Guppedantha Manasu Serial: ఆటోడ్రైవర్ రంగాగా మారిన రిషి - వసు ప్రేమకథలో ట్విస్ట్ - మహేంద్రకు అండగా మను
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రౌడీల బారి నుంచి వసుధారను కాపాడుతాడు ఆటోడ్రైవర్ రంగా. రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి తన భర్తగా పొరపడి సంబరపడుతుంది వసుధార.
Guppedantha Manasu Serial: వసుధారను చంపేందుకు స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. రౌడీలతో ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు. కానీ రిషి ఎంట్రీతో అతడి ప్లాన్ తలక్రిందులవుతుంది ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చిన రిషి రౌడీల చితక్కొట్టి వసుధారను రిషి కాపాడుతాడు. రిషిని చూసి వసుధార షాకవుతుంది.
రిషి బతికి ఉన్నాడనే తన నమ్మకం నిజం కావడంతో సంబరపడుతుంది. ఆనందంపట్టలేక రిషిని కౌగిలించుకుంటుంది వసుధార. ఇంతలో ఓ రౌడీ రిషి అలియాస్ రంగాను కొట్టడానికి వస్తాడు. రంగాకు దెబ్బ తగలకుండా వసుధార అడ్డుపడుతుంది.దాంతో ఆ దెబ్బ వసుధార తలపై గట్టిగా తగలడటంతో స్పృహ కోల్పోతుంది.
రిషి అలియాస్ రంగా…
రౌడీల ఎటాక్‌లో గాయపడ్డ వసుధారను తన ఆటోలోనే రంగా హాస్సిటల్‌కు తీసుకెళుతుంటాడు. వసుధారను రంగా గుర్తుపట్టడు. మేడమ్ అని పిలుస్తుంటాడు. చూస్తుంటే మేడమ్ నీకు బాగా పరిచయం ఉన్నట్లుగా ఉందని రంగా అసిస్టెంట్ అతడితో అంటాడు.
తనకు ఈ మేడమ్ ఎవరో తెలియదని అసిస్టెంట్‌కు బదులిస్తాడు రంగా. నేను తనకు తెలుసునేమోనని అంటాడు. తన ఆటో ఎక్కే రెగ్యులర్ ప్యాసింజర్ అయి ఉంటుందని అసిస్టెంట్‌తో అంటాడు రంగా.
మహేంద్ర టెన్షన్...
మేడమ్ ముఖం చూస్తుంటే చాలా మంచివారిలా కనిపిస్తున్నదని రంగా అసిస్టెంట్ అంటాడు. మంచిది కాబట్టే రౌడీ ఎటాక్ నుంచి తనను కాపాడిందని రంగా బదులిస్తాడు. మరోవైపు వసుధార కనిపించకపోవడంతో మహేంద్ర, అనుపమతో పాటు మను టెన్షన్ పడతారు.
వసుధార ఏదైనా అనుకుంటే సాధించే వరకు ఊరుకోదని, ఆమె పంతం ఎలాంటిదో తనకు తెలుసునని మహేంద్ర అంటాడు. వసుధార తనంతట తానే ఇంటికి తిరిగి రావడం మినహా ఎంత వెతికినా దొరకదని మహేంద్ర అంటాడు. తాను చేసిన తప్పుల వల్లే రిషి, వసుధార దూరమయ్యారని. తన కుటుంబం చెల్లచెదురైపోయిందని బాధపడతాడు.
మాటిచ్చిన మను...
వసుధారను తాను వెతికితీసుకొస్తానని మహేంద్రకు మాటిస్తాడు మను. మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైన, ఏం జరిగినా కాలేజీ వదిలిపెట్టి వెళ్లనని తనకు ప్రామిస్ చేయమని మనును కోరుతాడు మహేంద్ర. వసుధార అడ్డుతొలగిపోవడంతో కాలేజీని సొంతం చేసుకోవడానికి శైలేంద్ర కుట్రలు పన్నుతాడని, కాలేజీని అతడి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుతానని నాకు మాటిస్తావా అని మనును అడుగుతాడు మహేంద్ర.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. శైలేంద్ర, దేవయాని ఎలాంటి ప్లాన్స్ వేసిన కాలేజీని వాళ్ల చేతుల్లోకి పోనివ్వకుండా చూస్తానని మహేంద్రకు మాటిస్తాడు మను. తనను జైలు నుంచి విడిపించడానికి మహేంద్, వసుధార పడ్డ కష్టాలను మను గుర్తుచేసుకుంటాడు. లోకం అంతా తాను తప్పు చేశాడని అన్నా....మహేంద్ర మాత్రం తాను ఏ తప్పు చేయాలని నమ్మాడని, తండ్రిగా తనకు అండగా నిలబడ్డాడని మను అంటాడు.
మహేంద్ర ఇంట్లోనే...
మహేంద్రను తనతో పాటు రమ్మని మను రిక్వెస్ట్ చేస్తాడు. ఈ ఇంట్లో రిషి, వసుధార వదిలివెళ్లిన జ్ఞాపకాలు ఉన్నాయని, ఆ జ్ఞాపకాల కోసమైనా తన ఇంట్లోనే ఉంటానని, ఎక్కడికి రానని మహేంద్ర అంటాడు. ఆ పరిస్థితుల్లో మహేంద్రను ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక అతడితో పాటే ఉండాలని అనుపమ, మను నిర్ణయించుకుంటారు.
వసుధార కలవరింత...
రిషి గురించి కలవరిస్తుంటుంది వసుధార. డాక్టర్ ఆమెకు ఇంజక్షన్ చేయబోతుంది. వసుధార చేయిపట్టుకోమని రంగాకు చెబుతుంది. వసుధార చేయిని రంగా పట్టుకోబోతుండగా అక్కడికి రంగా మరదలు సరోజ ఎంట్రీ ఇస్తుంది. పరాయి స్త్రీ చేయిని మా బావ పట్టుకోవడం తనకు ఇష్టం ఉండదని అంటుంది.
రంగా మరదలు...
రిషి అని కలవరిస్తుంటే అతడు ఎవరై ఉంటారని రంగాతో పాటు అక్కడ ఉన్నవారు అనుకుంటారు. వసుధార కోలుకోవడానికి రెండు, మూడు రోజులు పడుతుందని డాక్టర్ అంటుంది. వసుధార ఇక్కడే పర్మినెంట్‌గా సెటిల్ అవుతుందేమోనని రంగా మరదలు కంగారు పడుతుంది.
వసుధారను తన బావకు దూరంగా ఉంచాలని సరోజ అనుకుంటుంది. వసుధార తొందరగా కోలుకోవాలంటే రిషిని తీసుకురావడం ఒక్కటే మార్గమని డాక్టర్ చెబుతుంది. అయితే రిషి ఎవరో తనకు తెలియదని రంగా అంటాడు. .
అప్పుడే వసుధార స్పృహ వస్తుంది. రంగాను చూసి రిషి అంటూ పిలిచి ఆనందపడుతుంది. రంగా మాత్రం వసుధారను గుర్తుపట్టడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.