Bigg Boss Remuneration: బిగ్ బాస్‌లో 3 రోజులకు రెండున్నర కోట్లు సంపాదించిన ఏకైక కంటెస్టెంట్.. అత్యధిక రెమ్యునరేషన్ ఇదే!
20 December 2024, 13:46 IST
Bigg Boss Contestant Get 2.5 Crore For 3 Days: బిగ్ బాస్ హౌజ్‌లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు సంపాదించిన ఏకైక కంటెస్టెంట్‌గా ఒకరు నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరనే వివరాల్లోకి వెళితే..!
బిగ్ బాస్‌లో 3 రోజులకు రెండున్నర కోట్లు సంపాదించిన ఏకైక కంటెస్టెంట్.. అత్యధిక రెమ్యునరేషన్ ఇదే!
Bigg Boss Contestant Remuneration 2.5 Crore For 3 Days: ఇండియాలో అత్యధిక ప్రజాధారణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా మంచి ఫేమ్‌తోపాటు నెగెటివిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే, ఎలాంటి పేరు వచ్చిన భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ షోలోకి ఎంతోమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తుంటారు.
బిగ్ బాస్ నిఖిల్ రెమ్యునరేషన్
ఇక ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ముగిసిపోయింది. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ మలియక్కల్ గెలుపొందాడు. విజేతగా నిలిచిన నిఖిల్‌కు రూ. 55 లక్షల బిగ్ బాస్ ప్రైజ్ మనీతోపాటు కాస్ట్‌లీ కారు కూడా గిఫ్ట్‌గా అందింది. అలాగే, తన రెమ్యునరేషన్ కూడా కలిపి మొత్తంగా రూ. 62 లక్షల వరకు సంపాదించినట్లు వార్తలు వినిపించాయి.
ఇదంతా 105 రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి ప్రజల మనసు గెలిచినందుకు వచ్చిన సంపాదన. కానీ, బిగ్ బాస్ హౌజ్‌లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండి ఏకంగా రూ. రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా ఒకరు రికార్డ్ క్రియేట్ చేశారు. వారెవరో కాదు కెనడియన్ అమెరికన్ నటి పమేలా అండర్సన్.
మూడు రోజులకు 2.5 కోట్లు
బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న ఏకైక కంటెస్టెంట్‌గా పమేలా అండర్సన్ నిలిచింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం బిగ్ బాస్ హౌజ్‌లో 3 రోజులు ఉండి రూ. 2.5 కోట్లు పారితోషికం అందుకున్నట్లు పమేలా అండర్సన్ చరిత్ర సృష్టించింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ హిందీ 4 సీజన్‌లో (2010) కంటెస్టెంట్‌గా పమేలా అండర్సన్ పాల్గొంది. అయితే, ఆ సీజన్‌లో పమేలా కేవలం మూడు రోజులు మాత్రమే గడిపింది. అందుకే రెండున్నర కోట్ల రూపాయలు వెనుకేసుకుందని బాలీవుడ్ మీడియా వర్గాలు వార్తలు కూడా ప్రచురించాయి.
బిగ్ బాస్ విన్నర్‌కు కోటి
అయితే, బిగ్ బాస్ హిందీ 4 సీజన్ విన్నర్‌గా నిలిచిన శ్వేత తివారికి మాత్రం రూ. 1 క్యాష్ ప్రైజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, రన్నరప్‌గా నిలిచిన ది గ్రేట్ ఖలీ వారానికి రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఆ తర్వాతి స్థానంలో కరణ్‌వీర్ బొహ్రా వారానికి రూ. 20 లక్షలు, బిగ్ బాస్ హిందీ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 9 లక్షలు, వివియన్ డిసేనా (వారానికి రూ.5 లక్షలు), హీనా ఖాన్ (ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు) నిలిచారు.
కాగా, బిగ్ బాస్ హిందీ సీజన్స్‌లో మొదట విన్నర్ ప్రైజ్ మనీ రూ. 1 ఇలా ఉండేది. కానీ, బిగ్ బాస్ హిందీ సీజన్ 6 నుంచి ఆ ప్రైజ్ మనీని తగ్గించేశారు. ఒక్కో సమయంలో ఆ విన్నర్ క్యాష్ మనీ రూ. 30 లక్షలకు కూడా వెళ్లింది. కానీ, ప్రస్తుతం రూ. 50 లక్షలుగా ఉంటోంది.
పమేలా అండర్సన్ సినిమాలు
ఇదిలా ఉంటే, 57 ఏళ్ల పమేలా అండర్సన్ 1990 ఫిబ్రవరిలో వచ్చిన ప్లేబాయ్ ప్లేమేట్ ఆఫ్ ది మంత్ షోతో పాపులర్ అయింది. ఆ తర్వాత స్కూబీ డూ, బేవాచ్, స్కేరీ మూవీ 3, స్నాప్ డ్రాగన్, బార్బ్ వైర్, నేకెడ్ సోల్స్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది పమేలా అండర్సన్. ది లాస్ట్ షోగర్ల్ మూవీలో పమెలా అండర్సన్ చివరిసారిగా నటించింది.
టాపిక్