Guppedantha Manasu Serial: మాస్ ఎంట్రీ ఇచ్చిన రిషి - నిజమైన వసుధార నమ్మకం - ఇక శైలేంద్రకు దబిడి దిబిడే
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార తన మనుషులతో కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. ఆమెను చంపాలని రౌడీలకు ఆర్డర్ వేస్తాడు. లాస్ట్ మినట్‌లో రిషి ఎంట్రీ ఇచ్చి వసుధారను సేవ్ చేస్తాడు.
Guppedantha Manasu Serial: ఎండీ పదవికి రాజీనామా చేస్తుంది వసుధార. డీబీఎస్‌టీ కాలేజీకి దూరంగా వెళ్లిపోతుంది. రాజీనామాను వెనక్కి తీసుకోమని మహేంద్ర, ఫణీంద్రతో పాటు అనుపమ ఎంత చెప్పిన వసుధార వినదు. తన నిర్ణయం మారదని చెప్పి అందరికి దూరంగా వెళ్లిపోతుంది.
శైలేంద్ర ఆనందం...
వసుధార ఎండీ సీట్‌కు రాజీనామా చేయడంతో శైలేంద్ర సంబరపడతాడు. నిజంగానే వసుధార కాలేజీ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని అనుమానంతో ఎండీ క్యాబిన్‌కు వచ్చి చూస్తాడు. ఆ రూమ్‌లో వసుధార లేకపోవడం చూసి ఆనందపడతాడు. ఎండీ సీట్ ఖాళీగా కనిపిస్తుంది. వసుధార మాట మీద నిలబడే మనిషి అని అనుకుంటాడు. ఎండీ సీట్‌లో తాను కూర్చునే రోజు ఎప్పుడొస్తుందా అని అనుకుంటాడు.
బాంబ్ పేల్చిన వసుధార...
ఇంతలోనే వసుధార టేబుల్‌పై ఓ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చదివి షాకవుతాడు శైలేంద్ర. వసుధార వెళుతూ వెళుతూ పెద్ద బాంబ్ పేల్చిందని అనుకుంటాడు. తాను ఎండీ సీట్‌లో కూర్చొనే వరకు ఆ లెటర్ ఎవరి కంటపడకుండా దాచేస్తాడు. అవసరం వచ్చినప్పుడు ఆ లెటర్‌ను ఓ అస్త్రంలా వాడాలని అనుకుంటాడు శైలేంద్ర.
మహేంద్ర కంగారు...
వసుధార కోసం కాలేజీ మొత్తం వెతుకుతారు మహేంద్ర, అనుపమ. ఆమె ఎక్కడ కనిపించదు. ఫోన్ చేసిన కలవదు. మహేంద్రకు వాయిస్ మెసేజ్ పంపిస్తుంది వసుధార. మళ్లీ రిషితోనే కాలేజీలో అడుగుపెడతానని అంటుంది. ఒకవేళరిషిని తీసుకురాకపోతే కాలేజీకే కాదు ఈ లోకానికి శాశ్వతంగా తాను దూరమయినట్లేనని వసుధార చెబుతుంది.
ఛాలెంజ్‌లో ఓడిపోయాను...
రిషిని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్‌లో ఓడిపోయానని, ఓటమిని ఒప్పుకుంటున్నట్లు వాయిస్ మెసేజ్‌లో చెబుతుంది. రిషి సార్ లేని చోట తాను ఉండలేకపోతున్నానని, నా మంచికోరుకునే వాళ్లు కూడా రిషి లేడని నమ్మడం మనసును బాధపెట్టిందని వసుధార వాయిస్ మెసేజ్‌లో అంటుంది. .
రిషి లేడని ఎలా అనుకుంటున్నారో...ఈ వసుధార కూడా లేదని అనుకొండి. తాను కూడా చనిపోయినట్లు భావించండి, తనను వెతికే ప్రయత్నం చేయద్దని వాయిస్ మెసేజ్ ద్వారా మహేంద్రకు చెబుతుంది వసుధార.
శైలేంద్రపై అనుమానం...
ఆ వాయిస్ మెసేజ్ విని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఆ వాయిస్ మెసేజ్ శైలేంద్ర కూడా వింటాడు. వసుధార ఏదైనా అఘాయిత్యం చేసుకొని ఉంటుందా అని అంటాడు. అతడి మాటలతో మహేంద్ర కోపం పట్టలేకపోతాడు. శైలేంద్రపై ఫైర్ అవుతాడు. వసుధారకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విఛాఫ్ అని వస్తుంది.
ఎండీ క్యాబిన్ నుంచి శైలేంద్ర రావడం చూసి మహేంద్ర, మను అనుమాన పడతారు. నువ్వు ఎండీ క్యాబిన్‌లోకి ఎందుకు వెళ్లావు అని నిలదీస్తారు. వసుధార కోసం తాను వెతుకుతున్నానని శైలేంద్ర అబద్ధం ఆడుతాడు. వసుధార కనిపించకుండా పోవడంలో నీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఏదైనా ఉందని తెలిస్తే ఊరుకోనని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు.
దేవుడి వేడుకున్న వసు...
కాలేజీ నుంచి బయటకు వచ్చిన వసుధార దేవుడి దగ్గరకు వస్తుంది. రిషి దూరమై తాను ఒంటరినయ్యానని ఎమోషనల్ అవుతుంది. ఇన్నాళ్లైనా నా రిషిని నా దగ్గరకు ఎందుకు చేర్చలేదని, నా కన్నీళ్లతో నీ మనసు కరగలేదా? అని దేవుడిని వేడుకుంటుంది వసుధార. రిషి కనిపించేలా చేసి తనకు ఓ దారి చూపించమని దేవుడిని కోరుకుంటుంది.
వసుధార కిడ్నాప్...
దేవుడి గుడి దగ్గర ఉన్న వసుధారను తన మనుషులతో కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. ఆమెను చంపేయమని చెబుతాడు. వసుధార స్పృహలోకి రాకముందే ఆమె భూమిలో కలిసిపోవాలని, మూడోకంటికి తెలియకుండా అన్ని పనులు జరగాలని అంటాడు. మర్డర్ జరిగిందని ఎవరికి తెలియకూడదని కిల్లర్‌కు తన ప్లాన్ మొత్తం చెప్పేస్తాడు శైలేంద్ర.
వసుధార ఎస్కేప్....
వసుధారను చంపి పాతిపెట్టడానికి గోతి తవ్వుతారు రౌడీలు. అప్పుడే స్పృహలోకి వచ్చిన వసుధార ఆ రౌడీల బారి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్లాన్ వర్కవుట్ కాదు. రౌడీలకు దొరికిపోతుంది.సడెన్‌గా మాస్ గెటప్‌లో అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొట్టి వసుధారను కాపాడుతాడు. రిషిని చూసి వసుధార మనసు ఉప్పొంగిపోతుంది.అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.