Brahmamudi June 3rd Episode: కావ్యను నమ్మి మోసపోయిన రాజ్ - కొడుకు రెండో పెళ్లికి అపర్ణ ఏర్పాట్లు - తెగించిన రుద్రాణి
Brahmamudi June 3rd Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో మాయ వాలకం చూసి ఆమె బిడ్డకు తల్లి కాదని ధాన్యలక్ష్మితో పాటు ఇందిరాదేవి అనుమానపడతారు. తాను దొరికిపోకుండా ఉండటానికి తప్పు రాజ్‌పై నెట్టివేస్తుంది మాయ.
Brahmamudi June 3rd Episode: నకిలీ మాయ ఎంట్రీతో కావ్యకు కొత్త కష్టాలు మొదలవుతాయి. ఆమెకు దుగ్గిరాల ఇంట్లో సపోర్ట్ లేకుండా పోతుంది. కావ్యకు కళ్యాణ్ అండగా నిలుస్తాడు. కళ్యాణ్ తీరును అనామిక తప్పుపడుతుంది. కావ్య భజన చేయడం అపమని ఫైర్ అవుతుంది. అప్పును అడ్డం పెట్టుకొని మన మధ్య గొడవలు సృష్టిస్తోంది కావ్యనే అని అనామిక ఆడిపోసుకుంటుంది.
నేనే గనక కావ్య స్థానంలో ఉంటే ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్లిపోయేదానినని...మోసం చేసిన మీ ఇంట్లో వాళ్ల అందరిపై కేసు పెట్టేదానిని అని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. అనామికపై కళ్యాణ్ ఫైర్ అవుతాడు.
బంధం తెంచుకోవడానికి పొగరుతో అనే నాలుగు మాటలు చాలు. అదే బంధం నిలుపుకోవాలంటే ఎంతో సహనం కావాలని అనామికకు క్లాస్ ఇస్తాడు. మా వదినలా ఉండటం కాదు...ఆమెను అర్థం చేసుకోవడం కూడా నీకు కోటి జన్మలు ఎత్తిన సరిపోవు అని అనామికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కళ్యాణ్.
రుద్రాణి ఓదార్పు...
రాజ్ గదిలో తిష్ట వేయాలనే తన ప్లాన్ ఇందిరాదేవి కారణంగా ఫెయిలవ్వడంతో మాయ తట్టుకోలేకపోతుంది.. రాజ్‌ను పెళ్లి చేసుకున్న కావ్యకే అతడి గదిలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆరు నెలలు పట్టిందని అంటుంది. ఆరు రోజుల్లోనే అది సాధ్యం కావాలంటే ఎలా అని మాయతో అంటుంది రుద్రాణి.
కావ్య పొగరుగా మాట్లాడేసరికి తానేంటో చూపించాలని ఈ ప్లాన్ వేసినట్లు రుద్రాణి తో చెబుతుంది మాయ. తనను ఇంట్లోంచి పంపించాలని కావ్య తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆమెకు ఆ గతి పట్టిస్తానని మాయ ఛాలెంజ్ చేస్తుంది. ఇంట్లో అడుగుపెట్టిన రెండో రోజే రాజ్‌తో నీ పెళ్లికి ఇంట్లో అందరిని ఒప్పించడమే కాకుండా నువ్వే అతడికి అసలైన భార్యవని అనుకునేలా చేశావని, అదే నీ సక్సెస్ అని మాయను పొగుడుతుంది రుద్రాణి.
ఇదంతా మీ ట్రైనింగ్ అంటూ మాయ అంటుంది. ట్రైనింగ్ మరి ఎక్కువైపోయిందని అప్పుడే రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య ఇద్దరిపై సెటైర్ వేస్తుంది.
పెళ్లి జరగదు...
ఏం జరిగినా సరే రాజ్‌తో మాయ పెళ్లి జరగదు. జరగనివ్వనని రుద్రాణితో అంటుంది కావ్య. ఓడిపోతున్నావని తెలిసిన సరే నీ కాన్ఫిడెన్స్ కొంచెం కూడా తగ్గలేదని కావ్యకు సమాధానమిస్తుంది రుద్రాణి. ఓడిపోతున్నానని మీరు అంటున్నారు. కానీ మీరు ఇంట్లో వాళ్లకు దొరికిపోతున్నారని నేను అంటున్నానని కావ్య రిప్లై ఇస్తుంది.
నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచినన్ను దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవని రుద్రాణిపై పంచ్ వేస్తుంది కావ్య. ఈ సారి తానే తెలుస్తానని రుద్రాణి అంటుంది. ఈ గెలుపుతో నిన్ను ఇంట్లో నుంచి పంపించడం ఖాయమని చెబుతుంది.
బాబు బాధ్యత నీదే...
మాయకు బాబును తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. తల్లిగా బాబును చూసుకునే బాధ్యత నీదే అని చెబుతుంది. బాబును చూసుకోవడం నా వల్ల కాదని మాయ చేతులెత్తేస్తుంది. రాత్రంత ఏడుస్తూనే ఉన్నాడని, నిద్ర పోనివ్వలేదని అంటుంది.
నీ వల్ల కాదంటే చెప్పు నేనే బాబు బాగోగుల్ని చూసుకుంటా. కానీ అందరి ముందు నీకు పిల్లాడిని చూసుకోవడం చేతకాలేదని నిరూపించినట్లు అవుతుందని మాయతో అంటుంది కావ్య. ఆమె మాటలతో భయపడిపోయి పిల్లాడిని కావ్య దగ్గర నుంచి తీసుకుంటుంది మాయ.
ముహూర్తం ఫిక్స్...
రాజ్, మాయల పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులును పిలుస్తుంది అపర్ణ. రాజ్, మాయ పెళ్లికి సుభాష్ ఒప్పుకోడు. తానెప్పుడూ కావ్య పక్కనే నిలబడతానని అంటాడు. రాజ్, మాయ పెళ్లిని ఘనంగా చేస్తే ఇంటి పరువు ఇంకేం ఉంటుందని ప్రకాశం అపర్ణతో అంటాడు. ఈ పెళ్లి మన ఇంట్లోనే మన వాళ్ల మధ్యే మూడో కంటికి తెలియకుండా జరుగుతుందని అపర్ణ అంటుంది.
కన్య కాదు..కుమారి కాదు...
కన్య పేరు ఏమిటి అని పంతులు అడుగుతాడు. అది కన్య కాదు...కుమారి కాదు. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదని మాయను ఎగతాళి చేస్తుంది స్వప్న.మాయకు నీ కవి భాషలో ఏ పేరు పెట్టాలో నువ్వే చెప్పు అని కళ్యాణ్‌ను అడుగుతుంది స్వప్న.
చిరంజీవి లక్ష్మి అభాగ్యవతి కుమారి మాత మాయ అని కళ్యాణ్ ఫన్నీగా పిలుస్తాడు. అంటాడు. రాజ్‌కు మాయతో పెళ్లి జరపబోతున్నారని తెలిసి పంతులు ఆశ్చర్యపోతాడు. మరి కావ్య పరిస్థితి ఏమిటని అడుగుతాడు. బిడ్డ తండ్రికి రెండో పెళ్లి చేయడం ఏంటి? అని అడుగుతాడు.
పరువు వీధిన పడకుండా...
పంతులు కన్ఫ్యూజ్ కావడంతో ఇది రాజ్‌కు రెండో పెళ్లి అయినా బిడ్డ తల్లికి ఇదే మొదటిపెళ్లి అని పంతులుతో చెబుతుంది స్వప్న. పరువు వీధిన పడకుండా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నా పెళ్లి ఇదని అంటుంది.
ఈ పెళ్లి గురించి బయట ఎక్కడ చెప్పొద్దని పంతులును రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణ. రెండు రోజుల్లో ముహూర్తం ఉందని పంతులు అంటాడు. ఆ మాట విని మాయ, రుద్రాణి సంబరపడతారు.రెండు రోజుల్లో నకిలీ మాయ బాగోతం ఎలా బయటపెట్టగలమని సుభాష్ టెన్షన్ పడతాడు.
కావ్యకు క్లాస్...
నకిలీ మాయను ఇంటికి తీసుకురావడమే కాకుండా నో అబక్షన్ సర్టిఫికేట్‌పై సంతకం పెట్టిన కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. మాయతో నా పెళ్లి జరిగదని మా నాన్నకు, నాకు మాటిచ్చావు మర్చిపోయావా అని కావ్యను నిలదీస్తాడు. మాటే కదా ఎన్నైనా ఇస్తాం అని కావ్య తేలిగ్గా తీసుకుంటుంది.
