తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్

Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్

Sanjiv Kumar HT Telugu

24 September 2024, 14:28 IST

google News
  • Bigg Boss Telugu 8 Fourth Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్ ఓటింగ్‌లో వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది టాప్‌లో దూసుకుపోతూ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంతకుముందు యాంకర్ విష్ణుప్రియ, నిఖిల్‌కు వచ్చిన వచ్చిన ఓటింగ్‌ కంటే ఎక్కువగా సంపాదించి సత్తా చాటాడు.

బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్
బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్

బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్

Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నాలుగో వారం నామినేషన్స్ కూడా అరాచకంగా సాగాయి. ఎప్పటిలాగే అరుపులు, గొడవలతో రసవత్తరంగా సాగాయి. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు నాలుగో వారం నామినేషన్స్ కూడా ఒక్కరోజే జరిగాయి. సోమవారం (సెప్టెంబర్ 23) నాడు జరిగిన బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు.

చీఫ్ అయిన కారణంగా నిఖిల్‌ను ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎవరు నిఖిల్‌ను నామినేట్ చేయలేదు. ఆదిత్యో ఓం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్‌లో నబీల్ వర్సెస్ సోనియా వర్సెస్ యష్మీ భీకరంగా సాగింది. అలాగే, యష్మీ, మణికంఠ మధ్య కూడా తీవ్రమైన వాగ్వాదం జరిగింది.

అయితే, బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నిలిచారు. చీఫ్ అయిన నిఖిల్‌ను నామినేషన్స్‌లో ఉన్నవాళ్ల నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉందని బిగ్ బాస్ తెలిపాడు. బిగ్ బాస్ ఆదేశంతో నైనికను సేవ్ చేశాడు నిఖిల్. దాంతో ఆరుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.

బిగ్ బాస్ 8 తెలుగు నాలుగో వారం నామినేషన్స్‌లో ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నబీల్, సోనియా, పృథ్వీరాజ్, ప్రేరణ నిలిచారు. వీరికి సోమవారం రోజు నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఓటింగ్‌లో వరంగల్ కుర్రాడు నబీల్ అత్యధిక ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతున్నాడు. దాదాపుగా నబీల్‌కు తొలిరోజు 35 శాతం ఓటింగ్ నమోదు అయిందని సమాచారం.

అయితే, ఇంతకుముందు విష్ణుప్రియ, నిఖిల్‌కు వచ్చిన ఓటింగ్ కంటే ఎక్కువ. వారికి 30 శాతంలోపే ఓటింగ్ వచ్చింది. కానీ, వాళ్ల ఓటింగ్ రికార్డ్ బ్రేక్ చేసి 35 శాతం ఓటింగ్‌తో సత్తా చాటుతున్నాడు నబీల్. ఆ తర్వాతి రెండో స్థానంలో నాగ మణికంఠ నిలిచాడు. అతనికి 17 శాతం ఓట్లు పడుతున్నాయి.

ఇక మూడో స్థానంలో ప్రేరణ కంబం నిలిచింది. ఆమెకు 13 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఆ తర్వాతి స్థానం అంటే నాలుగో ప్లేసులో ఆదిత్యం ఓం నిలిచాడు. సింపథీ, సోనియాపై కోపంతోనో ఆదిత్యకు 12 శాతం ఓట్లు పడుతున్నట్లు సమాచారం. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పృథ్వీరాజ్, సోనియాకు సమానంగా 8 శాతం ఓట్లు పడుతున్నాయి.

అంటే, వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, వీళ్లందరి ఓటింగ్ శుక్రవారం ఇలాగే కొనసాగుతుందా.. లేదా మార్పులు జరుగుతాయా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, ఎప్పుడు నోరేసుకోని పడిపోయే సోనియాకు వరంగల్ యూట్యూబర్ నబీల్, యష్మీ ఇచ్చి పడేశారు.

మాటకు మాట తగ్గాఫర్ కౌంటర్ ఇచ్చి అదరగొట్టారు. మాటలతో సమాధానం చెప్పలేకపోయిన సోనియా.. యష్మీపై పర్సనల్ అటాక్ చేసింది. అయినా కూడా గట్టి కౌంటర్ ఇచ్చి సోనియా నోరు మూయించింది యష్మీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం