Bigg Boss Bhole Elimination: సింగర్ భోలే ఎలిమినేట్.. ఆమె కోసం పాటబిడ్డను బలి చేసిన బిగ్ బాస్
Bigg Boss 7 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. పదో వారం సింగర్ భోలే ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.
Bigg Boss Bhole Shavali Elimination: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో పదో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే అనేకసార్లు అనూహ్య ఎలిమినేషన్స్ జరగ్గా తాజాగా మరొకటి చేరింది. ఆడియెన్స్ ఓట్లతో సంబంధం లేకుండా తమకు నచ్చిన కంటెస్టెంట్లని హౌజ్‌లో ఉంచి వారికి బదులు ఇంకొకరిని బలి చేస్తున్నాడు పెద్దయ్య బిగ్ బాస్. బిగ్ బాస్ 7 తెలుగు 10 వారం సింగర్ భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.
సింగర్ భోలే షావలి ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శనివారం నాడు పూర్తి అయింది. అంతేకాకుండా బిగ్ బాస్ బజ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే, పదో వారం నామినేషన్‌లో ఉన్న భోలేకు సోమవారం నుంచి బాగానే ఓటింగ్ పడుతూ వచ్చింది. హౌజ్‌లోకి పాటబిడ్డగా అడుగు పెట్టిన సింగర్ భోలే ఓటింగ్‌లో మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలుస్తూ వచ్చాడు. అందరికంటే చివరి స్థానంలో బిగ్ బాస్ ముద్దుబిడ్డ రతిక రోజ్ ఉంటూ వచ్చింది.
ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న రతికకు బదులు సింగర్ భోలేను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. కేవలం రతిక రోజ్‌ను హౌజ్‌లో ఉంచేందుకే భోలేను ఎలిమినేట్ చేసి పంపించారు. ఇలా ఇదివరకు శోభా శెట్టిని సేవ్ చేసేందుకు నయని పావని, ఆట సందీప్ వంటి ప్లేయర్స్ ను బలి చేశారు. ఈసారి రతిక కోసం భోలేను బలి చేశాడు బిగ్ బాస్. ఇక సింగర్ భోలే హౌజ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, హౌజ్‌లో ఆయన టాలెంట్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
బిగ్ బాస్ హౌజ్‌లో అప్పటికప్పుడు పాటకు ట్యూన్ కట్టి పాడి అందరిని ఆశ్చర్యపరిచేవాడు సింగర్ భోలే. దానిపై నాగార్జున సైతం మెచ్చుకున్నారు. గత వారం కార్తీపై పాట పాడితే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటితోపాటు సింగర్ భోలే కెరీర్ స్టార్ట్ చేశాడు. కిక్ 2 మూవీలో అమ్మీ అనే పాట పాడింది భోలేనే. ఆయనకు పోక్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా మంచి పేరు ఉంది. ఇక ఇటీవల అయితే కష్టపడ్డా.. లవ్ లో పడ్డా అనే పాట చాలా పాపులర్ అయింది.