Rudrangi OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన జగపతిబాబు రుద్రంగి - మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
Rudrangi OTT Streaming: జగపతిబాబు రుద్రంగి మూవీథియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే...
Rudrangi OTT Streaming: జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి మూవీ మంగళవారం ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా జూలై 7న థియేటర్లలో రిలీజైంది. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇందులో జగపతిబాబుతో పాటు విమలారామన్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలను పోషించారు. రుద్రంగి సినిమాకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో హరీష్‌రావు, బాలకృష్ణతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో రుద్రంటి అంచనాల్ని అందుకోలేకపోయింది. ఫెయిల్యూర్‌గా మిగిలింది.
రుద్రంగి కథేమిటంటే...
రుద్రంగి సినిమాలో భీమ్‌రావ్ దేశ్‌ముఖ్ అనే దొర పాత్రలో జగపతిబాబు నటించాడు. అతడికి ఇద్దరు భార్యలు మీరాబాయి(విమలారామన్), జ్వాలబాయి (మమతా మోహన్‌దాస్ ) ఉంటారు. ఓ రోజు అడవిలో రుద్రంగి అనే అమ్మాయిని చూసిన భీమ్‌రావ్ ఆమెపై మనసు పడతాడు.
రుద్రంగిని తన సొంతం చేసుకునేందుకు భీమ్‌రావ్ ఎలాంటి ఎత్తులు వేశాడు. భీమ్‌రామ్‌ను ఎదురించి పోరాడిన మల్లేష్ (ఆశీష్ గాంధీ) ఎవరు? అతడితో రుద్రంగికి ఎలాంటి సంబంధం ఉందన్నదే ఈ సినిమా కథ. తెలంగాణ గఢీలు, దొరల నేపథ్య కథాంశంతో దర్శకుడు అజయ్ సామ్రాట్ ఈ మూవీని తెరకెక్కించారు. బాహుబలి సినిమాకు అజయ్ సామ్రాట్ రైటర్‌గా పనిచేశాడు.