Sobhita Dhulipala Dance: అల్లు అర్జున్ పాటకి శోభిత ధూళిపాళ్ల డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో
Sobhita Dhulipala Wedding: నాగచైతన్యతో పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ్ల సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిపోతోందనే సంతోషంలో అల్లు అర్జున్ మాస్ సాంగ్‌కి శోభిత డ్యాన్స్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌కి శోభిత ధూళిపాళ్ల డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబరు 4న అక్కినేని నాగచైతన్యతో మూడు ముళ్లు వేయించుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ్ల.. పెళ్లికి ముందు సరదాగా డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. అయితే.. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.
రెండేళ్లు డేటింగ్
అక్కినేని నాగచైతన్యతో రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న శోభిత ధూళిపాళ్ల.. పెద్దల్ని ఒప్పించి వారి సమక్షంలోనే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ప్రముఖులు విచ్చేసి..వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లి కూతురిగా డ్యాన్స్
పెళ్లికి కొన్ని నిమిషాల ముందు పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత శోభిత ధూళిపాళ్ల ఈ డ్యాన్స్ చేసినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ‘శ్రద్దా, మేరీ షాదీ హో రహీ హై! (నేను పెళ్లి చేసుకోబోతున్నాను)’ అంటూ శోభితా ఉత్సాహంగా పాటలకి డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలోని బ్లాక్ బాస్టర్ సాంగ్‌కి శోభిత డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
హాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసిన శోభిత ధూళిపాళ్ల.. ఆఖరిగా లవ్ - సితార అనే వెబ్ సినిమాలో నటించింది. మరోవైపు అక్కినేని నాగచైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి తాండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి థియేటర్లలోకి రానుంది.