Brahmamudi August 16th Episode: కావ్యపై పొగడ్తలు కురిపించిన దుగ్గిరాల ఫ్యామిలీ పెద్దలు - రాజ్ అంతరాత్మ తిప్పలు
Brahmamudi August 16th Episode కావ్యను పుట్టింటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యతను రాజ్‌కు అప్పగిస్తాడు సీతారామయ్య. కావ్యకు సపోర్ట్‌గా సీతారామయ్యతో పాటు సుభాష్ కూడా నిలవడంతో అపర్ణకు మింగుడుపడదు.ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Brahmamudi August 16th Episode కావ్య పుట్టింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు రాజ్ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. కావ్య కిందపడేలా ఫ్లోర్‌పై ఆయిల్ పోస్తాడు రాజ్. అతడు వేసిన ప్లాన్‌ను కావ్య కనిపెడుతుంది. అతడు ఫ్లోర్‌ఫై ఆయిల్ పోస్తుండగా వీడియో తీస్తుంది. ఆ వీడియోను సీతారామమ్యకు చూపిస్తానని రాజ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది.ఆ వీడియో తాతయ్యకు చూపించకూడదంటే ఏం చేయాలని రాజ్ కాళ్లబేరానికి వస్తాడు. అవసరం వచ్చినపుడు ఏం చేయాలో చెబుతానని కావ్య అంటుంది. అంతరాత్మ మాటలు విని తప్పు చేశానని రాజ్ ఫీలవుతాడు.
కళ్యాణ్ ప్రేమ కష్టాలు...
అజ్ఞాత ప్రేమికురాలి గురించి వెతుకుతూ సైకాలజిస్ట్ దగ్గరకు వెళతాడు కళ్యాణ్. కళ్యాణ్‌ను సైకలాజిస్ట్ పిచ్చివాడిలా ట్రీట్ చేస్తాడు. ట్రీట్‌మెంట్ ఇవ్వబోతాడు. చివరకు తనను ఏడిపించడానికే అజ్ఞాత ప్రేమికురాలు ఈ పనిచేసిందని కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు. కళ్యాణ్ తిప్పులు చూసి అప్పు నవ్వుకుంటుంది.
సీతారామయ్య పొగడ్తలు...
కావ్య ఫోన్ పట్టుకొని సీతారామయ్య దగ్గరకు వెళుతుండటంతో రాజ్ కంగారుగా ఆమె వెంట కిందకు దిగుతాడు. నా వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత నిర్ణయాన్ని సమర్థించి నాకు ఉనికి ఉందని అందరికి అర్థమయ్యేలా చేశారని సీతారామయ్య, ఇందిరాదేవిపై ప్రశంసలు కురిపిస్తుంది కావ్య.
నా సంతోషానికి కారణం మీరే అంటూ వారి కాళ్లపై పడిపోతుంది. వారి ఆశీర్వాదం తీసుకుంటుంది. నీ లాంటి కూతురు నాకు లేదని వెలితి ఎప్పుడు కనిపిస్తుందని, నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు అని కావ్యను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి. నువ్వు నోరు తెరిచి పుట్టింటికి అవసరం అని అడిగితే నేనే ఆ డబ్బు ఇచ్చేవాడనని, కానీ ఎవరి దగ్గర చేయి చాచకుండా నీ కష్టాన్ని నమ్ముకున్నావని సీతారామయ్య కూడా కావ్యను ప్రశంసిస్తాడు.నువ్వు అనుకున్నది సాధిస్తావని అంటాడు.
అపర్ణ సెటైర్స్...
కావ్య ఆటో బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోండగా..రాజ్ కారులో దింపేస్తాడని ఆటో ఎందుకని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి మాటలు విని అపర్ణ ఫైర్ అవుతుంది. మీ ముందే ఆటో బుక్ చేస్తున్నట్లు నటిస్తూ తన అవసరాన్ని చెప్పకనే చెప్పిందని, ఇన్ని తెలివితేటలు తమ ఇంట్లో ఎవరికి లేవని, ఈ నైపుణ్యాలు అన్ని కావ్యకు తల్లి కనకం నుంచే వచ్చాయని మాటలతో అవమానిస్తుంది.
బయట నుంచే ఆటో బుక్ చేసుకుంటానని, ఎవరూ తనను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదని కావ్య వెళ్లబోతుంది. కానీ సుభాష్ ఆమెను వారిస్తాడు. ఇంటి కోడలిగా నీకు సర్వాధికారాలు ఉన్నాయని అంటాడు. కావ్యను పుట్టింటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యతను సీతారామయ్య, సుభాష్ కలిసి రాజ్‌కు అప్పగిస్తారు.
రాజ్ భయం...
