Bigg Boss 7 Telugu : నామినేషన్లలో రతికా అరుపులు.. ఇదేదో మెుదటి నుంచి ఉంటే అయిపోవు కదా-bigg boss 7 telugu rathika rose nominates priyanka shobha shetty and her strategy change in nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu : నామినేషన్లలో రతికా అరుపులు.. ఇదేదో మెుదటి నుంచి ఉంటే అయిపోవు కదా

Bigg Boss 7 Telugu : నామినేషన్లలో రతికా అరుపులు.. ఇదేదో మెుదటి నుంచి ఉంటే అయిపోవు కదా

Anand Sai HT Telugu
Nov 14, 2023 07:03 AM IST

Bigg Boss 7 Telugu Nominations : బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ నామినేషన్స్ ఆసక్తిగా సాగాయి. రతికా రోజ్ తన రూటు మార్చింది. కాస్త కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

బిగ్ బాస్ 7 తెలుగు
బిగ్ బాస్ 7 తెలుగు (star maa)

ఎప్పటిలాగే సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ఆసక్తిగా మెుదలైంది. అయితే ఈసారి రతికా రోజ్(Rathika Rose) ఎక్కువగా మాట్లాడింది. దీనికి కారణం కూడా ఉంది. నామినేషన్ వేసే పాయింట్ బలంగా ఉండాలని శివాజీ ముందే ట్రైనింగ్ ఇచ్చాడు. నువ్ ఏం చేస్తావో తెలియదు.. కంటెంట్ ఇవ్వాలని చెప్పాడు. దీంతో అదేవిధంగా తాజా ఎపిసోడ్లో రతికా చాలా సేపు కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

నామినేషన్స్ మెుదలుకాగానే రతికాను బిగ్ బాస్(Bigg Boss) పిలిచాడు. మెుదట్లో కాస్త ఆలోచించింది రతికా. నామినేషన్ వేసేందుకు ఒకరే ఉన్నారని చెప్పింది. కానీ తర్వాత మెుదలుపెట్టింది. మెుదట శోభా శెట్టి(Shobha Shetty)ని నామినేట్ చేసింది. కెప్టెన్‍గా ఎంపికై నువ్ చేసింది ఏమీ లేదని శోభాకు కౌంటర్ ఇచ్చింది. లగ్జరీ రూమ్ ఎంజాయ్ చేశావని చెప్పుకొచ్చింది. నేను సరిగా చేశానని శోభా చెప్పింది కానీ.. రతికా గట్టి గట్టిగా అరిచింది. అంతకుముందు నామినేషన్లు సైలెంట్‍ వేసే రతికా ఈసారి మాత్రం విశ్వరూపం చూయించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ అరుస్తూ సమాధానం చెప్పే శోభా.. ఈసారి చాలా సైలెంట్ అయిపోయింది. తర్వాత ప్రియాంకను నామినేట్ చేసింది రతికా. రాజమాతలుగా మీరు చేసింది కరెక్ట్ గా లేదని చెప్పుకొచ్చింది. మా నిర్ణయాలకు విలువ ఇవ్వలేదని తెలిపింది. మీకు మాట్లాడటం రావట్లేదని, అందుకే మేమే నిర్ణయం తీసుకున్నామని ప్రియాంక చెప్పుకొచ్చింది.

తర్వాత అర్జున్ నామినేషన్స్ వేశాడు. పల్లవి ప్రశాంత్‍(Pallavi Prashanth) టార్గెట్ చేశాడు. అయితే ఇందులో పాయింట్ మాత్రం పెద్దగా కనిపించలేదు. నువ్ ఇండివిడ్యూలిటీ కోల్పోతున్నావని తెలిపాడు. శివాజీ చెప్పినట్టుగానే ఆడుతున్నావని చెప్పాడు. నిన్ను ఎవరైనా నామినేట్ చేస్తే.. వారినే నామినేట్ చేస్తున్నావని చెప్పుకొచ్చాడు. నువ్ ఒక్కడివే ఆడాలని అన్నాడు. దీంతో ప్రశాంత్‍ వాదనకు దిగాడు. తర్వాత కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యావని శోభాను అర్జున్ నామినేట్ చేశాడు.

తర్వాత నామినేషన్స్ వేసేందుకు ప్రియాంక వచ్చింది. రతికా, అశ్వినీని నామినేట్ చేసింది. రతికాను అసలు నువ్ తీసుకునే పాయింట్స్ కరెక్టుగా లేవని తెలిపింది. నీకు ఏం మాట్లాడాలో తెలియదని చెప్పింది. రతికా వాదిస్తుంటే.. నాగ్ సార్ తో చెప్పాల్సింది ఈ పాయింట్లు అని ప్రియాంక అంది. నాగార్జున హోస్ట్.., హౌస్ మేట్ కాదు.. అని రతికా అరిచింది. మహారాణుల టాస్కులో మీరే బిగ్ బాస్‍కు మహారాణులుగా చేశారని కామెంట్స్ చేసింది రతికా. తర్వాత అశ్వినీని ప్రియాంక నామినేట్ చేసింది. ఏడుపు గురించి తీసింది. అది నా ఎమోషన్ అని అశ్వినీ చెప్పింది. భోలే హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో మీతో వచ్చేస్తాను అని అన్నావు అని, అది నాకు నచ్చలేదని ప్రియాంక చెప్పింది. ఆ విషయం రీజన్‍గా చెప్పి నామినేషన్స్ వేయడం కరెక్ట్ కాదని అశ్వినీ అరిచింది. ఈ విషయంపై చాలాసేపు వాగ్వాదం జరిగింది.

ఎప్పుడూ లేనివిధంగా.. ఈసారి గౌతమ్ నామినేషన్స్ త్వరగా కంప్లీట్ చేశాడు. అర్జున్, అమర్‍ను నామినేట్ చేశాడు.

Whats_app_banner