తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukh Jaswanth Ott: నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్

Shanmukh Jaswanth OTT: నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్

Sanjiv Kumar HT Telugu

18 December 2024, 10:26 IST

google News
    • Shanmukh Jaswanth Emotional At OTT Movie Pre Release Event: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. తనవల్లే తన కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందని, చేయని తప్పుకు తనను నిందించారని లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ కామెంట్స్ చేశాడు.
నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్
నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్

నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్

Bigg Boss Shanmukh Jaswanth OTT Movie: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. సాప్ట్‌వేర్ డవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో అలరించిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

గంజాయి దొరికిందని

అయితే, ఆ సీజన్‌లో సిరి హన్మంతుతో షణ్ముఖ్ వ్యవహరించిన తీరు విమర్శలకు గురి చేసింది. అనంతరం బిగ్ బాస్ తర్వాత కొద్ది రోజులకు యాక్సిడెంట్‌ కేసులో, గంజాయి కేసులో అరెస్ట్ కావడం మరింత నెగెటివిటీ తెచ్చుకున్నాడు. ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ జస్వంత్ అన్నయ్య సంపత్‌ను పట్టుకోడానికి అతని ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులకు గంజాయి దొరికందని కేసు నమోదు చేశారు.

లీలా వినోదం ఓటీటీ రిలీజ్‌

ఇలా పలు విమర్శలు, కేసులతో సతమతం అవుతున్న షణ్ముఖ్ జస్వంత్‌కు లీలా వినోదం ఓటీటీ మూవీ ఆఫర్ వచ్చింది. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్‌లో లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో షణ్ముఖ్ జస్వంత్ ఎమోషనల్‌ కామెంట్స్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

సంవత్సరన్నర అవుతుంది

"అందరికీ నమస్కారం. నేను కంటెంట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. అయినప్పటికీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు కరెక్ట్ టైంలో 'లీలా వినోదం' వచ్చింది. భరత్, సాయి గారికి థాంక్యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను" అని షణ్ముఖ్ జస్వంత్ అన్నాడు.

ఎవరో చేసిన తప్పుకు

"నా జర్నీ అంతా ముందుగా వైజాగ్‌లోనే ప్రారంభం అయింది. ఆ టైమ్‌లో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ (నిందిస్తూ) అనేక ఆరోపణలు చేశారు" అని షణ్ముఖ్ చెప్పాడు.

పౌర్ణమిని చూస్తాడు

"ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. అందులోకి నా ఫ్యామిలీని కూడా లాగారు. కుటుంబానికి అండగా ఉండాలని ప్రతి కొడుకు అనుకుంటాడు. కానీ, నా వల్లే నా కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమావాస్య చూసినోడు కచ్చితంగా పౌర్ణమిని చూస్తాడు. నా లైఫ్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది" అని షణ్ముఖ్ జస్వంత్ తెలిపాడు.

వాళ్లే నిజమైన స్నేహితులు

"చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నా దగ్గరికి లీలా వినోదం ప్రాజెక్ట్ వచ్చింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కిందపడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన స్నేహితులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను. లీలా వినోదం మీ అందరికి నచ్చుతుంది. అందరూ కష్టపడ్డారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం. నన్ను సపోర్ట్ చేయమని అందరినీ కోరుతున్నాను. లీలా వినోదం టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్" అని షణ్ముఖ్ జస్వంత్ ఎమోషనల్ అయ్యాడు.

తదుపరి వ్యాసం