Psychological Thriller OTT: ఓటీటీలోకి అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు… ఎందులో అంటే?
04 September 2024, 12:55 IST
Psychological Thriller OTT: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సింబా మూవీలో జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది స్టోరీ, డైలాగ్స్ అందించాడు.
సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీ
Psychological Thriller OTT: జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సింబా మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీతో మురళీ మనోహర్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంపత్ నంది కథ, మాటలు అందించాడు. థియేటర్లలో రిలీజైన నెల తర్వాత సింబా మూవీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 12న ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
పర్యావరణ పరిరక్షణ...
సింబా మూవీలో అనసూయతో పాటు వశిష్ట సింహా, దివి, శ్రీనాథ్ మాగంటి కీలక పాత్రల్లో నటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే మెసేజ్‌కు థ్రిల్లింగ్ అంశాలను జోడించి సంపత్ నంది సింబా కథను రాశాడు. కాన్సెప్ట్ బాగున్నా...స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే విధానం రొటీన్‌గా ఉండటం సింబా యావరేజ్‌గా నిలిచింది. ఇందులో బయోలాజికల్ మెమోరీ అనే కొత్త పాయింట్‌ను దర్శకుడు టచ్ చేశాడు. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న డ్రామాలో ఆసక్తి లోపించింది.
సింబా కథ ఇదే...
అక్షిక (అనసూయ) ఓ స్కూల్ టీచర్. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్యచేస్తుంది. అక్షిక తరహాలోనే జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్), అతడి ప్రియురాలు ఇష్ట(దివి) కూడా ఓ హత్యకు పాల్పడుతారు. చనిపోతున్న వ్యక్తులు బిజినెస్‌మెన్ పార్థకు సంబంధించిన వారు కావడంతో ఈ కేసు మిస్టరీగా మారుతుంది. చివరకు పార్థ తమ్ముడు కూడా అనూహ్య రీతిలో హత్యకు గురవుతాడు.
అక్షిక, ఫాజిల్, ఇష్ట నిజంగానే హంతకులా? వారి మెమోరీని వాడుకుంటూ ఎవరైనా ఈ హత్యలు చేయించారా? ఈ హత్యలకు పురుషోత్తమర్ రెడ్డికి (జగపతిబాబు) ఉన్న సంబంధం ఏమిటి? పార్థ మనుషులనే ఎందుకు టార్గెట్ చేశారు అన్నదే ఈ మూవీ కథ.
జగపతిబాబు హీరో...
సింబా మూవీలో మొదటి నుంచి జగపతిబాబు హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ అతడిది సినిమాలో గెస్ట్ పాత్రకావడంతో ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. అనసూయ నటన బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. సింబా మూవీలో సీనియర్ హీరోయిన్లు గౌతమి, కస్తూరి కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో ఈ మూవీ కోటి రూపాయల లోపే వసూళ్లను రాబట్టి నిరాశపరిచింది. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించాడు.
పుష్ప 2, ఆరి...
తెలుగులో అనసూయ డిఫరెంట్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2లో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నది. దాక్షాయణిగా సెకండ్ పార్ట్‌లో అనసూయ క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా సాగనున్నట్లు సమాచారం. అలాగే అనసూయ లీడ్ రోల్‌లో నటించిన ఆరి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు అనసూయ్య నటించిన మరికొన్ని తెలుగు సినిమాలు ఈ ఏడాదే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.