Brahmamudi April 24th Episode: గుడిలో అనామిక రచ్చ - ఇంట్లో నుంచి గెంటేస్తానని ఇందిరాదేవి వార్నింగ్ - కనకం ఫైర్
Brahmamudi April 24rd Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో సీతారాముల కళ్యాణం రాజ్, కావ్య చేతలు మీదుగా జరగకుండా ఆపాలని అనామిక ప్రయత్నిస్తుంది. ఆమెకు కనకం, ఇందిరాదేవి కలిసి బుద్దిచెబుతారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఇంటి గొడవకూడా తొక్కనివ్వనని అనామికకు ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది.
Brahmamudi April 24rd Episode: సీతారాముల కళ్యాణం వేడుకకు వచ్చిన రాజ్‌ను మీడియావాళ్లు ప్రశ్నలతో ఇబ్బందిపెడతారు. దుగ్గిరాల కుటుంబంలో వారసుడు పుడితే బయటకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు దాచారో చెప్పమని అపర్ణను ప్రశ్నిస్తారు మీడియా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజ్, అపర్ణతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం మౌనంగా ఉండిపోతారు. రాజ్, అపర్ణలను అవమానించడానికి మీడియా వాళ్లను రుద్రాణి, రాహుల్ టెంపుల్‌కు పిలిపిస్తుంది.
కనకం ఆవేశం...
తన కూతురికి అన్యాయం చేసి అందరూ సైలెంట్‌గా ఉండటం కనకం తట్టుకోలేకపోతుంది. రాజ్ బిడ్డ తన కూతురికి పుట్టలేదని చెప్పబోతుంది. కానీ తల్లిని కావ్య అడ్డుకుంటుంది. గొడవను ఆపమని, నిజం బయటపడితే కొంప కోల్లేరు అవుతుందని తల్లితో అంటుంది కావ్య. గొడవ జరిగితేనే నీకు న్యాయం జరుగుతుందని కావ్యకు సమాధానమిస్తుంది కనకం. దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డుమీదకు లాగడం వల్ల తనకు జరిగే న్యాయం అక్కరలేదని తల్లితో అంటుంది కావ్య.
రాజ్ తప్పులను కప్పిపుచ్చుతూ...
నీ మొగుడు చేసిన తప్పును కప్పిపుచ్చుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని కావ్యకు క్లాస్ ఇస్తుంది కనకం. తన భర్త తప్పు చేయలేదని, రాజ్ చేతిలో ఉన్న బిడ్డ ఆయనకు పుట్టలేదని తల్లికి సర్ధిచెప్పడానికి కావ్య ప్రయత్నిస్తుంది. కానీ కనకం కోపం మాత్రం తగ్గదు. చివరకు ఇందిరాదేవి వచ్చి కనకం అనుమానాలపై క్లారిటీ ఇస్తుంది. ఆమె మాటలతో కనకం కోపం తగ్గిపోతుంది. ఇందిరాదేవికి క్షమాపణలు చెబుతుంది. నీకున్న దోటిదురుసుతో తిట్టడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కామన్ అంటూ కనకంపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.
రుద్రాణి ప్లాన్...
రాజ్ కావ్యలకు కలిపేందుకు సీతారాముల కళ్యాణాన్ని వారిద్దరి చేతుల మీదుగా జరిపించాలని ఇందిరాదేవి ఫిక్సవుతుంది. సీతారాముల కళ్యాణం రాజ్, కావ్య చేతుల మీదుగా జరపకుండా ఆపేయాలని రుద్రాణి ప్లాన్ వేస్తుంది. అందుకోసం అనామికను పావుగా వాడుకుంటుంది. రాజ్, కావ్యల కంటే సీతారాములు కళ్యాణాన్ని జరిపించే అర్హత నీకు కళ్యాణ్‌కే ఉందని అనామికకు చాడీలు చెబుతుంది. చెప్పుడు మాటలను నిజమేనని అనామిక నమ్ముతుంది. ఆవేశంగా కళ్యాణం జరిగే చోటుకు వస్తుంది.
