట్టుకుంటాడు.
కావ్యనే గెలుస్తుంది...
డిజైన్ పూర్తయిన తర్వాత తాను చెప్పినట్లుగా రాలేదని మూర్తిపై రాజ్ ఫైర్ అవుతాడు. మూర్తి మరో డిజైన్ వేస్తాడు. అది కూడా తనకు నచ్చలేదని రాజ్ అంటాడు. రాజ్ టార్చర్ భరించలేకపోతాడు మూర్తి.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్య వేసే డిజైన్స్, కలర్ కాంబినేషన్‌తో మన మ్యాచ్ చేయడం కష్టమేనని రాజ్ తో అంటాడు. మూర్తి మాటలతో రాజ్ కోపం పట్టలేకపోతాడు. నోర్ముయ్ అంటూ అరుస్తాడు. పనిచేయడం చేతకాక పక్కవాళ్లను పొగడొద్దని అంటాడు.నేనే డిజైన్స్ వేసుకుంటాను...నీ అవసరం లేదంటూ మూర్తిని పంపించేస్తాడు.
కావ్యపై రాజ్ కాంప్లిమెంట్...
ఆ తర్వాత మూర్తి వేసిన డిజైన్‌ను చూస్తాడు. చాలా వరస్ట్‌గా ఉందని అనుకుంటాడు. డిజైన్స్ విషయంలో కళావతికి టాలెంట్ ఉందని, ఒప్పుకొని తీరాలని అనుకుంటాడు. కావ్య ఎంత గొప్పగా డిజైన్స్ వేసినా నా అంత గొప్పగా కంపెనీని నడిపించలేదని తన మనసుకు తానే సర్ధిచెప్పుకుంటాడు. కావ్య డిజైన్స్‌ను దొంగతనం చేసి...మన డిజైన్స్‌లా క్లయింట్స్‌కు చూపించాడని, అప్పుడే పందెంలో గెలిచి సీఈవో కావచ్చునని అనుకుంటాడు.
సొంతంగా వంట....
ధాన్యలక్ష్మి వంట చేస్తుంటుంది. అందరి కోసం వండానని వంట మనిషి వచ్చి అంటుంది. అందరి కోసం వండినవి నాకు నచ్చవని అంటుంది. మీకు ఏం కావాలో చెబితే నేను చేసిపెడతానని పని మనిషి అంటుంది. నాకు ఏం కావాలో ఈ ఇంట్లో వాళ్లు ఇవ్వలేకపోయారు నువ్వేం ఇస్తావు...ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూపని మనిషిపై కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. పని మనిషి వంట చేసిన తర్వాత నువ్వెందుకు వండుకుంటున్నావని ధాన్యలక్ష్మిని ఇందిరాదేవి అడుగుతుంది.
వేరు కాపురం పెట్టలేదు...
మీ ఇష్టాలు, నా ఇష్టాలు ఒక్కటి కాదని తెలిసిన తర్వాత కలిసి ఒక్క నిర్ణయం తీసుకోలేనప్పుడు...కలిసి ఒక్క వంట ఎలా తింటాం అని ధాన్యలక్ష్మి అంటుంది. అందుకొని వేరే కుంపటి పెడతావా అని అపర్ణ నిలదీస్తుంది. వేరు కాపురం పెట్టలేదు సంతోషించు అని ధాన్యలక్ష్మి వెటకారంగా అంటుంది. నా కొడుకుకు న్యాయం జరిగే వరకు ఇలాగే ఉంటానని అంటుంది. నా కొడుకుకు అన్యాయం జరిగితే ఇళ్లు వదిలేసి వెళ్లిపోతానని అంటుంది. ఇదంతా రుద్రాణి ఎత్తుఅని, ఆమె నోరు మూయిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు.
కావ్య టెన్షన్...
ఆఫీస్ నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత కావ్య వేసిన డిజైన్స్‌ను కొట్టేయాలని రాజ్ ప్లాన్ వేస్తాడు. తాను రెండు రోజులు కష్టపడి వేసిన డిజైన్స్ క్లయింట్స్‌కు నచ్చాతాయో లేదోనని కావ్య కంగారుపడుతుంది. తప్పకుండా నచ్చుతాయని శృతి అంటుంది. కావ్య క్యాబిన్ నుంచి వెళ్లిపోగానే డిజైన్స్ కొట్టేయడానికి రాజ్ లోపలికి వస్తాడు. మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి కావ్య వెనక్కి వస్తుంది. ఆమెను చూడగానే కంగారు పడిన రాజ్ టేబుల్ కింద దాక్కుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.