Brahmamudi June 17th Episode: బ్రహ్మముడి - కావ్యను కోడలిగా ఒప్పుకున్న అపర్ణ - కూతురి విజయానికి పొంగిపోయిన కనకం
17 June 2024, 7:35 IST
Brahmamudi June 17th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యతో పాటు ఆమె తల్లిదండ్రులపై అపర్ణ చూపిస్తోన్న ప్రేమ, ఇస్తోన్న గౌరవం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది. అపర్ణ మనసులో కావ్య పట్ల ఉన్న ప్రేమను చంపేయాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi June 17th Episode: అపర్ణ ఆరోగ్యం బాగుపడాలని ఇంట్టో పూజ ఏర్పాట్లు చేస్తాడు సుభాష్. కానీ పూజలో భర్త సుభాష్‌తో పాటు కూర్చోవడానికి అపర్ణ ఒప్పుకోదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లిన మనిషి నా కోసం పూజలో కూర్చోవడం ఏంటి? తాను చనిపోయిన పర్వాలేదు. పూజను మాత్రం ఆపాల్సిందేనని పట్టుపడుతుంది అపర్ణ.
పూజ ఆపితే అశుభం అని అపర్ణకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నిస్తుంది ఇందిరాదేవి. కానీ అపర్ణ మాత్రం పట్టువీడదు. విలువలు లేని మనిషి చేసే పూజ భగవంతుడికి చేరదు. నాకు శుభం జరగదని చెప్పి సుభాష్‌ను పూజ నుంచి లేవమని గొడవ చేస్తుంది. పూజ పూర్తి చేసి లేస్తానని సుభాష్ అంటాడు. నేను చనిపోయిన పర్వాలేదు కానీ సుభాష్‌తో మాత్రం పూజలో కూర్చోనని...ఇక్కడి నుంచి వెళ్లొపొమ్మని అని వార్నింగ్ ఇస్తుంది.
రుద్రాణి జోక్యం...
ఈ ఒక్కసారి నా మాట విని పూజలో కూర్చోమంటూ అపర్ణను బతిమిలాడుతాడు రాజ్. మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. అపర్ణ ఆరోగ్యం బాగాలేదని, ఆమెకు నచ్చని పని ఎవరూ చేయద్దని నువ్వే అన్నావు. ఇప్పుడే నువ్వే నీ మాట వినమంటే ఎలా అని సుభాష్‌పై అపర్ణకు ఉన్న కోపాన్ని మరింత పెంచుతుంది.
ఇంత ద్రోహం చేసిన తర్వాత ఏ భార్య...భర్తను క్షమిస్తుందని అంటుంది. రుద్రాణిపై ప్రకాశం ఫైర్ అవుతాడు. నువ్వు ఆపుతావా...మధ్యలో ఆజ్యం ఉందుక పోస్తావు...ఈ టైమ్‌లో జరిగిన దానిని గుర్తుచేయడం అవసరమా అని క్లాస్ ఇస్తాడు. తల్లికి రాహుల్ సపోర్ట్‌చేస్తాడు. మీ మమ్మీకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అని రాహుల్, రుద్రాణిపై స్వప్న ఫైర్ అవుతుంది.
పూజ నుంచి వెళ్లిపోయిన సుభాష్...
ధాన్యలక్ష్మి, సీతారామయ్య ఎవరూ ఎంత చెప్పిన అపర్ణ మాత్రం వెనక్కి తగ్గదు. అపర్ణ మొండితనం చూసి పూజ ఆపేద్దామని సీతారామయ్య అంటాడు. కానీ ఇందిరాదేవి మాత్రం పూజ ఆగేది లేదని అంటుంది. పంతానికి పోతే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని అపర్ణ చెబుతుంది. దాంతో సుభాష్ పూజ నుంచి లేచి వెళ్లిపోతాడు.
పూజలో కావ్య, రాజ్...
