తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Ntr Boxoffice Clash Ntr30 And Pushpa The Rule Release In Summer 2024

Ntr vs Allu Arjun: ఎన్టీఆర్‌తో బ‌న్నీ బాక్సాఫీస్ ఫైట్‌- మూడు రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్ 30, పుష్ప 2 రిలీజ్‌

02 April 2023, 6:02 IST

  • Ntr vs Allu Arjun: ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ఫ‌స్ట్‌టైమ్ బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ సినిమాకు పోటీగా అల్లు అర్జున్ పుష్ప -2 రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం

అల్లు అర్జున్, ఎన్టీఆర్
అల్లు అర్జున్, ఎన్టీఆర్

అల్లు అర్జున్, ఎన్టీఆర్

Ntr vs Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌ (Ntr), అల్లు అర్జున్ (Allu Arjun) తొలిసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

మ‌రోవైపు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప‌-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఈ సీక్వెల్‌ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే డేట్ క‌న్ఫామ్ అయితే మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఖాయం అవుతుంది.

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకొని పుష్ప -2 వెన‌క్కి త‌గ్గుతుందా ? అదే డేట్‌కు క‌ట్టుబ‌డి ఉండి ఎన్టీఆర్‌తో ఫ‌స్ట్ టైమ్ బాక్సాఫీస్ ఫైట్‌కు అల్లు అర్జున్ సిద్ధ‌మ‌వుతాడా? అన్న‌దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

సెట్స్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్…

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత షూటింగ్‌ల‌కు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ శ‌నివారం నుంచి కొర‌టాల శివ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. కోస్ట‌ల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప -2 షూటింగ్ హైద‌రాబాద్‌లో జుగుతోంది. ఫ‌స్ట్ పార్ట్ స‌క్సెస్ నేప‌థ్యంలో పుష్ప ది రూల్ సినిమాపై పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. పుష్ప -2లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.