అనామిక ప్రశ్నలు...
రాజ్‌కు కళ్యాణం జరిపించే అర్హత ఉందా అని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌ను అడుగుతుంది అనామిక. ఆమె ప్రశ్నతో రాజ్, కావ్య షాకవుతారు. ఇంటికి పెద్ద కొడుకు అయినంత మాత్రానా అర్హత ఉన్నట్లేనా అని నిలదీస్తుంది. మా అన్నయ్య అర్హత గురించి ప్రశ్నించే అర్హత నీకు లేదని అనామికపై కళ్యాణ్ ఫైర్ అవుతాడు. శ్రీరాముడు అంటే ఏకపత్నివ్రతుడు.
ఆయన జీవితంలో ఒకే భార్య ఉంది. అలాంటి ఆదర్శపరుషుడికి కళ్యాణం చేసేవాళ్లు కూడా అలాగే ఆదర్శాలతో ఉండాలి అంటూ దుగ్గిరాల ఫ్యామిలీతో అంటుంది అనామిక. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నీకు...మీడియా ముందు ఇలాంటివి మాట్లాడితే గొడవ ఎక్కడికో వెళ్లిపోతుందని అనామికపై ఫైర్ అవుతాడు కళ్యాణ్. కానీ అతడి మాటల్ని పట్టించుకోదు అనామిక.
ఏకపత్నివ్రతుడు కాదు...
రాజ్ మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు. అలాంటప్పుడు ఏకపత్నివ్రతుడు ఎలా అవుతాడు. అతడి చేతుల మీదుగా కళ్యాణం ఎలా జరిపిస్తారని ప్రశ్నిస్తుంది అనామిక. ధాన్యలక్ష్మి కూడా కోడలికి సపోర్ట్ చేస్తుంది. అనామిక అడిగిందాట్లో న్యాయం ఉందని అంటుంది.
కళ్యాణ్ ఆమె మాటలను అడ్డుకోవాలని ప్రయత్నించినా అనామిక మాత్రం ఆగదు. దబాయిస్తే తాను బయటపడనని కళ్యాణ్‌తో అంటుంది. సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత మనకే ఉందని కళ్యాణ్‌తో అంటుంది. మనిద్దరమే పీటల మీద కూర్చుందామని అంటుంది అనామిక. కళ్యాణ్ అందుకు ఒప్పుకోడు. సూర్ఫణఖ పోల్చి అనామికపై సెటైర్స్‌వేస్తాడు.
స్వప్నకు అవమానం...
అర్హత గురించి ఆలోచిస్తే...మీ కంటే ముందు రాహుల్, నాది పెళ్లి జరిగింది కాబట్టి సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత మాకు కూడా ఉందని అనామికతో స్వప్న వాదిస్తుంది. పెళ్లికి ముందే కడుపు చేసుకున్న నీకు అసలు అర్హతే లేదని స్వప్నను అవమానిస్తుంది అనామిక. స్వప్న కూడా ధీటుగా అనామికకు బదులిస్తుంది.
కనకం వార్నింగ్...
అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న కనకం ఒక్కసారిగా అనామికపై ఫైర్ అవుతుంది. నిన్నకాక మొన్న ఊడిపడ్డదానివి, పెద్దవాళ్లకు విలువ ఇవ్వకుండా బాగా మాట్లాడుతున్నావేంది అంటూ కోప్పడుతుంది. రాజ్ మరో భార్యను నువ్వు చూశావా...అతడికి దగ్గరుండి నువ్వే మరో పెళ్లి జరిపించావా అని నిలదీస్తుంది.
రాజ్ కు మరో పెళ్లి జరిగినట్లు సాక్ష్యాలు ఉన్నాయా.. సాక్షులు ఉన్నారా...ఫొటోలు ఉన్నాయా అవన్నీ తీసుకురమ్మని చెబుతుంది. ఆ బిడ్డ తల్లి ఎవరో ఎక్కడ ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. కళ్యాణం జరిపించేది నా బిడ్డ, అల్లుడే. ఉంటే ఉండు పోతే పో...ఏం చేసుకుంటావో చేసుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఇంట్లో అడుగుపెట్టనివ్వను...
