Bigg Boss Telugu: శివాజీ అబద్ధాలు.. కప్పిపుచ్చిన నాగార్జున.. పాపం పిచ్చోడైన గౌతమ్
Bigg Boss Telugu Sivaji Vs Gautham: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ కంటెస్టెంట్ శివాజీని హోస్ట్ నాగార్జున సపోర్ట్ చేస్తున్నారని నవంబర్ 4వ తేది ఎపిసోడ్‌లో మరోసారి అర్థమైంది. దాంతో శివాజీపై కంప్లైంట్ చేసిన గౌతమ్ కృష్ణను మొత్తానికి పిచ్చోడిని చేసినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu November 4th Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 4వ తేది శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జునతోపాటు హీరో కార్తీ వచ్చి సందడి చేశాడు. తర్వాత కంటెస్టెంట్ల ఆట తీరుపై బంగారం, మట్టి, బొగ్గు విభాగాలతో రివ్యూ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లో టాస్కుకు సంబంధించి తనతో తేల్చుకుంటానన్న టేస్టీ తేజను నాగార్జున అడిగారు. చెప్పు తేజ నాతో తేల్చుకునేది ఏంటని అడిగాడు నాగ్.
స్ట్రాటజీ అంటూ
తేల్చుకోవడం కాదు సార్.. తెలుసుకోవాలనుకుంటున్నా. టాస్కులో సాధించిన బాల్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. మేం వాటిని దొంగలిస్తాం అని అంటే.. పెద్దాయన శివాజీ అలా చేయడం తప్పు, దుర్మార్గం, ఫౌల్ గేమ్, ఎథిక్స్ అంటూ మాట్లాడారు అని తేజ జరిగింది చెప్పాడు. శివాజీ నీ అపోనెంట్ టీమ్ కదా. అది ఆయన స్ట్రాటజీ. ఫౌల్స్ అనడం, వాళ్ల బాల్స్ కాపాడుకునేందుకు వాడిని స్ట్రాటజీ. మీ టీమ్ వాళ్లు అలా చెబితే వినాలి కానీ, అవతలి టీమ్ వాళ్లు చెబితే ఎలా నమ్ముతావ్ తేజ అని నాగార్జున అన్నాడు.
క్యారెక్టర్ ఉండాలంటూ
నాగార్జున చెప్పిన దానికి శివాజీవైపు తేజ చూస్తే.. అవును, నేను స్ట్రాటజీ ప్లే చేశాను అని చెప్పాడు. నా స్ట్రాటజీలో బలి అయ్యారు అన్నట్లుగా శివాజీ ఫన్నీగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టాడు. అయితే, నిజానికి టాస్క్ సమయంలో మాత్రం శివాజీ స్ట్రాటజీ ప్లే చేయలేదు. నిజంగానే అలా దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. క్యారెక్టర్ చూస్తారు. బిగ్ బాస్ చెబుతాడు. మనకు క్యారెక్టర్ ఉండాలంటూ నిజంగానే తేజ, గౌతమ్‌తో వాదనకు దిగాడు. గౌతమ్‌ని అయితే, నువ్ డాక్టర్‌వి, ఎథిక్స్ ఉండాలంటూ వృత్తిని కూడా లాగాడు శివాజీ.
వెర్రి పప్ప అయ్యావ్‌గా
కానీ, శివాజీ చేసినదాన్ని నాగార్జున కప్పిపుచ్చుతు స్ట్రాటజీ వాడడంటూ సపోర్ట్ చేశాడు. దానికి అవును అని శివాజీ అబద్ధంతో కంటిన్యూ చేశాడు. అసలు ఈ విషయంలో తేజను వెర్రి పప్ప అయ్యావ్‌గా అని నాగార్జున అన్నాడు. కానీ, నిజానికి ఈ టాస్క్ విషయంలో ఎక్కువగా గొడవకు దిగింది గౌతమ్. తేజను అంటూనే ఇన్ డైరెక్టుగా గౌతమ్‌ను పిచ్చోడిని చేశారు. ఇదే కాకుండా శివాజీ తనను టార్గెట్ చేస్తున్నాడని, మాటలు మారుస్తున్నాడని గౌతమ్ కన్ఫెషన్ రూమ్‌లో నాగార్జునకు ఫిర్యాదు చేశాడు.
గౌతమ్‌దే తప్పుంటూ
ఆ విషయంలో కూడా శివాజీ తనను టార్గెట్ చేయలేదని, ఒక టీమ్ మొత్తం తీసుకున్న నిర్ణయమంటూ చెప్పారు. ఇందులో నిజముంది. కానీ, గత వారం ప్లే చేసిన ఓ వీడియోలో ఎవరినో కొట్టే వెళ్తానని శివాజీ అన్నాడు. దాని గురించి నాగార్జున అడిగితే తనను తానే కొట్టుకుని వెళ్తానని అబద్దం చెప్పాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ గౌతమ్ చెప్పాడు. కానీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. గౌతమ్ అందరిని ఇన్ల్ఫ్యూయెన్స్ చేస్తున్నాడని, నీదే తప్పు అని నాగార్జున చెప్పాడు. దీంతో గౌతమ్ పిచ్చోడై సైలెంట్‌గా ఉండిపోయాడు.