తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Ott Release Date: ఓటీటీలోకి బిగ్‌బాస్ అజ‌య్ క‌తుర్వార్ విశ్వ‌క్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ రివీల్‌

Vishwak OTT Release Date: ఓటీటీలోకి బిగ్‌బాస్ అజ‌య్ క‌తుర్వార్ విశ్వ‌క్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ రివీల్‌

HT Telugu Desk HT Telugu

30 May 2023, 12:35 IST

  • Vishwak OTT Release Date: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫేమ్ అజ‌య్ క‌తుర్వార్ విశ్వ‌క్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఏ ఓటీటీలో ఏ రోజు ఈ మూవీ రిలీజ్ కానుందంటే...

విశ్వ‌క్ మూవీ
విశ్వ‌క్ మూవీ

విశ్వ‌క్ మూవీ

Vishwak OTT Release Date: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనితెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు అజ‌య్ క‌తుర్వార్‌. ఆట‌తీరు కంటే ఆటిట్యూడ్ తోనే ఫేమ‌స్ అయ్యాడు. అత‌డు హీరోగా న‌టించిన విశ్వ‌క్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. జూన్ 2 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా జీ5లో రిలీజ్ కానున్న ఈ మంచి సినిమాను ఆద‌రించాల‌ని అజ‌య్ క‌తుర్వార్ ట్విట్ట‌ర్ ద్వారా కోరారు.

విదేశాల‌కు వెళ్ల‌కుండా ఇండియాలోనే స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లుక‌న్న ఓ యువ‌కుడికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌న్న‌ది ఈ సినిమా క‌థ‌. విదేశీమోజు లో ప‌డిపోయిన యువతరం ఆలోచ‌నా విధానం మారాల‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వేణు ముల్క‌ల్ల ఈ సినిమాను తెర‌కెక్కించారు.

సందేశాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైంది. అజ‌య్ న‌ట‌న బాగుంద‌నే పేరొచ్చినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా మాత్రం నిల‌వ‌లేక‌పోయింది. ఓటీటీలో ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తార‌న్న‌ది చూడాల్సిందే.

విశ్వ‌క్ సినిమాలో డింపుల్ హీరోయిన్‌గా న‌టించింది. విశ్వ‌క్ తో పాటు రాగ‌ల ఇర‌వై నాలుగు గంట‌ల్లో, ప్రేమ‌దేశం, మెహ‌బూబా సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు విశ్వ‌క్‌. హీరోగా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తోన్నాడు. ప్ర‌స్తుతం అజ‌య్ గాడు తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌టిస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.