Prabhudeva Wolf: ఏదో తేడాగా ఉందే - ప్రభుదేవా, అనసూయ పాన్ ఇండియన్ మూవీ టైటిల్‌పై ట్రోల్స్
Prabhudeva Wolf: ప్రభుదేవా పాన్ ఇండియన్ మూవీ వూల్ఫ్ కొత్త పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. పోస్టర్లో తెలుగు టైటిల్ వుల్ఫగా కనిపించడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Prabhudeva Wolf: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. అడపాదడపా డైరెక్షన్, కొరియోగ్రఫీపై ఫోకస్ పెడుతోన్న ఆయన యాక్టింగ్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా వూల్ఫ్ పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
ట్రాన్స్లేషన్ లోపాల కారణంగా ఈ సినిమా తెలుగు టైటిల్ వుల్ఫగా పడింది. మేకర్స్ అలాగే టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఈ మూవీ టైటిల్‌ను ట్రోల్ చేస్తున్నారు. తెలుగులో ఉల్ఫ అనేది బూతు పదంగా వాడుతారు. అది కూడా తెలుసుకోకుండా ట్రాన్స్‌లేట్ చేయడం ఏమిటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్‌తోనే మేకర్స్ డేడికేషన్ ఎలా ఉందో అర్థమైపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. టైటిల్ ఏదో తేడా కొడుతుందే అంటూ మరికొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న 60వ సినిమా ఇది. ఈ సినిమాకు విను వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో రాయ్‌లక్ష్మి, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. వూల్ఫ్తోపాటు తమిళంలో ఫ్లాష్‌బ్యాక్ అనే సినిమా చేస్తున్నాడుప్రభుదేవా. ఇందులోనూ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది