Brahmamudi Promo: త‌ప్పును స‌రిదిద్దుకున్న కావ్య - భ‌ర్త‌ను క్ష‌మించ‌ని అప‌ర్ణ - వ‌సు కోసం రంగా త్యాగం-brahmamudi serial latest promo and guppedantha manasu next episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: త‌ప్పును స‌రిదిద్దుకున్న కావ్య - భ‌ర్త‌ను క్ష‌మించ‌ని అప‌ర్ణ - వ‌సు కోసం రంగా త్యాగం

Brahmamudi Promo: త‌ప్పును స‌రిదిద్దుకున్న కావ్య - భ‌ర్త‌ను క్ష‌మించ‌ని అప‌ర్ణ - వ‌సు కోసం రంగా త్యాగం

Nelki Naresh Kumar HT Telugu
Jun 16, 2024 09:16 AM IST

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో అప‌ర్ణ‌, సుభాష్ మ‌ధ్య గొడ‌వ‌లు త‌గ్గించి ఇద్ద‌రిని తిరిగి ఒక్క‌టి చేయాల‌ని కావ్య ఫిక్స‌వుతుంది. కానీ కావ్య వేసిన ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌ను తండ్రి మ‌హేంద్ర అంటూ వ‌సుధార రాసిన లెటెర్‌తో కొత్తడ్రామా మొద‌లుపెడ‌తాడు శైలేంద్ర‌.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi Promo: మాయ విష‌యంలో కావ్య‌ను అపార్థం చేసుకున్నందుకు ప‌శ్చాత్తాప ప‌డుతుంది అప‌ర్ణ‌. కావ్య‌పై ఓ ప‌క్క ప్రేమ కురిపిస్తూనే మ‌రోవైపు ఆమెను త‌న‌కు ఎదురుప‌డ‌వ‌ద్ద‌ని కోడ‌లికి వార్నింగ్ ఇస్తుంది. తండ్రి సుభాష్ చేసిన త‌ప్పుకు నిన్ను శిక్షించాన‌ని రాజ్‌తో చెబుతూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది అప‌ర్ణ‌. కావ్య‌ను బాగా చూసుకోమ‌ని కొడుకుకు క్లాస్ ఇస్తుంది.

అప‌ర్ణ ఆరోగ్యం కోసం...

అప‌ర్ణ ఆరోగ్యం బాగుప‌డాల‌ని సుభాష్ పూజ చేయాల‌ని అనుకుంటాడు. సుభాష్ ఈ పూజ చేస్తున్నాడ‌ని చెబితే అప‌ర్ణ ఎక్క‌డ ఆపుతుందోన‌ని కావ్య కంగారు ప‌డుతుంది. ఈ పూజ ఏర్పాట్లు తానే చేయించాన‌ని అప‌ర్ణ‌తో చెప్ప‌మ‌ని ఇందిరాదేవిని బ‌ల‌వంతంగా ఒప్పిస్తుంది కావ్య‌.

క‌న‌కం ఫ్యామిలీకి గౌర‌వం…

పూజ కోసం కావ్య త‌ల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి వ‌స్తారు. వారితో ఆనందంగా మాట్లాడుతూ ప్రేమ‌ను కురిపిస్తుంది అప‌ర్ణ‌. క‌న‌కంతో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యుల‌ను పూజ కోసం తానే ర‌మ్మ‌న్నాన‌ని చెబుతుంది అప‌ర్ణ‌. అది చూసి రుద్రాణి షాక‌వుతుంది. గుండెపోటు వ‌చ్చినంత‌గా బాధ‌తో విల‌విల‌లాడిపోతుంది.

అప‌ర్ణ కోపం...

సుభాష్‌తో క‌లిసి పూజ‌లో కూర్చోవ‌డానికి అప‌ర్ణ ఒప్పుకోదు. పూజ‌ను మ‌ధ్య‌లోనే ఆపేయ‌మ‌ని ప‌ట్టుప‌డుతుంది. పాపాలు చేసిన వాళ్లు ఇలాంటి పుణ్య కార్యాలు చేయ‌డానికి అర్హ‌త పోగొట్టుకున్నార‌ని సుభాష్‌ను అన‌రాని మాట‌లు అంటుంది అప‌ర్ణ‌. భార్య మాట‌ల‌ను సుభాష్ స‌హించ‌లేక‌పోతాడు. పూజ‌లో తాను కూర్చోవ‌డం లేద‌ని వెళ్లిపోతాడు. రాజ్‌, కావ్య పిలుస్తున్నా సుభాష్ ప‌ట్టించుకోకుండా పూజ‌కు దూరంగా వెళ్లిపోతాడు.

త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాల్లో కావ్య‌...

అప‌ర్ణ‌, సుభాష్‌ల‌ను విడ‌దీసి తాను చేసిన త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాల్లో కావ్య ప‌డుతుంది. అప‌ర్ణ‌తో ధైర్యంగా మ‌న‌సు విప్పి మాట్లాడ‌మ‌ని మావ‌య్య సుభాష్‌తో చెబుతుంది కావ్య‌. మీ మ‌న‌సులోని బాధ‌నంతా అప‌ర్ణ‌కు అర్థ‌మ‌య్యేలా చెబితే త‌ప్ప‌కుండాఆమె మిమ్మ‌ల్ని క్ష‌మిస్తుంద‌ని సుభాష్‌కు స‌ల‌హా ఇస్తుంది కావ్య‌.

కోడ‌లు చెప్పిన‌ట్లే చేయాల‌ని అనుకుంటాడు. అప‌ర్ణ ఒంట‌రిగా ఉండ‌టం చూసి ఆమెతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. కానీ సుభాష్ చూడ‌టానికి కూడా అప‌ర్ణ ఇష్ట‌ప‌డ‌దు. అత‌డు ద‌గ్గ‌ర‌కు రాగానే ముఖం తిప్పేసుకుంటుంది. సుభాస్ మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించిన నేనేం విన‌ను అని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రొమోలో చూపించారు.

రుద్రాణి స్కెచ్‌...

మాయ స్పృహ‌లోకి వ‌స్తేనే బిడ్డ‌కు సంబంధించిన అన్ని నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని కావ్య అనుకుంటుంది. మాయ స్పృహ‌లోకి వ‌స్తే అప‌ర్ణ‌కు కావ్య మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంద‌ని రుద్రాణి భావిస్తుంది. అప‌ర్ణ మ‌న‌సులో కావ్య ఉన్న ఉన్న ప్రేమ‌ను చంపేయాల‌ని ఫిక్స‌వుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

రిషి కాదు రంగా...

ఆటో డ్రైవ‌ర్ రంగాను రుషిగా పొర‌ప‌డుతుంది వ‌సుధార‌. అత‌డిని కౌగిలించుకుంటుంది. తాను రిషి కాద‌నే నిజం వ‌సుధార‌కు చెబుతాడు రంగా. అత‌డి మాట‌లు విని వ‌సుధార షాక‌వుతుంది. వ‌సుధార‌ను చంపేశామ‌ని శైలేంద్ర‌తో అబ‌ద్ధం చెబుతారు రౌడీలు. వారి మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి శైలేంద్ర సంబ‌ర‌ప‌డ‌తాడు.

మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే...

మ‌రోవైపు వ‌సుధార రాసిన లెట‌ర్ ద్వారా మ‌ను తండ్రి మ‌హేంద్ర అనే నిజం దేవ‌యానికి తెలుస్తుంది. ఆ లెట‌ర్‌ను అడ్డం పెట్టుకొని మ‌ను, మ‌హేంద్ర మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించి వారిని కూడా కాలేజీ నుంచి పంపించేయాల‌ని దేవ‌యాని, శైలేంద్ర స్కెచ్ వేస్తారు. వారు వేసిన ప్లాన్ ఏమిటి? త‌న తండ్రి మ‌హేంద్ర అనే నిజం మ‌నుకు తెలిసిందా? రౌడీల ఎటాక్‌లో గాయ‌ప‌డ్డ వ‌సుధార స్పృహ‌లోకి రాదు. రంగా రిషి కాద‌నే నిజం తెలిసి మ‌రింత షాక్‌కు లోన‌వుతుంది. ఆమె కోలుకోవ‌డానికి రిషిగా యాక్ట్ చేయ‌డానికి రంగా నాటకం ఆడాల్సివస్తుంది. అందుకు రంగా ఒప్పుకున్నాడా? అన్న‌ది గుప్పెడంత మ‌న‌సు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

WhatsApp channel