అయినా అనామిక వినకుండా మళ్లీ మాట్లాడబోతుంది. ఇందిరాదేవి కోపం పట్టలేకపోతుంది. ఇంకో మాట మాట్లాడితే లాగిపెట్టి ఒక్కటిస్తానని వార్నింగ్ ఇస్తుంది. మీ అత్తకోడళ్లకు వేరే పనేం లేదా...ఇంట్లో చేసే రభస చాలకుండా గుడిలో కూడా గొడవ చేయాలా అని ప్రశ్నిస్తుంది. సీతారాముల క ళ్యాణం జరగకుండా అడ్డుపడితే ఇంట్లోకి కూడా రానివ్వనని అనామికతో పాటు ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. దాంతో అనామిక సైలెంట్‌గా మారిపోతుంది.
రాహుల్ రచ్చ....
చివరకు రాజ్, కళ్యాణ్ చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంది. తన కాపురంలో ఉన్న కలతలు తొలగిపోయేలా చేయమని దేవుడిని కోరుకుంటుంది కావ్య. బాబు పుట్టుక వెనకున్న రహస్యం బయటపడి రాజ్‌పై పడిన మచ్చ తొలగిపోయేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది కావ్య.
ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ వేడుకలో కూర్చుంటుంది అనామిక. పూజ పూర్తయి బయటకు వెళుతోండగా రాజ్, కావ్యలను వదిలిపెట్టొద్దని మీడియా వారితో చెబుతాడు రాహుల్. రాజ్ మరొకరితో సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నాడని, ఆ బిడ్డ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మీడియా వాళ్లతో చెబుతాడు రాహుల్.
రుద్రాణి ప్లాన్ ఫెయిల్...
రాజ్ చేసిన తప్పుల్ని అందరికి తెలిసేలా చేయాలని మీడియా వాళ్లు నిశ్చయించుకుంటారు. మీడియా వాళ్లు మాట్లాడుకునే మాటల్ని చాటు నుంచి అప్పు వింటుంది. ఈ విషయం కళ్యాణ్‌కు చెప్పి గొడవను ఆపాలని అనుకుంటుంది. కనకం దేవుడిని ప్రార్థిస్తుండగా అక్కడికి రుద్రాణి వస్తుంది. ఏం కోరుకున్నావని అడుగుతుంది. ఎదుటివాళ్ల నాశనం కోరుకునే వాళ్లకు కుక్కచావు రావాలని కోరుకున్నానని రుద్రాణిపై సెటైర్ వేస్తుంది కనకం. నీ కూతురికి అన్యాయం చేసిన ఎందుకు సెలైంట్‌గా ఉంటున్నావు. ఈ రోజు బిడ్డను తీసుకొచ్చిన నీ అల్లుడు నీ బిడ్డకు సవతిని గిఫ్ట్‌గా ఇచ్చిన కూడా ఏం అడగవా అంటూ కనకాన్ని రెచ్చగొట్టాలని రుద్రాణి ప్రయత్నిస్తుంది. రుద్రాణి మాటల్ని కనకం కామెడీగా తీసుకుంటుంది. రుద్రాణినిపైనే పంచ్‌లు వేసి వెళ్లిపోతుంది.
మీడియా ప్రశ్నలు...
మీ బిడ్డ మీ భార్యకు కావ్యకు కాకుండా మరొకరికి పుట్టిన బిడ్డ అని అంటున్నారు నిజమేనా అని రాజ్‌ను మీడియావాళ్లు ప్రశ్నిస్తారు. ఆఫీస్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందో చెప్పాలని నిలదీస్తారు. వారి ప్రశ్నలకు రాజ్‌తో పాటు కావ్య కూడా షాకవుతారు.