తల్లికి భయపడి రాజ్ కదలకుండా ఉంటాడు. మీ అమ్మ స్టాంప్ వేసి సైన్ చేస్తే తప్ప నీ కారు కదలదా అని కొడుకుతో అంటాడు సుభాష్. యుద్ధానికి సిద్ధమైన నీ భార్య నుదిట నేను వీరతిలకం దిద్దుతాను. నువ్వుసారథిగా మారిపో అంటూ రాజ్‌పైసెటైర్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ. తమ ప్లాన్ రివర్స్ కావడంతో రుద్రాణి, రాహుల్‌లకు మింగుడుపడదు. సంతోషంగా పుట్టింటికి వెళుతున్న కావ్యను పర్మినెంట్‌గా అక్కడే ఉండేలా కొత్త పథకం రచించాలని అనుకుంటారు.
అంతరాత్మతో గొడవ...
కావ్యను పుట్టింటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళుతుంటాడు రాజ్. అతడు చాలా సీరియస్‌గా డ్రైవింగ్ చేస్తుండటంతో రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది కావ్య. తనకు ఎప్పుడో ఒకరోజు అవకాశం దొరుకుతుందని, అప్పుడు నేనంటే ఏమిటో చూపిస్తానని అంటాడు రాజ్. అత్యాశే ఎక్కువైతే ఇలాగే నిరాశే మిగులుతుందని కావ్య అంటుంది. అప్పుడే రాజ్ అంతరాత్మ మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. అందమైన పెళ్లాన్ని పక్కన పెట్టుకొని ముద్దు ముచ్చట లేదని రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది అంతరాత్మ. రాజ్ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియక కావ్య కంగారు పడుతుంది.
రాజ్ వార్నింగ్….
రాజ్ అంతరాత్మ కావ్యపై చేయివేయబోతుంది. అంతరాత్మకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. చేయి వేశావంటే చంపుతా అంటాడు. రసహీనుడా...నీలో కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదని రాజ్‌ను ఈసడించుకుంటాడు అంతరాత్మ. కావ్య కళ్లు ఆకాశం అంత అందంగా, సముద్రమంత లోతుగా ఉన్నాయని, పెదాలు గులాబి రేకుల్లా మెరిసిపోతున్నాయని కావ్య అందాన్ని పొగుడుతాడు అంతరాత్మ. ఒక్కసారి నా కళ్లతో ఆ బుగ్గల్ని చూడరా అంటూ కావ్యను తెగ పొగుడుతాడు అంతరాత్మ. అంతరాత్మ మాటలతో రాజ్ కోపం పెరుగుతంది. అతడిని కొట్టబోతాడు రాజ్. కానీ ఆ దెబ్బ కావ్య చెంపపై తగులుతుంది. కావ్యకు ఏం జరుగుతుందో, తనను ఎందుకు కొట్టారో అంతుపట్టదు. తనను ఎందుకు కొట్టారో చెప్పమని అంటాడు.
స్వప్న టెన్షన్...
తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ చేసుకుంటుంది స్వప్న. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోవడంతో కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి రాహుల్ వస్తాడు. తన నాటకం బయటపడకుండా రాహుల్‌పై కోపగించుకుంటుంది. భార్య భాదల్ని చెప్పుకుంటేనే తెలుసుకుంటావా? రాజ్ అలాగే చేస్తున్నాడా? అంటూ రాహుల్‌ను నిలదీస్తుంది స్వప్న. పదే పదే తనను రాజ్‌తో పోలుస్తుండటం రాహుల్ సీరియస్ అవుతాడు. నిన్ను పెళ్లిచేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్లకు నా మీద ఉన్న విలువ పోయిందని, నిన్ను కలిసిన తర్వాతే తన జీవితం మొత్తం తలక్రిందులైపోయిందని, నీ ప్రెగ్నెన్సీ వల్లే ఈ కష్టాలు వచ్చాయని స్వప్నపై సీరియస్ అవుతాడు.
అపర్ణ షాక్…
కాంట్రాక్ట్ పోవడంతో ఇంటిని అమ్మడానికి కనకం, కృష్ణమూర్తి బయలుదేరుతారు. అప్పుడే రాజ్, కావ్య అక్కడికి వస్తారు. రాజ్ కోసం కావ్య ఉప్మా తయారుచేస్తుంది. ఆ ఉప్మా తినకుండా పారిపోవడానికి ప్రయత్నించిన రాజ్ పొరపాటుగా బొమ్మల కోసం సిద్ధంచేసిన మట్టిలో అడుగుపెడతాడు.ఆ తర్వాత ఆ మట్టిని కావ్య, రాజ్ ఇద్దరు కలిసి తొక్కుతారు.ఆ వీడియోను షూట్ చేసిన రుద్రాణి...అపర్ణకు చూపిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.