Bigg Boss Sivaji: హీరో శివాజీని గట్టిగా ఇరికించిన అర్జున్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!
Bigg Boss 7 Telugu Today Episode: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో హీరో శివాజీని గట్టిగా ఇరికించాడు అర్జున్ అంబటి. ఇంతకాలం నీతులు చెబుతూ వచ్చిన శివాజీ అసలు రూపాన్ని హౌజ్ మేట్స్ ముందు ఎక్స్ పోజ్ చేశాడు. ఇదంతా బిగ్ బాస్ తెలుగు 12వ వారం నామినేషన్లలో జరిగింది.
Bigg Boss Telugu November 20th Episode: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం ఎలిమినేషన్ లేకపోవడంతో హౌజ్‌లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఇక ఎలిమినేషన్ తర్వాత ఉండేది నామినేషన్ల ప్రక్రియ. ఎంత బాగుండి, క్లోజ్‌గా మాట్లాడుకున్నప్పటికీ నామినేషన్స్ వస్తే చాలు కంటెస్టెంట్స్ రెచ్చిపోతారు. ఇతరులు నెగెటివ్ పాయింట్స్ చెబుతూ నామినేట్ చేస్తారు.
శివాజీని నామినేట్
అలాగే, బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం నామినేషన్ల ప్రక్రియ సాగనున్నట్లు నవంబర్ 12వ తేది ఎపిసోడ్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. బాగా ఆకలిగా ఉన్న సింహం నోట్లో కంటెస్టెంట్ల ఫొటోతో ఉన్న చికెన్ ముక్కలను పెట్టి వారిని నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. అలాగే హౌజ్ మేట్స్ పాటించారు. ఈ క్రమంలోనే వచ్చి హీరో శివాజీని నామినేట్ చేశాడు అర్జున్ అంబటి.
సంచాలక్‌గా శోభా
బాణం టాస్క్ రౌండ్‌లో యావర్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అప్పటికీ బజర్ మోగలేదు. థర్డ్ బాల్‌లోనే ఉన్నాడు. అప్పుడు మీరు గట్టిగా అరిచారు. అప్పుడు వాడు (ప్రిన్స్ యావర్) కూడా డిస్టర్బ్ అవుతాడు కదా అని శివాజీకి చెబుతూ అర్జున్ అంబటి నామినేట్ చేశాడు. దానికి శివాజీ నవ్వేశాడు. అయితే, ఫ్రీ ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన పోటీల్లో బాణం టాస్క్ ఒకటి. ఆ టాస్క్ కు సంచాలక్‌గా ఉన్నా శోభా వాళ్లు గేమ్ ఆడేటప్పుడు రూల్స్ గురించి అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పింది.
కోప్పడిన శివాజీ
శోభా గట్టిగా చెప్పడంతో డిస్టర్బ్ అయిన శివాజీ బాల్స్ పక్కన పడేసి ఎందుకు అలా అరుస్తావ్. డిస్టర్బ్ అవుతాం అని కోప్పడ్డాడు. అప్పుడు శోభాకు, శివాజీ గట్టి ఫైటే జరిగింది. ఈ ఫైట్ తర్వాత ఫ్రీ ఎవిక్షన్ పాస్ యావర్‌కు వచ్చింది. అంతా అయ్యాక తాను అరిచింది యావర్ కోసం, నా కోసం కాదు అని శివాజీ కవర్ చేస్తూ శోభాకు చెప్పాడు. నిజానికి శివాజీ తనకోసం అరిచిన యావర్ కోసం అని చెప్పాడు.
రెండు పాయింట్లతో
ఇప్పుడు నామినేషన్ సమయంలో అదే పాయింట్‌ను ఎత్తిచూపాడు అర్జున్. శోభా అరిచినప్పుడు యావర్ డిస్టర్బ్ అయితే మీరు అరిచిన అవుతాడు కదా అన్నది అర్జున్ పాయింట్. అలాంటప్పుడు మీరు యావర్‌కు సపోర్టుగా మాట్లాడలేదు, మీకోసమే అరిచారు అని ఒక పాయింట్ ఎత్తి చూపుతూనే.. మరోవైపు ఇతరులు అరిస్తే కోప్పడే మీరు కూడా మీ వంతు వచ్చేసరికి కోప్పడ్డారు అని మరో పాయింట్ చెప్పాడు. అంటే ఒక నామినేషన్‌తో రెండు రకాలుగా శివాజీని ఎక్స్ పోజ్ చేసి దెబ్బ కొట్టాడు అర్జున్.