Simba Director: స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్న సింబా డైరెక్ట‌ర్ - ఆ యాంక‌ర్ స్ఫూర్తితోనే క‌థ రాశాన‌న్న సంప‌త్ నంది-director murali manohar gets emotional at simba movie pre release event anasuya tollywood sampath nandi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simba Director: స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్న సింబా డైరెక్ట‌ర్ - ఆ యాంక‌ర్ స్ఫూర్తితోనే క‌థ రాశాన‌న్న సంప‌త్ నంది

Simba Director: స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్న సింబా డైరెక్ట‌ర్ - ఆ యాంక‌ర్ స్ఫూర్తితోనే క‌థ రాశాన‌న్న సంప‌త్ నంది

Nelki Naresh Kumar HT Telugu
Aug 05, 2024 11:49 AM IST

Simba Director: సింబా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ ముర‌ళీ మ‌నోహ‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతోన్న ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు

సింబా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
సింబా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Simba Director: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ (Anasuya) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సింబా మూవీ ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో ముర‌ళీ మ‌నోహ‌ర్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. దాస‌రి రాజేంద‌ర్‌రెడ్డితో క‌లిసి ద‌ర్శ‌కుడుసంప‌త్ నంది ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

డైరెక్ట‌ర్ ఎమోష‌న‌ల్‌...

సింబా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ ముర‌ళీ మ‌నోహ‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఈ సినిమా జ‌ర్నీని గుర్తుచేసుకొని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రేట్‌ ఐడియాతో ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ క‌థ‌ను రాశాడ‌ని డైరెక్ట‌ర్ అన్నాడు.

క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు చెప్పిన వాటిని కాద‌ని ప్రొడ్యూస‌ర్ ఈ మూవీని నిర్మించాడ‌ని తెలిపాడు. ద‌ర్శ‌కుడిగా ఇక్క‌డికి రావ‌డం వెనుక ఎన్నో క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌ని చెబుతూ ఉద్వేగానికి గుర‌య్యాడు. ఈజ‌ర్నీలో త‌ల్లిదండ్రుల‌తో పాటు భార్య త‌న‌కు ఎంతో స‌పోర్ట్ చేశార‌ని చెబుతూ స్పీచ్ మ‌ధ్య‌లోనే ముగించాడు.

యాంక‌ర్ ఉద‌య‌భాను వ‌ల్లే...

ఈ ప్రీ రిలీజ్ వేడుక‌లో సంప‌త్ నంది మాట్లాడుతూ "సింబా మూవీ మొదలవ్వడానికి కారణం యాంక‌ర్ ఉదయభాను కార‌ణం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే సింబా కథ విన్నా. ప్ర‌కృతి వ‌న‌రులు, ప‌చ్చ‌ద‌నం ప‌ట్ల అంద‌రికి కనువిప్పు కలిగేలా, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటూనే మంచి సందేశం ఇచ్చేలా సింబా ఉంటుంది.

సమాజానికి మంచి చేయాలని, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాం. ఆగ‌స్ట్ 9న రాబోతోన్న సింబా ఏ ఒక్కర్నీ నిరాశపర్చదుఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు. ఆగస్ట్ 22న చిరంజీవి గారికి పుట్టిన రోజున కొన్ని వేల మొక్కల్ని బ‌హుమానంగా ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నామ‌ని నిర్మాత రాజేంద‌ర్‌రెడ్డి అన్నాడు. సింబా సినిమా నుంచి వ‌చ్చే లాభాల్ని కూడా మొక్కల రూపంలోనే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నామ‌ని" తెలిపాడు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు అభిమానిని...

అనసూయ మాట్లాడుతూ “క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller) సినిమాలకు నేను అభిమానిని. ఇందులో అక్షిత అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట‌లు, క‌లెక్ష‌న్స్‌తో పాటు మైండ్ ఛేంజ్ చేసే ప‌వ‌ర్ ఉంటుంద‌ని సింబా చాటిచెబుతుంది” అని తెలిపింది.

ఫ్రీగా టికెట్లు...

సింబా మూవీలో గౌత‌మి, క‌స్తూరి శంక‌ర్‌, దివి, శ్రీనాథ్ మాగంటి కీల‌క పాత్ర‌లు చేశారు. సంప‌త్ నంది వ‌ద్ద ఏమైంది ఈవేళ నుంచి గౌత‌మ్ నందా వ‌ర‌కు ప‌లు సినిమాల‌కు ముర‌ళీమ‌నోహ‌న్ అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. సింబా మూవీతోడైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మొక్క‌లు నాటి వాటి ఫొటోల‌ను త‌న‌కు పంపిస్తే సింబా మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామ‌ని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు శ్రీనాథ్ మాగంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌క‌టించారు.

టాపిక్