తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun, Vijay Deverakonda And Yash Will Attend As Special Guests For Siima 2022 Day 1

Allu arjun - Yash: ఒకే వేదికపై అల్లు అర్జున్,యశ్, విజయ్ దేవరకొండ

HT Telugu Desk HT Telugu

10 September 2022, 17:41 IST

  • Allu arjun - Yash: సైమా అవార్డు వేడుకలు నేడు బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అవార్డు వేడుకలకు అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. వారితో పాటు ఈ వేడుకలకు హాజరుకానున్న స్టార్స్ ఎవరంటే...
అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Instagram)

అల్లు అర్జున్

Allu arjun - Yash: సైమా పదో ఎడిషన్ అవార్డ్ వేడుకల సందడి నేడు మొదలుకానుంది. బెంగళూరు వేదికగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ అవార్డ్ వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలో 2021 ఏడాదిలో సత్తా చాటిన దక్షిణాది సినిమాలకు భాషల వారిగా అవార్డులు ఇవ్వబోతున్నారు. కాగా శనివారం జరిగే తొలి రోజు అవార్డ్ వేడుకల కోసం అల్లు అర్జున్ బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

Pushpa 2 First Song: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే.. అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్

Laapata Ladies OTT: లాపతా లేడీస్ మూవీకి రివ్యూ ఇచ్చిన ఆలియా భట్.. ఏమన్నారంటే..

Heeramandi: ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్

తొలిరోజు సైమా వేడుకలకు అల్లు అర్జున్ తో పాటు కేజీఎఫ్ ఫేమ్ యశ్, విజయ్ దేవరకొండ, రణ్‌వీర్ సింగ్‌ స్పెషల్ గెస్ట్ లుగా హాజరుకానున్నారు. ఈ యంగ్ హీరోలతో పాటు కమల్ హాసన్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఒకే వేదికపై అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండ, రణ్ వీర్ సింగ్ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

సైమా అవార్డు వేడుకల్లో టాలీవుడ్ నుంచి పుష్ప 12 నామినేషన్స్ తో టాప్ ప్లేస్ లో నిలవగా పది నామినేషన్స్ తో అఖండ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఉప్పెన, జాతిరత్నాలు, పలు సినిమాలు అవార్డు రేసులో నిలిచాయి. తమిళంలో ధనుష్ కర్ణన్ సినిమా పది నామినేషన్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. కన్నడంలో రాబర్ట్, గరుడ గమన వృషభ వాహన, సినిమాలు అవార్డు రేసులో నిలిచాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.