తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Angelina Jolie On Brad Pitt: బ్రాడ్‌ నన్ను గోడకేసి కొట్టాడు.. నా పిల్లల గొంతు పిసికాడు: ఏంజెలినా

Angelina Jolie on Brad Pitt: బ్రాడ్‌ నన్ను గోడకేసి కొట్టాడు.. నా పిల్లల గొంతు పిసికాడు: ఏంజెలినా

HT Telugu Desk HT Telugu

05 October 2022, 12:46 IST

    • Angelina Jolie on Brad Pitt: బ్రాడ్‌ నన్ను బాత్‌రూమ్‌ గోడకేసి కొట్టాడు.. నా పిల్లల గొంతు పిసికాడు అని ఫ్రెంచ్‌ వైనరీ కేసులో తన మాజీ భర్త బ్రాడ్‌ పిట్‌ గురించి కోర్టు పత్రాల్లో చెప్పింది ఏంజెలినా జోలీ.
ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ (ఫైల్ ఫొటో)
ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ (ఫైల్ ఫొటో)

ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ (ఫైల్ ఫొటో)

Angelina Jolie on Brad Pitt: హాలీవుడ్‌ హీరోయిన్‌ ఏంజెలినా జోలీ.. తన మాజీ భర్త, నటుడు బ్రాడ్‌ పిట్‌పై కోర్టులో కౌంటర్‌సూట్‌ దాఖలు చేసింది. అందులో ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. 2016లో ఫ్లైట్‌లో తమ మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఆ కౌంటర్‌సూట్‌లో ఏంజెలినా స్పందిస్తూ.. బ్రాడ్‌ తనపై, తన పిల్లలపై చేయి చేసుకున్నాడని ఆరోపించింది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

తన ఆరుగురి పిల్లల్లో ఒకరి గొంతు పిసికాడని, మరొకరి ముఖంపై గట్టిగా కొట్టాడని ఆమె చెప్పింది. ఇక తనను బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి.. తన తల గట్టిగా పట్టుకున్నాడని, ఆ తర్వాత బాత్‌రూమ్‌ గోడకేసి కొట్టాడని తెలిపింది. తమ ఫ్రెండ్‌ వైనరీలో ఏంజెలినా కొంత భాగాన్ని అమ్ముకోవడంపై బ్రాడ్‌ పిట్‌ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు ఏంజెలినా తన కౌంటర్‌ దాఖలు చేసింది.

బ్రాడ్‌తో తాను ఎందుకు వేరుపడ్డానో ఇందులో వివరించింది. తాము ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందే తన పిల్లల్లో ఒకరితో బ్రాడ్‌ పిట్‌ గొడవపడినట్లు చెప్పింది. "మా కుటుంబం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లకముందే పిట్‌ దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. మా పిల్లల్లో ఒకరితో గొడవ పడ్డాడు. ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన తర్వాత పిట్‌ దగ్గరకు వెళ్లి ఎందుకలా చేశావని జోలీ అడిగింది. దీంతో అతడు ఆమెను తిట్టడం ప్రారంభించాడు. ఆమెను టాయిలెట్‌లోకి లాక్కెళ్లాడు. తల పట్టుకొని గట్టిగా ఊపాడు. తర్వాత బాత్‌రూమ్‌ గోడకేసి కొట్టాడు" అని కౌంటర్‌సూట్‌లో జోలీ తరఫున లాయర్లు కోర్టుకు వెల్లడించారు.

"తన సొంత పిల్లాడిని బ్రాడ్‌ కొట్టడానికి ప్రయత్నించగా వెనుక నుంచి జోలీ అతన్ని పట్టుకుంది. దీంతో బ్రాడ్‌ అలాగే వెనక్కి దూసుకెళ్లి సీటుకేసి జోలీని గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె వెన్ను, మోచేతికి గాయాలయ్యాయి" అని ఆ కౌంటర్‌ సూట్‌లో వివరించింది. ఆ తర్వాత పిల్లలే అందరూ కలిసి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో బ్రాడ్‌ ఒకరి గొంతు నొక్కాడు అని అందులో తెలిపారు.

అయితే ఈ ఆరోపణలపై బ్రాడ్‌ కూడా తన లాయర్‌ ద్వారా స్పందించాడు. జోలీ ఒక్కోసారి ఒక్కోలా ఈ ఘటన గురించి చెబుతోందని, నిరాధార ఆరోపణలు చేస్తోందని అతను అన్నాడు. తాను చేసినదానిని బ్రాడ్‌ అంగీకరించాడని, అయితే చేయనిదానిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోడని స్పష్టం చేశాడు. ఈ కొత్త ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పాడు.

2014లో పెళ్లి చేసుకునే ముందే బ్రాడ్‌ పిట్‌, ఏంజెలినా జోలీ దశాబ్దం పాటు కలిసి ఉన్నారు. అయితే 2016లో జోలీ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2019లో వీళ్లకు విడాకులు మంజూరయ్యాయి. అయితే పిల్లల కస్టడీ, ఆర్థిక అంశాల్లో మాత్రం వీళ్ల మధ్య కోర్టు కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.