Hero Sivaji Wife: బిగ్ బాస్‌లోకి హీరో శివాజీ భార్య, చిన్న కొడుకు.. శోభాను ఆంటీ అన్న రిక్కీ
Sivaji Family At Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 తెలుగులో నేడు దివాళీ సంబురాలు జరగనున్నాయి. అందుకోసం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతోపాటు సెలబ్రిటీలను దించారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజీ పైకి హీరో శివాజీ భార్య శ్వేత, చిన్న కొడుకు రిక్కీ వచ్చారు.
Bigg Boss Telugu November 12th Episode Promo: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో పదో వారం ఫ్యామిలీ వీక్ జరిగింది. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ హౌజ్‌లోకి వచ్చి హౌజ్ మేట్స్ ల్లో జోష్ నింపారు. అందులో మొదటగా హీరో శివాజీ పెద్ద కొడుకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. పెద్ద కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో దివాళీ సెలబ్రేషన్స్ జరగున్నాయి.
దీపావళి పండుగ సందర్భంగా బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్లకు సపోర్ట్ చేసేందుకు సినీ సెలబ్రిటీలతోపాటు వారి కుటుంబ సభ్యులను దింపారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే హీరో శివాజీ భార్య, చిన్న కొడుకు రిక్కీ స్టేజీపైకి వచ్చారు. అది చూసి శివాజీ చాలా సంతోషించాడు. అస్సలు ఫోన్‌లో కూడా కాంటాక్ట్ లేకుండా ఇన్ని రోజులు ఉండలేదు అని నాగార్జునతో శివాజీ భార్య శ్వేత చెప్పారు. తర్వాత భోలే అన్నా అని రిక్కీ పిలిస్తే.. అన్న కాదురా బాబాయ్ అని శివాజీ అన్నాడు.
ఆయన హీరో నాన్నా.. హీరో అని రిక్కీ అన్నాడు. దాంతో హేయ్.. అని శివాజీ గట్టిగా అరిస్తే.. నాగార్జునతోపాటు అంతా నవ్వారు. శోభా ఆంటీ ఎక్కడున్నారు అని రిక్కీ అనడంతో.. ఆమె షాక్ అయి మొహం మాడ్చుకుంది. అక్క అని శివాజీ భార్య రిక్కీకి చెప్పింది. దాంతో అంతా నవ్వేశారు. రిక్కీకి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కదా శివాజీ అని నాగార్జున అన్నాడు. నా మీద ఇంట్లో జోకులు వేసేది వాడే అని శివాజీ చెప్పాడు.
అనంతరం నన్ను చూడవా అని శివాజీని శ్వేత అన్నారు. ఇంతవరకు నా వైఫ్ ఎవ్వరికీ తెలియదు అని శివాజీ చెప్పాడు. తర్వాత నాన్న.. నువ్ ఎంత పెద్ద హీరోవో నాకు తెలియదు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో శివన్న ఉన్నాడు. బయటకు వచ్చేస్తా అని ఇంకోసారి నీ నోట్లో నుంచి మాట రావొద్దు అని రిక్కీ చెప్పాడు. దానికి శివాజీ ఎమోషనల్ అయ్యాడు. దాంతో శివాజీ ఎప్పుడైన అనుకున్నావా రిక్కీ వచ్చి నీకు సలహాలు ఇస్తాడని నాగార్జున అన్నాడు. అస్సలు అదే బాబుగారూ నాకు ఆశ్చర్యంగా ఉంది అని శివాజీ నవ్వుతూ అన్నాడు.