తమ బదులు పూజలో రాజ్, కావ్య కూర్చుంటారని పంతులో చెబుతుంది అపర్ణ. ఈ రోజు నుంచి తాను, సుభాష్ కలిసి చేసే ఏ పూజలో అయినా తన కొడుకు, కోడలు కూర్చుంటారని అంటుంది. పూజలో కూర్చోవడానికి కావ్య సందేహిస్తుంది. నీకు బొట్టు పెట్టి చెప్పాలా...వచ్చి నా కొడుకుతో పాటు పూజలో కూర్చో అంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. ఇంటి కోడలికి ఇవ్వాల్సిన నగలను కావ్యకు అందజేస్తుంది.
అనామిక తల్లిదండ్రుల ప్లాన్...
కావ్యపై అపర్ణ చూపిస్తోన్న ప్రేమను అనామిక తల్లిదండ్రులు సహించలేకపోతారు. ఒకప్పుడు కావ్యను శత్రువులా చూసేది...ఇప్పుడు మనల్ని పక్కనపెట్టి కనకం ఫ్యామిలీకి విలువ ఇస్తోందని అనామికకు చెబుతారు. కావ్య తన అత్తగారి మనసు గెలుచుకుందని, పైకి కోపం నటిస్తోన్న లోపల మాత్రం కోడలిపై అంతులేని ప్రేమను చూపిస్తోందని అనామిక తండ్రి కూతురితో చెబుతాడు.
కళ్యాణ్‌ను దారిలోకి తెచ్చుకో...
నువ్వు మాత్రం ఈ ఇంటికి వచ్చినప్పుటి నుంచి గొడవల తప్ప సాధించింది ఏం లేదని, అరిచి గోల పెట్టకుండా లాలించి, బుజ్జగించి కళ్యాణ్‌ను దారిలోకి తెచ్చికొమ్మని కూతురికి సలహా ఇస్తారు. ఏదో ఒకటి చేసి ఆస్తిలో వాటా దక్కించుకొమ్మని తమ ప్లాన్‌ను కూతురికి వివరిస్తారు.
కృష్ణమూర్తి ఆనందం...
కావ్యకు అపర్ణ ఇస్తోన్న విలువ, చూపిస్తోన్న ప్రేమ చూసి కనకం, కృష్ణమూర్తి పొంగిపోతారు. తమను వియ్యంకులుగా అపర్ణ ఒప్పుకున్నట్లు అనిపిస్తోందని కూతురితో చెబుతారు. చావైనా, బతుకైనా అత్తింట్లోనే అనుకున్నాను. దాని ఫలితమే ఇదని తల్లిదండ్రులతో కావ్య అంటుంది.
ఎప్పుడు గుండెబారంతో వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు తృప్తిగా వెళుతున్నాం. స్వప్న కూడా మారిపోయి నీకు అండగా నిలవడం ఆనందంగా కృష్ణమూర్తి సంబరపడతాడు. మావయ్యను మోసం నుంచి బయటపడేసి, అపర్ణ, సుభాష్‌లను కలిపే బాధ్యత తనపై ఉందని కావ్య అంటుంది. మాయ ఆరోగ్యం గురించి తెలుసుకునే బాధ్యతను అప్పుకు అప్పగిస్తుంది కావ్య.
రుద్రాణి కన్నింగ్ ప్లాన్...
కావ్యను మహారాణిలా అపర్ణ చూడటం, కోడలి పుట్టింటి వారికి గౌరవం ఇవ్వడం రుద్రాణి తట్టుకోలేకపోతుంది. కోడలిపై అపర్ణ చూపిస్తోన్న ప్రేమను చంపేయాలని చూస్తుంది. అన్నయ్య చేసిన తప్పును దాచిపెట్టి...తన జీవితాన్ని పణంగా పెట్టబోయిన కావ్య త్యాగాన్ని చూసి అపర్ణ గుండె కరిగిపోయినట్లు ఉందని రుద్రాణి అంటుంది. కావ్య చేసింది మోసం అని నమ్మించి అపర్ణ మనసులో కావ్య పట్ల ద్వేషాన్ని పెంచాలని ఫిక్సవుతుంది.
కావ్య ఆలోచన...
కావ్య సీరియస్‌గా ఏదో ఆలోచిస్తుంటే...మళ్లీ ఏ ఉపద్రవం తీసుకొస్తుందోనని రాజ్ కంగారుపడతాడు. కావ్యపై సెటైర్స్ వేస్తాడు. మన కోసం నిజం చెప్పి మావయ్య చిక్కుల్లో పడ్డాడని, సుభాష్, అపర్ణ మధ్య దూరం బాగా పెరిగిందని భర్తతో బాధపడుతూ చెబుతుంది కావ్య. మావయ్యకు జీవితంపై ఆశపోయిందని, అత్తయ్య ఇలాగే కఠినంగా ఉంటే ఏదో ఒక రోజు ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉందని కావ్య భయపడుతుంది. నాన్నను ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలని రాజ్ అంటాడు. ఎంతకాలం ఆయన్ని గమనించగలమని, బుర్రవాడమని రాజ్‌పై కోప్పడుతుంది కావ్య.
సుభాష్ బాధ...
ఎంతసేపు ఈ కుటుంబం గురించి నేనే ఆలోచించాలా...మీరా ఆలోచించరా అంటూ క్లాస్ ఇస్తుంది.
సుభాష్‌కు ఓదార్చడానికి అతడి రూమ్‌లోకి వస్తారు రాజ్, కావ్య. తమ మాటలతో ఆయన్ని బాధ నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తారు. ఇన్నాళ్లు గౌరవించిన వారందరూ తనను దోషిగా చూస్తున్నారని సుభాష్ బాధపడతాడు. ఈ సమస్యలపై ధైర్యంగా పోరాడమని తండ్రికి సలహా ఇస్తాడు సుభాష్.
అపర్ణ తనను వెలివేసిందని, భర్తగా కాదు కనీసం మనిషిగా కూడా తనను చూడటం లేదని సుభాష్ అంటాడు. తప్పు మానవసహజం. మీరు తప్పును ఒప్పుకున్నారు కాబట్టి తప్పకుండా అమ్మ మిమ్మల్ని క్షమిస్తుందని తండ్రితో అంటాడు రాజ్. నాకు నమ్మకం లేదని సుభాష్ బదులిస్తాడు.
కావ్య సలహా...
అత్తయ్యకు దూరంగా ఉంటే..మీ మధ్య దూరం మరింత పెరుగుతుందని, మీ మనసులోని బాధను ధైర్యంగా చెబితే ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుందని సుభాష్‌తో అంటుంది కావ్య.
రాజ్, కావ్య ప్రోద్బలంతో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోన్న అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడాలని సుభాష్ ప్రయత్నిస్తాడు. మీరు చెప్పేది నిజమా అబద్దామా అని సుభాష్‌ను నిలదీస్తుంది అపర్ణ. నిజమేనని సుభాష్ బదులిస్తాడు. ఇంతకాలం ఓ దారుణమైన నిజాన్ని నా దగ్గర దాచి అబద్ధంలో బతికేలా చేశారని, మీరు చెప్పేది నేను ఏం విననని అపర్ణ అంటుంది.
లోకానికి భయపడి...
చేసిన తప్పు తనను వెంటాడుతుందని, నువ్వు కూడా దూరం పెట్టడం భరించలేకపోతున్నానని అపర్ణతో అంటాడు సుభాష్. నేను చేసిన తప్పుకు నీ కోసమే ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నానని చెబుతాడు. నా కోసం కాదు...తప్పును కప్పి పుచ్చుకోవడానికి లోకానికి భయపడి మీరు ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారని భర్తపై అపర్ణ ఫైర్ అవుతుంది.
మాయ ఎస్కేప్...
మాయ స్పృహలోకి వచ్చిందని అప్పు చెబుతుంది. మాయ నుంచి నిజాలు రాబట్టడానికి కళ్యాణ్, అప్పుతో కలిసి హాస్పిటల్‌కు వెళుతుంది కావ్య. కానీ అక్కడ మాయ కనిపించకపోవడంతో ముగ్గురు షాకవుతారు. రౌడీలు వచ్చి మాయను తీసుకెళతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.