Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్ అబద్ధాలు.. బయటపెట్టిన సందీప్.. డేంజర్ జోన్‍లో ఆ ఇద్దరు
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్‍లో సోమవారం నామినేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.
Bigg Boss 7 Telugu Latest Episode : బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season) నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ నడుమ మాటల యుద్ధం జరిగింది. అంతకుముందు శివాజీని యాక్టివిటీ రూమ్‍లోకి పిలిచాడు బిగ్ బాస్. చేయి గురించి ఆరా తీశాడు. కాసేపు బయటకు వచ్చి.. స్కానింగ్ తీయించుకోవాలని చెప్పాడు. ఇదే విషయం హౌస్ మేట్స్ అందరికీ చెప్పాలని తెలిపాడు. శివాజీ వెళ్లి ఇదే విషయంపై చెప్పగా ... అందరూ శివాజీ వెళ్లిపోతున్నాడేమో అనుకున్నారు. కానీ స్కానింగ్ అయిపోయాక మళ్లీ వచ్చాడు శివాజీ.
కెప్టెన్ యావర్ కు వీఐపీ రూమ్ కేటాయించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో ఇద్దరినీ డిప్యుటీలుగా ఎంచుకోవాలని తెలుపగా.. శివాజీ, సందీప్ ను తీసుకున్నాడు యావర్. వారు కూడా వీఐపీ రూమ్ లో నిద్రపోతారు. స్పైట్ కూలర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వారం ఎవరు ఎక్కడ నిద్రపోవాలో, రేషన్ సరిపడేలా చూసుకోవడంలో యావర్‍తో పాటు శివాజీ, సందీప్ నిర్ణయాలు తీసుకుంటారు.
తర్వాత నామినేషన్స్ హంగామా జరిగింది. మెుదట పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)ను బిగ్ బాస్ పిలిచాడు. సందీప్‍ను నామినేట్ చేస్తూ.. తనకు కెప్టెన్‍గా ఉన్నప్పుడు సరైన గౌరవం ఇవ్వాలేదని కారణం చెప్పాడు. తర్వాత టేస్టీ తేజను నామినేట్ చేశాడు ప్రశాంత్. సందీప్ వంతు వచ్చినప్పుడు ప్రశాంత్ ను నామినేట్ చేయగా.. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. సందీప్ తనను ఊరోడు అన్నాడని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
నేను అనలేదని సందీప్ వాదించాడు. దీంతో నువు నమ్మే నేల మీద ఒట్టేసి చెప్పమని ప్రశాంత్ ను అడిగాడు సందీప్. నేను వెయ్యనని ప్రశాంత్ చెప్పగా.. తనకు ఇష్టమైన డ్యాన్స్ మీద, నేల మీద ఒట్టేసి.. నేను ప్రశాంత్ ను ఊరోడు అనలేదని సందీప్ క్లారిటీ ఇచ్చాడు. తర్వాత ఊరోడు అని నువ్ అన్నట్టుగా నేను అనలేదని ప్రశాంత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ శివాజీ మాత్రం అన్నావని తెలిపాడు. దీంతో ప్రశాంత్ అందరి ముందు సైలెంట్ కావాల్సి వచ్చింది.
నామినేషన్స్ సందర్భంగా భోలే, అశ్వినీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అందరూ దాదాపు సేమ్ రీజన్ చెప్పి ఈ ఇద్దరినీ నామినేట్ చేశారు. భోలే ఏదో వెటకారం చేయబోతే.. ప్రియాంక గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇక అశ్వినీని ఎక్కువ మంది టార్గెట్ చేశారని బాధలో ఉంది. ఏడుపు కూడా మెుదలుపెట్టింది.
వీరిద్దరి తర్వాత పల్లవి ప్రశాంత్‍కు ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. తనను నామినేట్ చేసినందుకు టేస్టీ తేజ కూడా ప్రశాంత్‍ను నామినేట్ చేశాడు. శోభా శెట్టి(Shobha Shetty), శివాజీ, యావర్, అశ్వినీ, భోలే, గౌతమ్ నామినేషన్స్ చేయాల్సి ఉంది. ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో కింద చూడండి.
పల్లవి ప్రశాంత్ - సందీప్, టేస్టీ తేజ
అమర్ దీప్ - భోలే, అశ్వినీ
పూజా మూర్తి - భోలే, అశ్వినీ
సందీప్ - భోలే, పల్లవి ప్రశాంత్,
అర్జున్ - భోలే, అశ్వినీ
ప్రియాంక - అశ్వినీ, భోలే
టేస్టీ తేజ - పల్లవి ప్రశాంత్