Pallavi Prashanth Bigg Boss: ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్.. తండ్రిని ఎత్తుకున్న రైతుబిడ్డ: ఎమోషనల్ వీడియో-pallavi prashant lifts his father and gets emotional in bigg boss telugu 7 house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pallavi Prashanth Bigg Boss: ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్.. తండ్రిని ఎత్తుకున్న రైతుబిడ్డ: ఎమోషనల్ వీడియో

Pallavi Prashanth Bigg Boss: ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్.. తండ్రిని ఎత్తుకున్న రైతుబిడ్డ: ఎమోషనల్ వీడియో

Pallavi Prashanth - Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ హౌస్‍లోకి అతిథిగా పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. దీంతో ప్రశాంత్ ఎమోషనల్ అయ్యారు. తండ్రి కాళ్లకు నమస్కరించారు. ఆనందంతో ఆయనను ఎత్తుకున్నారు.

Pallavi Prashanth Bigg Boss: ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్.. తండ్రిని ఎత్తుకున్న రైతుబిడ్డ: ఎమోషనల్ వీడియో

Pallavi Prashanth - Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍ తెలుగు 7వ సీజన్‍లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఈ సందర్భంగా హౌస్‍ ఎమోషనల్ అవుతోంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అతిథుగా హౌస్‍లోకి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా కంటెస్టెంట్లు భావోద్వేగానికి గురవుతున్నారు. నేటి (నవంబర్ 10) ఎపిసోడ్‍లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్‍లో రానున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

ముందుగా పల్లవి ప్రశాంత్ కోసం బిగ్‍బాస్ బంతిపూలు పంపించారు. ఆ తర్వాత ‘బాబూ.. బంగారం’ అంటూ బిగ్‍బాస్‍ హౌస్‍లోకి పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. దీంతో తన తండ్రికి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు ప్రశాంత్. ఒక్కసారిగా ఏడ్చేశారు. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. “ఎన్ని నెలలు అయింది రా.. నిన్ను చూడక” అంటూ ప్రశాంత్ తండ్రి కూడా కన్నీరు పెట్టుకున్నారు. శివాజీ, అమర్ దీప్‍ను కూడా ఆయన కౌగిలించుకున్నారు.

“నాన్న బిగ్‍బాస్‍లోకి వచ్చాడు” అంటూ తండ్రిని ఎత్తుకున్నారు పల్లవి ప్రశాంత్. సంతోషం వ్యక్తం చేశారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యారు. తగ్గేదెలేదు అంటూ పల్లవి ప్రశాంత్ తండ్రి డైలాగ్ చెప్పారు. తన కొడుకును బాగా చూసుకుంటున్న శివాజీకి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

'అందరూ కలిసి మెలిసి ఉండండి, కొట్లాడకండి' అని కంటెస్టెంట్లకు పల్లవి ప్రశాంత్ తండ్రి చెప్పారు. ఇక, నాన్నకు గోరు ముద్దలు తినిపించి సంబరపడ్డారు ప్రశాంత్. “నేను చచ్చినా.. బతికినా వీడితోనే” అని ప్రశాంత్‍ను చూపిస్తూ ఆయన తండ్రి చెప్పారు. దీంతో మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రశాంత్.

“టాలెంట్ ఉపయోగించుకో. నువ్వు ఏడ్వకు. అమ్మ ఏడుస్తోంది. అమ్మకు బీపీ పెరుగుతుంది” అని ప్రశాంత్‍తో ఆయన తండ్రి చెప్పారు. చివర్లో సరదాగా తొడకొట్టారు ప్రశాంత్ తండ్రి. ఇలా ప్రోమోనే చాలా ఎమోషనల్‍గా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు నేటి ఎపిసోడ్‍లో ప్రసారం కానున్నాయి. ప్రోమో ఇక్కడ చూడండి.