ఆమె వాలకం చూసి రాజ్ కంగారు పడతాడు. అంటే ఇప్పుడు మాట మీద నిలబడవా అని భయంగా అడుగుతాడు. నన్ను నిలువునా ముంచేస్తావా అని కంగారు పడతాడు. అసలు తప్పంతా నీదే. పెళ్లి రోజు బిడ్డను తీసుకురాకుండా నిజమైన మాయను నాలుగు ఉతికితే ఈ కష్టాలు ఉండేవి కావని రాజ్‌తో అంటుంది కావ్య.
మాయ మెడలో మూడుముళ్లు వేస్తే...
మీ అమ్మ గారు అన్నట్లు మీ వల్ల నాకు సుఖం లేదు. నా వల్ల మీకు సంతోషం లేదు. మాయ మంచి వయసులో ఉంది. మాయ మెడలో మూడుముళ్లు వేసి మూడు రోజులు అడ్జెస్ట్ అయితే మీ కాపురం సంతోషంగా సాగిపోతుందని రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది కావ్య.
టైమ్ చూసి ఇలా చేతులెత్తేయడం సరికాదని, నా టెన్షన్ చూసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావని కావ్యపై రాజ్ కోప్పడుతాడు.
నిన్ను నమ్ముకుంటే మాయతో నా పెళ్లితో పాటు శోభనం కూడా జరిపించేలా ఉన్నావని రాజ్ చిరాకుగా అంటాడు. నమ్మకపోతే నీ ఇష్టం అని కావ్య వెళ్లిపోతుంది. మాయతో తన పెళ్లి జరగకుండా సాయం చేస్తానని అన్నదా? లేదా అర్థం కాక రాజ్ జుట్టుపీక్కుంటాడు.
రుద్రాణి ప్లాన్...
నిజమైన మాయ గురించి అప్పుతో కావ్య ఫోన్‌లో మాట్లాడటం రుద్రాణి వింటుంది. నిజమైన మాయను తీసుకొచ్చి..నకిలీ మాయను ఇంట్లో నుంచి పంపించేసి ఇంట్లోనే పర్మినెంట్‌గా సెటిల్ అవ్వాలని అనుకున్న కావ్య ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అనుకుంటుంది. అసలు మాయను కలవడానికి వెళుతోన్న కావ్యను ఫాలో అవుతుంది రుద్రాణి.
ఇందిరాదేవి అనుమానం...
చిన్నారి ఏడుపు మొదలుపెడతాడు. మాయ ఎంత ప్రయత్నించిన ఏడుపు ఆపడు. మాయను చూడగానే వాడు ఏడుపు మొదలుపెట్టడం చూసి ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిలలో అనుమానం మొదలవుతుంది. నిజంగానే నువ్వు ఆ చిన్నారికి తల్లివా అని అడుగుతాడు. దాంతో నిజాలు ఎక్కడ బయటపడతాయో కంగారు పడుతుంది.
రాజ్ వల్లే ఇదంతా జరిగిందని తప్పు అతడిపై నెట్టివస్తుంది. చిన్నారిని నాకు దూరం చేసి కావ్యకు దగ్గర చేశాడని ఏడుస్తున్నట్లుగా నాటకం ఆడుతుంది. నా బిడ్డను నాకు కాకుండా చేసిన వాళ్లను అడగటం మానేసి నన్ను ఎలా నిలదీస్తారని ఫైర్ అవుతుంది. మాయకు అపర్ణ సపోర్ట్ చేస్తుంది. రాజ్ బిడ్డను తల్లిని వేరు చేశాడని నమ్ముతుంది.
రుద్రాణి యాక్సిడెంట్….
నిజమైన మాయను కలుస్తారు అప్పు కావ్య. వారిని సీక్రెట్‌గా రుద్రాణి ఫాలో అవుతుంది. అప్పు, కావ్యలను చూడగానే మాయ పారిపోతుంది. మాయను తన కారుతో గుద్దేస్తుంది రుద్రాణి. ఆమెను చంపాలని అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.