Bigg Boss Telugu 8: ఆ నిఖిల్ గాన్ని తీసేయ్యాలే.. పెద్ద డేంజర్ గాడు వాడు.. బిగ్ బాస్ గంగవ్వ కామెంట్స్
19 October 2024, 6:32 IST
Bigg Boss Telugu 8 Gangavva About Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో నిఖిల్‌పై గంగవ్వ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ నిఖిల్ గాన్ని తీసేయాల్లో.. వాడు పెద్ద డేంజర్ గాడు అని ఊహించని విధంగా గంగవ్వ మాట్లాడింది. మరి గంగవ్వ అలా ఎందుకు మాట్లాడటిందన్న వివరాల్లోకి వెళితే..
ఆ నిఖిల్ గాన్ని తీసేయ్యాలే.. పెద్ద డేంజర్ గాడు వాడు.. బిగ్ బాస్ గంగవ్వ కామెంట్స్
Bigg Boss Telugu 8 October 18th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్‌లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ కంటిన్యూ అయింది. శుక్రవారం కూడా ఈ టాస్క్ జరగడంతో మొత్తంగా మూడు రోజులపాటు ఇదే టాస్క్ సాగింది.
రెండు క్లాన్స్ నుంచి
ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో రాయల్ అండ్ ఓజీ క్లాన్స్‌కు బిగ్ బాస్ ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న కుషన్స్ ఉంచారు. ప్లాస్మాలో చూపించిన సింబల్ ఉన్న కుషన్స్‌ను తీసుకెళ్లి పక్కన గీసిన బాక్స్‌లో పెట్టాలి. రెండు క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు, లేదా ఇద్దరు, ముగ్గురు ఇలా రావాలని, అది తానే చెబుతానని బిగ్ బాస్ చెప్పాడు.
కుషన్స్ తీసుకెళ్లే సమయంలో ఇతర క్లాన్స్‌ను అడ్డుకోవచ్చని, అయితే, ఒక్కసారి బాక్స్‌లో పెట్టాక మాత్రం వాళ్లను టచ్ చేయొద్దని, కుషన్స్ ఉన్న వాళ్లే బాక్స్‌లోకి వెళ్లాలని బిగ్ బాస్ పంపిన బుక్‌లోని రూల్స్‌ను జబర్దస్త్ రోహిణి చదివి వినిపించింది. అనంతరం గేమ్ స్టార్ట్ అయింది. మొదటి రౌండ్‌లో ప్రేరణ కుషన్ పెట్టడంతో ఓజీ క్లాన్ గెలిచింది. తర్వాత నిఖిల్, నయని పోటీ పడ్డారు.
అందరిని పంపించాలి
నయనికి కుషన్ ముందుగా దొరికింది కానీ, తను వెళ్లకుండా నిఖిల్ అడ్డుకున్నాడు. నయనిని చేతులతో గిరా గిరా తిప్పి లాక్కుని వెళ్లి కుషన్‌ను బాక్స్‌లో పెట్టాడు. దాంతో మరోసారి ఓజీ క్లాన్ గెలిచింది. మూడో రౌండ్‌లో టేస్టీ తేజ రాయల్ క్లాన్‌కు పాయింట్ తీసుకొచ్చాడు. అప్పుడు మాటల మధ్యలో ఈసారి అందరిని బిగ్ బాస్ పంపించాలి అని అవినాష్ చెప్పుకుంటూ నవ్వాడు.
దాంతో అవినాష్ చెప్పిందే చేద్దాం అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ రౌండ్‌లో రెండు క్లాన్స్‌లోని అందరూ సభ్యులు పాల్గొలనాలని చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు రాయల్ క్లానే గెలిచింది. ఇక ఇది ఆఖరి రౌండ్. ఇందులో కూడా ఇరు క్లాన్స్ సభ్యులందరు పాల్గొనలాని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో అంతా పార్టిస్‌పేట్ చేశారు. ఫైనల్ రౌండ్‌లో కూడా రాయల్ క్లాన్ గెలిచింది. దాంతో ఈ ఛాలెంజ్‌ను రాయల్ క్లాన్ గెలిచింది.
రాయల్ క్లాన్ గెలవడంతో మెగా చీఫ్ కంటెండర్‌షిప్ రేస్ నుంచి ఓజీలోని ఇద్దరు సభ్యులను తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో రాయల్ క్లాన్ ఆలోచించుకునేందుకు లోపలికి వెళ్లారు. నిఖిల్, నబీల్ ఇదివరకు చీఫ్స్ అయ్యారు కాబట్టి వేరేవాళ్లకు ఛాన్స్ ఇద్దామని మెహబూబ్, హరితేజ అన్నారు. కాసేపు డిస్కషన్ తర్వాత గంగవ్వను లోపలికి పిలిచారు.
పెద్ద డేంజర్ గాడు
వాళ్లలో ఇద్దరిని తీసేయాలి ఎవరిని తీసేద్దామని గంగవ్వను అవినాష్ అడిగాడు. దాంతో ఆ నిఖిల్ గాన్ని తీసేయ్యాలే.. పెద్ద డేంజర్ గాడు వాడు.. అని గంగవ్వ అంది. దాంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. తర్వాత ఇంకొకరి పేరు చెప్పమంటే తన టీమ్ మెంబర్ అయిన రోహిణి పేరు చెప్పింది గంగవ్వ. అయ్యో.. మనదాంట్లో కాదే.. వాళ్లదాంట్లో అని వాళ్లు చెప్పారు.
దాంతో ఆ నబీల్‌ను తీసేద్దామని గంగవ్వ అంది. దాంతో రాయల్ క్లాన్ వెళ్లి ఓజీ నుంచి నిఖిల్, నబీల్‌ను తీసేస్తున్నట్లు, ఇదివరకు చీఫ్స్ అయ్యారని, వేరేవాళ్లకు అవకాశం ఇద్దామనే తొలగిస్తున్నట్లు చెప్పింది. అయితే, టాస్క్‌ల్లో నిఖిల్ ఓవర్‌గా ఫిజికల్ అవడం, రెచ్చిపోవడం, గౌతమ్‌తో గొడవ పడటం, ఏది చూసుకోకుండా ఆడటంతో తీసేయ్యాలని గంగవ్వ చెప్పినట్లు తెలుస్తోంది.
టాపిక్