Bigg Boss Telugu 8: గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్ (వీడియో)-bigg boss telugu 8 gangavva emotional for vishnupriya father in bigg boss 8 telugu october 16th episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్ (వీడియో)

Bigg Boss Telugu 8: గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Published Oct 16, 2024 12:37 PM IST

Bigg Boss Telugu 8 October 16 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా రిలాక్స్ అయ్యారు. ఆ మరుసటి రోజు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే గంగవ్వ ఏడ్చేలా చేసింది యాంకర్ విష్ణుప్రియ. ఇక మణికంఠ అందరికి ఆఫర్ ఇచ్చేశాడు.

గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్
గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్

Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ జోరుగా సాగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా 9 మంది నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్స్ తర్వాత మరుసటి రోజు కంటెస్టెంట్స్ అంతా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

నాన్నతో మాట్లాడట్లేదు

బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఉదయం గంగవ్వ, విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. "నాన్న ఎక్కడ ఉంటడు" అని గంగవ్వ అడిగింది. "నాన్న ఊరులో ఉంటాడు" అని విష్ణుప్రియ చెబితే.. "మిమ్మల్ని గుర్తు చేసుకోడా" అన్నట్లుగా గంగవ్వ అంది. "మా అమ్మకు వాళ్లతో మాట్లాడటం ఇష్టంలేకుండా ఉండే. మా నాన్న మీద ఎంత ప్రేమ ఉన్న, నేను ఎంత మిస్ అయినా మా అమ్మ కోసం మా నాన్నతో మాట్లాడట్లేదు" అని విష్ణుప్రియ చెప్పింది.

ఏడ్చేసిన గంగవ్వ

విష్ణుప్రియ అలా చెప్పడంతో గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. "నీళ్లు వస్తున్నాయి.. ఆయ్.." అని గంగవ్వను విష్ణుప్రియ ఓదార్చింది. విష్ణుప్రియ కథ విని గంగవ్వ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. తర్వాత గంగవ్వతో మణికంఠ మంచి డీలింగ్ చేసుకుందామని అన్నాడు. "ఆమెతో నీకెందుకు డీలింగ్" అని హరితేజ అంది. సరే చెప్పు అని గంగవ్వ అంది.

మణికంఠ ఆఫర్స్

"నేను ఈ వారం సేవ్ అయితే.. నీకు బంగారు ముక్కు పుడక చేయిస్తా" అని మణికంఠ అన్నాడు. "నాకు బంగారు వడ్డాణం ఇస్తావా చెప్పు" అని హరితేజ అడిగింది. దాంతో "బేగం బజార్‌కు వెళ్లి కచ్చితంగా తీసుకుంటా" అన్నట్లుగా మణికంఠ చెప్పాడు. దాంతో హరితేజ ఇరిటేట్ అయింది. "మరి నాకేం ఇస్తావ్" అని మెల్లిగా జబర్దస్త్ రోహిణి అడిగింది.

సేవ్ అవ్వాలి

"ఓ ముద్దిస్తా" అని మణికంఠ చెప్పాడు. దాంతో గంగవ్వ నవ్వడం చూపించారు. "నువ్ సేవ్ అయితే నాకు ఎందుకు ముద్దు" అని రోహిణి అంది. అలా హరితేజకు, రోహిణికి పంచ్‌లు వేశాడు. "సేవ్ చేస్తా నాకు తులం (బంగారం) పెట్టు" అని గంగవ్వ అడిగింది. "ఏడోవారం నేను నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి. తొమ్మిదోవారం నేను హౌజ్‌లో ఉండాలి" అని మణికంఠ అన్నాడు.

తొమ్మిదో వారం వెళ్లిపోతావ్

దానికి "ఉండవు" అని గంగవ్వ గాలి తీసేసింది. దాంతో హరితేజ తెగ నవ్వేసింది. "ఎందుకు ఉండనే" అని గంగవ్వను మణికంఠ అడిగాడు. "ఎనిమిది వారాల వరకే ఛాన్స్.. తొమ్మిదో వారం వెళ్లిపోతావ్. లేదు" అని గంగవ్వ అంది. దాంతో మణికంఠ షాక్ అయ్యాడు. తర్వాత కంటెస్టెంట్స్‌కు ఫన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

గంగవ్వలా రోహిణి

ఏడో వారం నామినేషన్స్‌లో ఒక్కో కంటెస్టెంట్ బిహేవ్ చేసినట్లుగా మరో ఇంటి సభ్యుడు చేశారు. గౌతమ్‌లాగా టేస్టీ తేజ, గంగవ్వలా రోహిణి చేసి నవ్వించారు. సేమ్ వాళ్లు మాట్లాడినట్లుగానే ఇమిటేట్ చేసి నవ్వించారు. అనంతరం పృథ్వీలా గౌతమ్, అవినాష్‌లా రోహిణి చేశారు.

Whats_app_banner