తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Ott: 25 కోట్ల బ‌డ్జెట్ - రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి వ‌చ్చిన స‌ల్మాన్‌ఖాన్ బావ‌మ‌రిది డిజాస్ట‌ర్ మూవీ

Action OTT: 25 కోట్ల బ‌డ్జెట్ - రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి వ‌చ్చిన స‌ల్మాన్‌ఖాన్ బావ‌మ‌రిది డిజాస్ట‌ర్ మూవీ

22 September 2024, 6:12 IST

google News
  • Action Thriller OTT: స‌ల్మాన్ ఖాన్ బావ‌మ‌రిది ఆయుష్ శ‌ర్మ హీరోగా న‌టించిన రుస్లాన్ మూవీ జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రుస్లాన్ మూవీని టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కేకే రాధామోహ‌న్ నిర్మించాడు. 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 2 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది.

యాక్షన్ మూవీ ఓటీటీ
యాక్షన్ మూవీ ఓటీటీ

యాక్షన్ మూవీ ఓటీటీ

Action Thriller OTT: స‌ల్మాన్ ఖాన్ బావ‌మ‌రిది ఆయుష్ శ‌ర్మ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ రుస్లాన్ ఓటీటీలోకి వ‌చ్చింది. జియో సినిమా ఓటీటీలో రుస్లాన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. య‌క్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి క‌ర‌ణ్ ల‌లిత్ భుటానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ హిందీ మూవీని తెలుగు ప్రొడ్యూస‌ర్ కేకే రాధామోహ‌న్ నిర్మించారు.

జ‌గ‌ప‌తిబాబు మెయిన్ రోల్‌

రుస్లాన్‌ మూవీలో టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సుశ్రీ శ్రేయా మిశ్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సునీల్ శెట్టి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

2 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన రుస్లాన్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇర‌వై ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు ఎక్కువ న‌ష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

రుస్లాన్‌ క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు ఆయుష్ శ‌ర్మ యాక్టింగ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. యాక్ష‌న్ సీన్స్‌లో ప‌ర్వాలేద‌నిపించిన ఎమోష‌న్స్ ప‌రంగా తేలిపోయాడంటూ కామెంట్స్ వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే చాలా థియేట‌ర్ల‌లో ఈ మూవీ క‌నిపించ‌కుండాపోయింది. తొలుత ఈ మూవీకి ఏఎస్‌04 అనే టైటిల్ పెట్టారు. కానీ క‌థానుగుణంగా రుస్లాన్ పేరును ఫిక్స్ చేసి మూవీని రిలీజ్ చేశారు.

రుస్లాన్ క‌థ ఇదే.

రుస్లాన్ (ఆయుష్ శ‌ర్మ‌) త‌ల్లిదండ్రులు చిన్న‌త‌నంలోనే చ‌నిపోతారు. అత‌డిని మేజ‌ర్ స‌మీర్ (జ‌గ‌ప‌తిబాబు) పెంచిపెద్ద‌చేస్తాడు. స‌మీర్‌ను త‌న తండ్రిగా భావిస్తాడు రుస్లాన్‌. అనుకోకుండా మేజ‌ర్ స‌మీర్‌పై టెర్ర‌రిస్ట్ అనే ముద్ర‌ప‌డుతుంది.

తండ్రిపై ప‌డ్డ నింద‌ను తొల‌గించ‌డానికి రుస్లాన్ రా ఏజెంట్‌గా మారాల‌ని ఫిక్స‌వుతాడు. అత‌డి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? స‌మీర్‌పై ఉగ్ర‌వాది అనే ముద్ర వేసింది ఎవ‌రు? రుస్లాన్ రా ఏజెంట్ కాకుండా సీనియ‌ర్ ఆఫీస‌ర్ మంత్ర ఎందుకు అడ్డుకున్నాడు? అన్న‌దే రుస్లాన్ మూవీ క‌థ‌. ప్రొడ్యూస‌ర్ రాధామోహ‌న్ నిర్మించిన ఫ‌స్ట్ హిందీ మూవీ ఇది.

గ‌తంలో తెలుగులో అత‌డు భీమా, ఓదెల రైల్వే స్టేష‌న్‌, బెంగాళ్ టైగ‌ర్‌, పంతంతో పాటు ప‌లు సినిమాలు నిర్మించాడు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, సంప‌త్ నంది కాంబోలో ఓ మూవీ చేస్తున్నాడు.

హ్యాట్రిక్ ఫ్లాప్స్…

హీరోగా హిట్టు అందుకోవాల‌నే ఆయుష్ శ‌ర్మ క‌ల రుస్లాన్‌తో తీర‌లేదు. ల‌వ్ యాత్రి, అంతిమ్ త‌ర్వాత ఆయుష్ శ‌ర్మ హీరోగా న‌టించిన మూడో మూవీ ఇది. అత‌డి గ‌త రెండు సినిమాలు కూడా ఫెయిల్యూర్స్‌గానే నిలిచాయి. రుస్లాన్ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచి ఆయుష్‌కు పెద్ద షాకిచ్చింది.

క‌త్రినాకైఫ్ సిస్ట‌ర్‌...

ప్ర‌స్తుతం ఆయుష్ శ‌ర్మ క్వ‌థా పేరుతో ఓ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాకు కూడా రుస్లాన్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ బుటానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. క్వ‌థా మూవీలో క‌త్రినాకైఫ్ సోద‌రి ఇసాబెల్లే కైఫ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తదుపరి వ్యాసం