తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu : రెండు గోలీలు వేసుకో.. డాక్టర్ బాబుకు రైతు బిడ్డ కౌంటర్ల మీద కౌంటర్లు

Bigg Boss 7 Telugu : రెండు గోలీలు వేసుకో.. డాక్టర్ బాబుకు రైతు బిడ్డ కౌంటర్ల మీద కౌంటర్లు

Anand Sai HT Telugu

21 November 2023, 7:09 IST

google News
    • Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు ఈ వారం నామినేషన్స్ ఆసక్తిగా జరిగాయి. గతవారం జరిగిన కెప్టెన్సీ, ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులపైనే నామినేషన్స్ ఎక్కువగా పడ్డాయి.
బిగ్ బాస్ నామినేషన్స్
బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ నామినేషన్స్

Bigg Boss 7 Telugu Nominations : బిగ్ బాస్ 7 తెలుగు(Bigg Boss 7 Telugu) తాజా ఎపిసోడ్లో నామినేషన్స్ ఆసక్తిని రేకెత్తించాయి. మెుత్తం హౌజ్‍లో 10 మంది ఉన్నారు. కెప్టెన్ అవ్వాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్లో నామినేషన్స్ ఎక్కువగా కెప్టెన్సీ టాస్కులు, ఎవిక్షన్ పాస్ చుట్టే తిరిగాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన అమర్‍దీప్.. యావర్, రతికను నామినేట్ చేశాడు. ఫౌల్ గేమ్ ఆడినందుకు యావర్ ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని యావర్ మాత్రం ఒప్పుకోలేదు. అది నీ తప్పు కదా అంటూ ప్రశ్నించాడు. రతికా ఇంకా గేమ్స్ ఆడాలని నామినేట్ చేశాడు. ఈ సమయంలో యావర్ కూడా మధ్యలోకి వచ్చాడు. దీంతో పెద్ద వాగ్వాదం జరిగింది.

రతికా వచ్చి రివర్స్ నామినేషన్ వేసింది. అమర్‍దీప్‍ను నామినేట్ చేసింది. ఏవేవో కారణాలు చెప్పుకొచ్చింది. రతిక చెప్పిన కారణాలను పట్టించుకోకుండా అమర్ వింటూ ఉన్నాడు. చాలాసేపు రతికా చెప్పే కారణాలు విన్న తర్వాత అందరితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడకు అని అమర్ అన్నాడు. దీంతో రతికా సీరియస్ అయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావని పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసింది. ఈ విషయాన్ని యావర్‍తో కూడా చెప్పించే ప్రయత్నం చేసింది. నామినేషన్స్ మధ్యలోకి వేరే వాళ్ల పేరు తీసుకురావద్దొని శివాజీ సలహా ఇవ్వడంతో రతికా సైలెంట్ అయిపోయింది.

గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ ఆసక్తిగా సాగాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకుడిగా ప్రశాంత్ తప్పులు చేశాడని పేర్కొన్నాడు. ఆ టాస్కులో యావర్, శివాజీ.. ఇద్దరూ రూల్స్ బ్రేక్ చేశారని తెలిపాడు. తప్పు చేయలేదని, యావర్, శివాజీ వాదించారు. ఇలా గౌతమ్ నామినేషన్స్ సమయంలో వీరిద్దరూ చాలాసేపు జోక్యం చేసుకున్నారు. అయితే ప్రశాంత్ మాత్రం.. సంచాలకుడిగా తాను చేసింది తప్పు అయితే నాగార్జున చెప్పేవారని గట్టిగా వాదించాడు. అసలు పాయింటే లేదు.. అంటూ కామెంట్స్ చేశాడు.

నువ్వు ఆట చూడకుండా సినిమా చూస్తున్నావా అని ప్రశ్నించాడు గౌతమ్.. నేనేం టీవీలో చూడలేదు అని కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. ఇలా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. వీరిమధ్య నామినేషన్ చాలా సేపు జరిగింది. రెండో నామినేషన్‍గా శివాజీకి వేశాడు గౌతమ్.

ఇక పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు అదే పద్ధతిని కంటిన్యూ చేశాడు. రివర్స్ నామినేషన్ వేశాడు. కెప్టెన్సీ టాస్కులో తాను ఒడిపోయేందుకు గౌతమ్ ముఖ్యకారణమని చెప్పాడు. దీంతో గౌతమ్ వెళ్లి కూర్చొన్నాడు. కారణం నచ్చలేదని చెప్పాడు. ప్రశాంత్ గట్టిగా మాట్లాడేసరికి.. గౌతమ్ కూడా కౌంటర్లు వేయడం మెుదలుపెట్టాడు. గట్టిగా అరిచాడు. గౌతమ్ ది సేఫ్ గేమ్ అనడంతో సీరియస్ అయ్యాడు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పాడు గౌతమ్. ఎక్కువ తక్కువ మాట్లాడితే చూసేందుకు ఎవరూ లేరని చెప్పాడు. దీంతో రెండు గోలీలు వేసుకో తక్కువైతది అని కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. దీంతో ప్రొఫేషన్ తీసుకురాకు అని అన్నాడు గౌతమ్. తాను డాక్టర్ల గురించి తీయలేదని చెప్పాడు. పంచెకట్టు విషయంలోనూ గౌతమ్ గొడవకు దిగాడు. తర్వాత రతికాను నామినేట్ చేశాడు ప్రశాంత్.

అర్జున్ మాత్రం కూల్‍గా నామినేషన్స్ కంప్లీట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ తనకు దక్కపోవడానికి యావర్ ఆడిన గేమ్ కారణమని చెప్పి నామినేట్ చేశాడు. టాస్కులో యావర్ ను శివాజీ డిస్టర్బ్ చేశాడని నామినేషన్ వేశాడు. ఇక అశ్వినీ వచ్చి చెప్పేందుకు పాయింట్స్ లేవని సెల్ఫ్ నామినేషన్ వేసుకుంది. మిగిలిన వారి నామినేషన్స్ తర్వాతి ఎపిసోడ్లో ఉండనున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం