తెలుగు న్యూస్  /  Entertainment  /  Anjali Fall Web Series To Stream On Disney Plus Hotstar Soon

Anjali fall web series: హార‌ర్ వెబ్‌సిరీస్‌లో అంజ‌లి - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

17 September 2022, 7:01 IST

  • Anjali fall web series: కెరీర్ లో తొలిసారి హారర్ కథాంశంతో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నది అంజలి. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

అంజ‌లి
అంజ‌లి (twitter)

అంజ‌లి

Anjali fall web series: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపుతో పాటు తెలుగులో పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది అంజలి. గత కొన్నాళ్లుగా నవతరం నాయికల పోటీతో హీరోయిన్ గా అంజలికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ లపై దృష్టిసారిస్తోంది. బహిష్కరణ, ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది అంజలి.

ట్రెండింగ్ వార్తలు

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

Thandel OTT Rights: నాగ చైతన్య తండేల్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి.. చైతూ కెరీర్లోనే అత్యధికం

Bigg Boss Priyanka: హైదరాబాద్‌లో భూమి కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. వీడియో అసలు విషయం చెప్పిన వంటలక్క

NNS 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

తాజాగా ఫాల్ పేరుతో మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంజలి. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఇందులో ఇంటెన్స్ రోల్ లో అంజలి కనిపించబోతున్నది. మరో పోస్టర్ లో గాలితో తేలుతూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disneyplus hotstar) ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతునట్లు తెలిసింది.

ఈ సిరీస్ ను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అంజలితో పాటు 7/ జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్, నమితా కృష్ణమూర్తి, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరిని థ్రిల్ చేస్తుందని అంజలి ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం అంజలి తెలుగులో రామ్ చరణ్, శంకర్ (rc15)కలయికలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.