తెలుగు న్యూస్  /  Entertainment  /  Amitabh Bachchan And Anushka Sharma Violating Traffic Rules Netizens Trolled

Anushka Sharma Traffic Challan: అమితాబ్, అనుష్కశర్మకు షాకిచ్చిన ముంబై పోలీసులు - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌నందుకు ఫైన్‌

HT Telugu Desk HT Telugu

16 May 2023, 10:35 IST

  • Anushka Sharma Traffic Challan: బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు అనుష్క శ‌ర్మ‌కు ముంబై ట్రాఫిక్ పోలీసులు భారీ జ‌రిమానా విధించారు. కార‌ణం ఏమిటంటే...

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అనుష్క శ‌ర్మ‌
అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అనుష్క శ‌ర్మ‌

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అనుష్క శ‌ర్మ‌

Anushka Sharma Traffic Challan: బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు విరాట్ కోహ్లి స‌తీమ‌ణి, హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌కు ముంబై ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. సోమ‌వారం అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అనుష్క శ‌ర్మ వేర్వేరు బైక్‌ల‌పై ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే హెల్మెట్ లేకుండా బైక్ ప్ర‌యాణం చేసినందుకు ఇద్ద‌రికీ ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించారు.

ట్రెండింగ్ వార్తలు

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో 5 భాషల్లో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

Vennela Kishore OMG Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!

సోమ‌వారం ముంబై ట్రాఫిక్‌లో కారు చిక్కుకుపోవ‌డంతో ఓ అప‌రిచిత వ్య‌క్తిని లిఫ్ట్ అడిగి అత‌డి బైక్‌పై షూటింగ్ లొకేష‌న్‌కు స‌రైన స‌మ‌యంలో చేరుకున్న‌ట్లు అమితాబ్‌బ‌చ్చ‌న్ ట్వీట్ చేశాడు. అమితాబ్ బైక్ రైడ్‌ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే ఈ ఫొటోలో బైక్ రైడ‌ర్‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ హెల్మెట్ ధ‌రించ‌లేదు. దాంతో బాధ్య‌త‌ల‌గ‌ల న‌టుడై ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అమితాబ్‌తో పాటు బైక్ రైడ‌ర్‌పై ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దాంతో ముంబై పోలీసులు అమితాబ్‌కు జ‌రిమానా విధించిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు అనుష్క శ‌ర్మ కూడా కారును ప‌క్క‌న‌పెట్టి త‌న బాడీ గార్డ్ బైక్‌పై ముంబై వీధుల్లో సోమ‌వారం చ‌క్క‌ర్లు కొడుతూ క‌నిపించింది. ఇందులో అనుష్క‌తో పాటు ఆమె బాడీగార్డ్ కూడా హెల్మెట్ ధ‌రించ‌లేదు. అనుష్క శ‌ర్మ బైక్ రైడ్ వీడియోను ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు నెటిజ‌న్లు.

హెల్మెట్ ధ‌రించ‌నుందుకు అనుష్క శ‌ర్మ‌కు ముంబై పోలీసులు ఛ‌లాన్ విధించిన‌ట్లు తెలిసింది. ట్రాఫిక్ రూల్స్ గురించి గ‌తంలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు చేసిన కామెంట్స్‌ను అమితాబ్‌, అనుష్క వీడియోల‌కు జ‌త చేస్తూ నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అమితాబ్‌బ‌చ్చ‌న్ తెలుగులోప్రాజెక్ట్ కే సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మ‌రోవైపు జులాన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చ‌క్ధా ఎక్స్‌ప్రెస్ సినిమాతో అనుష్క శ‌ర్మ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.